అరుంధతిగా శ్రీలీల?!
- Guest Writer
- Oct 30
- 2 min read

రెండు రోజుల క్రితం నుంచి సోషల్ మీడియాలో అరుంధతి హిందీ రీమేక్ గురించి వార్తలు వినిపిస్తున్నాయి. దీనిలో శ్రీలీల హీరోయిన్ గా ఉండబోతుందంట. అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తారట. అలాగే మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారట. ఇదంతా బానే ఉంది. కానీ అసలు ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు అరుంధతి రీమేక్ విషయం ఎందుకు గుర్తొచ్చింది అనేది అందరి ప్రశ్న. టాలీవుడ్‌లో బాలీవుడ్ ఇప్పటికే ఈ సినిమాను అందరు చూసేసారు. అయినాసరే సడెన్‌గా ఇప్పుడు అరుంధతి రీమేక్ ఎందుకు వచ్చింది అనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు.
పైగా అరుంధతి పాత్రలో అనుష్క చేసిన తర్వాత.. ఆ ప్లేస్‌లో ఇంకొకరిని ఊహించుకోవడం కూడా కాస్త కష్టంగానే ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. శ్రీలీల బాలీవుడ్ ప్రేక్షకులను ఎంతవరకు అట్రాక్ట్ చేయగలదు అనేది కూడా ఆలోచించాల్సిన విషయమే అని టాక్. గద్వాల్ రాణిగా అనుష్కలోని హుందాతనం, రాజసం.. ఇంత స్లిమ్‌గా ఉన్న శ్రీలీల సెట్ అవుతాయా అంటే కాస్త కష్టమే అని చెప్పాలి. ఏదేమైనా సరే ఇది చేయాల్సిందే అంటే మాత్రం శ్రీలలకు ఇది చాలా పెద్ద బాధ్యత.
సరే శ్రీలీల గురించి పక్కన పెట్టేసి కంటెంట్ విషయానికొస్తే.. బాలీవుడ్ లో తీసిన హిస్టారికల్ ఫిలిమ్స్, పీరియాడిక్ డ్రామాస్ అక్కడ ఎలాంటి టాక్ సంపాదించుకుంటాయో.. తెలుగులో కూడా అలాంటి టాక్‌నే సంపాదించుకుంటాయి. కానీ ఇక్కడ భీభత్సంగా ఆడిన సినిమాలు మాత్రం బాలీవుడ్‌కు వెళ్ళేటప్పటికి డీలా పడిపోతూ ఉంటాయి. జెర్సీ, హిట్ ది ఫస్ట్ కేస్, భాగమతి సినిమాలు దీనికి ఉదాహరణలు. ప్రస్తుతానికైతే ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. అఫీషియల్ అనౌన్సుమెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.
- ఐదాత్రి.కామ్ సౌజన్యంతో...
మహాకాళి వచ్చేసింది..!! పీసీయూ ట్విస్ట్ అదుర్స్..!

హనుమాన్ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న సినిమా మహాకాళి. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు మేకర్స్. ఆర్.కె.డి స్టూడియోస్ బ్యానర్ లో కె. దుగ్గల్ అండ్ రివాజ్ రమేష్ గుద్దల్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. సినిమాలో లీడ్ యాక్టర్ గా భూమి శెట్టి నటిస్తుంది. కన్నడ యాక్టర్ అయిన ఆమె సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాధించుకుంది. అంతేకాదు తన ఒరిజినల్ స్కిన్ టోన్ తోనే తను ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా ఫాలోవర్స్ ని మెప్పిస్తుంది.
మహాకాళి టైటిల్ కి తగినట్టుగానే ఫస్ట్ లుక్.. ప్రశాంత్ వర్మ మహాకాళి కోసం ఆమెను ఎంపిక చేయడానికి మెయిన్ రీజన్ కూడా అదే అని తెలుస్తుంది. ఇక ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ఫస్ట్ లుక్ చూస్తే భూమి శెట్టి ఇంటెన్స్ లుక్ అదిరిపోయింది. మహాకాళి టైటిల్ కి తగినట్టుగానే ఈ లుక్ ఉంది. ఒండినిండా బంగారంతో కాళీ అవతారంలో భూమి శెట్టి ఫస్ట్ లుక్ తోనే ప్రేక్షకుల మనసులు గెలిచేసింది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో కథ, స్క్రీన్ ప్లే ప్రశాంత్ వర్మ అందిస్తున్న ఈ సినిమాను పూజా కొల్లూర్ డైరెక్ట్ చేస్తున్నారు.
హనుమాన్ తో ప్రశాంత్ వర్మ పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇండియన్ సూపర్ హీరో కథ అంటూ హనుమాన్ తో నేషనల్ లెవెల్ ఆడియన్స్ ని మెప్పించిన ప్రశాంత్ వర్మ నెక్స్ట్ తన డైరెక్షన్ లో జై హనుమాన్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాతో పాటు మహాకాళి సినిమాకు తన సపోర్ట్ అందిస్తున్నాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అంటూ మహాకాళి కథను ఎలా తన సినిమాలకు కనెక్ట్ చేస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రశాంత్ వర్మ హనుమాన్ తో పాన్ ఇండియా క్రేజ్..
అ! తో డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన ప్రశాంత్ వర్మ హనుమాన్ తో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఐతే జై హనుమాన్ కన్నా ముందే మహాకాళితో తన సినిమాటిక్ యూనివర్స్ రేంజ్ ఏంటో చూపించబోతున్నాడు. మహాకాళి కథ ఏంటి అది ఎలా ఉండబోతుంది అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. కానీ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తేనే సినిమా పై ఒక క్రేజీ వైబ్ క్రియేట్ అయ్యింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వ పర్యవేక్షణలో కాబట్టి తప్పకుండా ఈ సినిమా కూడా తన సినిమాల రేంజ్ ఉంటుందని చెప్పొచ్చు. మహాకాళి ఫస్ట్ లుక్ తోనే ఆడియన్స్ లో ఒక క్రేజ్ ఏర్పడిరది. ప్రత్యేకంగా ఈ రోల్ కోసం భూమి శెట్టిని ఎంపిక చేసిన తీరు సినిమా కోసం పర్ఫెక్షన్ ఎంత అవసరం అన్నది ప్రూవ్ చేశారు. మరి భూమి ఈ ఛాన్స్ ని ఎలా వాడుకుంటుంది అన్నది చూడాలి.
-తుపాకి.కామ్ సౌజన్యంతో...










Comments