top of page

అదీ సంఫీుల నిస్సిగ్గు జీవనం..

Writer: DV RAMANADV RAMANA

స్వాతంత్య్రం వచ్చి డెబ్భై ఐదేళ్లయిన సందర్భంగా ఆజాదీ అమృత మహోత్సవాలు జరుపుకుని నడు స్తున్న వేళ, ఇది స్వాతంత్య్రమే కాదని గుర్తించ నిరాకరించడం ఈ దేశభక్త నాయకునికి ఎలా సాధ్యమైంది? ఈ మధ్య రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అధిపతి మోహన్‌ భగవత్‌ మాట్లాడుతూ దేశానికి 1947 ఆగస్టు 15న వచ్చింది అసలు స్వాతంత్య్రం కాదని, 2024 జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రతి ష్టాపనతోనే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని పేర్కొన్నాడు. అంతేకాదు, రాముడు, కృష్ణుడు, శివుడు కేవలం దేవుళ్లే కాదు, మన నాగరికతా విలువలకు, సనాతన ధర్మానికి గుర్తులు అని బోధించారు. రెండు విలువల మధ్య యుద్ధం జరిగి విజయం పొందిన సందర్భం అని సెలవిచ్చారు. ఇది అత్యంత దారుణమైన విషయం. రాముడు, కృష్ణుడు, శివుడు ఇంకా ముప్పది మూడు కోట్ల దేవుళ్లు ఉండవచ్చు గాక, వారిని విశ్వాసాల మేరకు ఆరాధించనూవచ్చు. కానీ వారికి గుడులను నిర్మించడానికి, విగ్రహాలు ప్రతిష్టించడానికీ, మన దేశ స్వాతంత్య్రానికి ముడివేయటం అసంబద్ధమైన వాదం మాత్రమే. ఒక దేవుని గుడిని కూలగొట్టి, మరో దేవునికి గుడి కట్టడం స్వాతంత్య్రం ఎలా అవుతుంది? అంతేకాదు, ఈ వాదన మనం ఇంతకాలంగా అనుభవిస్తున్న స్వేచ్ఛను, ఆధునిక ప్రజాస్వామిక విధానాన్ని, రాజ్యాంగ విలువలను అపహాస్యం చేసినట్టేకదా. రెండొందల ఏళ్ల ఆంగ్లేయుల పాలన నుంచి విముక్తి పొందేందుకు ప్రజలు పోరా డిన చరిత్రనంతా చులకన చేయటం వారికే చెల్లింది. ఎంతోమంది యోధులు తమ జీవితాలను త్యాగం చేశారు. ప్రాణాలిచ్చారు. ఉరికంభాలెక్కారు. ఆఖరికి స్వేచ్ఛను సాధించారు. ఎలాంటి పాలన కావాలో ఆలో చించి ప్రజాస్వామిక విలువలతో కూడిన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వీటన్నింటినీ ఒక్కమాటతో తిరస్కరిస్తారా! ప్రాణత్యాగాలను విస్మరించి, స్వాతంత్య్రాన్నే కించపరుస్తారా? అవును, మీరు రాజుల కాలం నాటి బానిస భావాల వారసులు. నేటి ఆధునిక ప్రజాస్వామిక విలువలంటే చిర్రెత్తుకొస్తారు. మనుధర్మం తప్ప రాజ్యాంగమంటే మీకు ద్వేషం. మొన్న మొన్నటి వరకూ మన మూడు రంగుల జెండాను కూడా ఎగ రేయడానికి పూనుకోలేదు కదా! ఎందుకెగరేస్తారులే! అసలు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొంటే కదా! కాదు కాదు, ఆ పోరాటానికి వ్యతిరేకంగా బ్రిటిష్‌ వారికి వంతపాడిన వారసులు మీరనే విషయం ఈ సందర్భం గా గుర్తుచేసుకుంటున్నాం. పోరాడటం, త్యాగం చేయటం మీకు గిట్టని విషయం. ఒక్కసారి చరిత్రను చూడండి. లక్షలాది మంది ప్రజలు కుల, మత, ప్రాంత భేదాలేవీ లేక ఐక్యంగా పోరాడి పొందిన ఫలితాన్నే ఈ భగవత్‌, వారి వారసులూ అనుభవిస్తున్నారు. చరిత్రనూ తొక్కేయాలని చూస్తున్నారు. భిన్నమతాల వారు వీరులుగా పోరాడి మనకు స్వాతంత్య్రాన్ని ఇచ్చిపోయారు. మీరేమో మతతత్వ కళ్లతో చూసి మాట్లాడుతు న్నారు. పాశ్చాత్య దేశాల ఫాసిస్టు ఉద్యమాల నుంచి ప్రేరణ పొందిన సంఫ్‌ు సేవకులు ప్రజాస్వామ్యాన్నీ, స్వేచ్ఛను భరించడం కష్టంగానే ఉంటుంది మరి! స్వేచ్ఛ కోసం జరిగిన సమరంలో అసలు పాల్గొనని వారి మాటలు ఇంతకన్నా గొప్పగా ఏం ఉంటాయి. చెప్పుకోవటానికి సచ్చరిత్రే లేనివాళ్లు హీనులుగా మిగిలిపోక తప్పదు. దేశభక్తి గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పే వీళ్ల అసలు దేశభక్తి ఇది. దేశం కోసం ప్రాణాలర్పిం చిన వారిని కించపరచడం, దేశ స్వాతంత్య్రాన్ని గుర్తించ నిరాకరించడం వీరి నైజం. ప్రజలు ఇలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలి. నాడీ, నరం, బుద్ధి, కండ, శరీరంలోని అణువణువు పరమత, ప్రాంత, భావ ద్వేషంతో నిండిపోయిన ఒక సంఫీు చెబుతున్న మాట. ఉరిశిక్షలు అనుభవించిన వాళ్లు దాదాపు అందరి పేర్లు అంటే భగత్‌ సింగ్‌, చంద్రశేఖర్‌, రాజ గురు, సుఖదేవ్‌, ఖుదీరాం బోస్‌, ఎఎఫ్‌ ఖాన్‌ మొద లైన పేర్లు మనకు తెలుస్తూనే ఉంటాయి. వీళ్లు చెప్పేది స్వతంత్ర పోరాటంలో ఉరి తీయబడిన భారతీ యులు 3.50 లక్షలు అని. ఇది ఎంత హాస్యాస్పదమో ఒకసారి చూడండి. పైగా భారతీయులు తమ జాతి విముక్తి కోసం అంతమందిని కన్న దేశం మనదే అంటూ తెగ గర్వపడిపోతున్నారు. సింగపూర్‌లో కొంత కాలం భారతీయులకు ఉద్యోగాలు ఇచ్చేవారు కాదని వింటాం. కారణం ఏంటంటే బ్రిటిష్‌ ప్రభుత్వంలో ఉద్యోగాలు చేసినవాళ్లు భారతీయులు. అంటే స్వదేశీయులకు, స్వదేశానికీ వ్యతిరేకంగా పనిచేసే స్వభావం భారతీయులకు ఉంటుందంటూ అక్కడ కొంతకాలం భారతీయులకు ఉద్యోగాలు ఇచ్చేవారు కాదట. ఇక్కడి సంఫీులు ప్రశ్నించే వాళ్లు ఎవరూ ఉండరని ఇలా తప్పుడు రాతలు రాసుకుంటూ పోతారు. కొసమెరుపు ఏంటంటే.. ఉరికంబం ఎక్కినవాడే కాదు, భారత స్వాతంత్య్రం కోసం కనీసం జైలుకెళ్లిన వాళ్లు కూడా ఒక్కడంటే ఒక్క సంఫీు లేడు. వెళ్లిన ఒక్కడు క్షమాపత్రం రాసి తిరిగి వచ్చేశాడు, జీవిత కాలం పాటు పెన్షన్‌ తీసుకున్నాడు. అదీ సంఫీుల నిస్సిగ్గు జీవనం. అలాంటి మహోన్నత పోరాటంలో తమకు పాత్ర లేదే అని సిగ్గుపడటం మానేసి ఇతరులు చేసిన ఘనతకు తామెక్కువ విజయోత్సహాలు జరిపేసుకుని ఆ ఘనత ను తమ ఖాతాలో వేసేసుకునే నిస్సిగ్గు జట్టే సంఫీులంటే.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page