మురుగులో దిగితేనే రక్షిత మంచినీరు
ఎస్సీ వీధిలో మురికి కాల్వల మధ్యలో తాగునీటి కుళాయిలు
(సత్యంన్యూస్, కొత్తూరు)
నివగాం గ్రామం ఎస్సీ వీధిలో మంచినీటి కోసం మహిళలు పడుతున్న బాధలు వర్ణనాతీతం. ఇక్కడి ప్రజలు మంచినీటి కోసం మురికి కాల్వలో దిగాల్సిందే. వీరి పరిస్థితి చూస్తే దయనీయంగా ఉంది. ఈ రోజుల్లోనూ ఇలాంటి వాతావరణంలో జీవిస్తున్నారడానికి ఇదో తార్కాణం. నివగాం గ్రామం ఎస్సీ వీధిలో స్థానిక మహిళలు మురికినీటి కాల్వల మద్య మంచినీటి కుళాయి దగ్గర తాగటానికి మంచినీరు పడుతూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు, స్థానిక నాయకులు వీరి కష్టాలను చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానిక మహిళలు తమ గోడును వెల్లడిరచారు. అలాగే ఇక్కడ మంచినీరు తాగటం వల్ల తాము అనారోగ్యానికి గురవుతున్నామని, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా తమ కష్టాలు తీరటం లేదని వాపోతున్నారు. ఇకనైనా తమ బాధను అర్థం చేసుకొని తక్షణమే చర్యలు తీసుకొని మంచినీటి కష్టాలు తీర్చాలని కోరుతున్నారు.

Komentáře