top of page

అవికా గోర్‌.. అల్ట్రా గ్లామర్‌ మామూలుగా లేదు

  • Writer: ADMIN
    ADMIN
  • Aug 20, 2024
  • 3 min read

చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌ ద్వారా తెలుగు ప్రేక్షకులకి సుపరిచితం అయిన బ్యూటీ అవికా గోర్‌. ఈ అమ్మడు ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్‌ గా కెరియర్‌ స్టార్ట్‌ చేసింది. మొదటి సినిమానే సూపర్‌ హిట్‌ అయ్యింది. తరువాత నాగ శౌర్యకి జోడీగా లక్ష్మి రావే మా ఇంటికి మూవీ చేసింది. ఈ సినిమా ఎవరేజ్‌ టాక్‌ తెచ్చుకుంది. మళ్ళీ రాజ్‌ తరుణ్‌ తో సినిమా చూపిస్త మావ మూవీలో నటించింది. ఈ మూవీ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయ్యింది.

అక్కడి నుంచి అవికా గోర్‌కి అవకాశాలు పెరిగాయి. తెలుగుతో పాటు కన్నడ, హిందీ భాషలలో కూడా అవికా గోర్‌ అవకాశాలు అందుకుంది. నిఖిల్‌ కి జోడీగా ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీతో మరో హిట్‌ ని అవికా గోర్‌ తన ఖాతాలో వేసుకుంది. తరువాత తెలుగుకి కొంత గ్యాప్‌ ఇచ్చింది. మరల స్లిమ్‌ అయ్యి రాజుగారి గది2తో సూపర్‌ హిట్‌ అందుకుంది. ఆ తరువాత అవికా గోర్‌ చేసిన సినిమాలు ఏవీ కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేదు.

చివరిగా తెలుగులో ఉమాపతి అనే సినిమాలో అవికా గోర్‌ కనిపించింది. హిందీలో బ్లడీ ఇష్క్‌ అనే మూవీతో రీసెంట్‌ గా అవికా గోర్‌ ప్రేక్షకుల ముందుకొచ్చింది. హర్రర్‌ జోనర్‌ లో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేదు. అయితే బాలీవుడ్‌ లోనే ప్రస్తుతం అవికా గోర్‌ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తోంది. దీనికోసం తనని తాను గ్లామర్‌ గా షోకేస్‌ చేసుకుంటుంది. రెగ్యులర్‌ గా హాట్‌ ఫోటోషూట్‌ లని ఇన్‌ స్టాగ్రామ్‌ లో షేర్‌ చేస్తోంది.

తాజాగా మరోసారి అదిరిపోయే అందంతో మెస్మరైజ్‌ చేసే లుక్స్‌ తో హాట్‌ ఫోటోలని అవికా గోర్‌ ఇన్‌ స్టాగ్రామ్‌ లో పంచుకుంది. లాంగ్‌ ఫ్రాక్‌ లో స్టైలిష్‌ గా ఫోజులిస్తూ తనలో ఉన్న యాటిట్యూడ్‌ ని ఈ ఫొటోలతో ఎలివేట్‌ చేస్తోంది. ఈ ఫోటోలకి అవికా గోర్‌ ఇంటరెస్టింగ్‌ కామెంట్‌ కూడా జోడిరచింది. గుండెలు బద్దలయ్యే విషయం ఒకటైతే. ఇందులో నా ఇగో ఇంకోటి కూడా ఉందంటూ పేర్కొంది. ఈ పిక్స్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లు నుంచి అవికా గోర్‌ యాటిట్యూడ్‌ పిక్స్‌ పై అదిరిపోయే కామెంట్స్‌ వస్తున్నాయి.

___

‘పుష్ష 2’ భారమంతా దేవిశ్రీపైనే!

ఆగస్టు 15న రావాల్సిన ‘పుష్ష 2’ డిసెంబరుకు వెళ్లిపోయింది. డిసెంబరు నాటికైనా ఈ సినిమా వస్తుందా? రాదా? అనేది కొంతమంది అనుమానం. కానీ ఈసారి డేట్‌ విషయంలో తగ్గేదే లేదంటోంది పుష్ష టీమ్‌. కానీ అనుకొన్న సమయానికి ఈ సినిమా బయటకు రావడం దేవిశ్రీ ప్రసాద్‌ చేతుల్లోనే ఉంది. ‘పుష్ష 2’కు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. పాటల విషయంలో దేవి చాలా స్పీడు. కానీ ఆర్‌.ఆర్‌కు మాత్రం సమయం తీసుకొంటాడు. పుష్ష లాంటి క్రేజీ సినిమాల విషయంలో తాను మరింత ఎఫర్ట్‌ పెట్టాలి. అందుకే తనకు ఎట్టిపరిస్థితుల్లో రెండు నెలల ముందు ఫుటేజీ ఇవ్వాల్సిందే అని దేవిశ్రీ ప్రసాద్‌ చెబుతున్నాడట. అంటే.. సెప్టెంబరు నెలాఖరుకు సినిమా మొత్తం పూర్తవ్వాలి. అప్పుడు సరిగ్గా దేవి చేతిలో రెండు నెలల సమయం ఉంటుంది. ఆర్‌.ఆర్‌ ఇవ్వడానికి ఈ మాత్రం సమయం కావాలి కూడా. అయితే సుకుమార్‌ ఆ టైమ్‌ లో అవుట్‌ పుట్‌ ఇవ్వగలడా? లేదా? అనే డౌటు ఉంది. సుకుమార్‌ కేవలం 40 రోజుల ముందే అవుట్‌ పుట్‌ ఇస్తానని దేవికి చెబుతున్నాడట. ఆ 40 రోజుల్లో ఆర్‌.ఆర్‌ పూర్తి చేయడం కత్తి మీద సామే. కొంతమంది సంగీత దర్శకులు సినిమాకు ముక్కలు ముక్కలుగా ఆర్‌.ఆర్‌ ఇస్తుంటారు. ఏ సీన్‌ అయితే ఆ సీన్‌కి బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ కొట్టేస్తారు. కానీ దేవి ఆ టైపు కాదు. సినిమా మొత్తం ఒకే ఫ్లో లో ఉండాలని కోరుకొనే వ్యక్తి. మొత్తం సినిమా తన చేతుల్లో ఉంటే గానీ, ఆర్‌.ఆర్‌. ఇవ్వడు. ఈ విషయం సుకుమార్‌కీ తెలుసు. కాకపోతే దేవి రెండు నెలల్లో చేయాల్సిన పనిని ఇప్పుడు 40 రోజుల్లో పూర్తి చేయాలి. అలా ఒత్తిడంతా సుకుమార్‌ నుంచి దేవిశ్రీ ప్రసాద్‌కు షిఫ్ట్‌ అయ్యింది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ క్లైమాక్స్‌ సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు.

____

ఇదేం పని రాజా??

సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ వ్యవహారాలు అనేది చాలా కామన్‌.. ప్రేమ, డేటింగ్‌ అనే వ్యవహారాలను చాలా కామన్‌ గా చూస్తూ ఉంటారు సెలబ్రిటీలు. కానీ కొంతమంది హీరోయిన్లు, హీరోలు మాత్రం వేరే వాళ్లతో ఘడమైన ప్రేమలో మునిగిపోతూ ఉంటారు. ఎంతలా అంటే వారిని పెళ్లి చేసుకునేంతలా.. అయితే ఇలా చేసుకున్న పెళ్లిళ్లు కొన్ని సక్సెస్‌ అయితే మరికొన్ని విఫలమవుతాయి..

అయితే గతంలో హీరోయిన్‌ ఇంద్రజ కూడా ఓ హీరోని గాఢంగా ప్రేమించిందని కానీ ఆ హీరో మాత్రం కేవలం సినిమాలో హీరోయిన్‌ గానే చూసారని ఓ గాసిప్‌ వినిపించింది. మరి ఆ హీరో ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.. యమలీల సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించిన ఇంద్రజ తర్వాత ఎన్నో తమిళ, కన్నడ,తెలుగు, మలయాళం సినిమాల్లో నటించింది.అయితే ఎన్ని సినిమాల్లో నటించినా కూడా ఈ హీరోయిన్‌ కి స్టార్‌ హోదా మాత్రం రాలేదు. అయితే ఎక్కువ సినిమాల్లో ఈమె సెకండ్‌ హీరోయిన్‌ గా చేసింది.

అలాగే కొన్ని సినిమాల్లో స్పెషల్‌ సాంగ్స్‌, గెస్ట్‌ రోల్స్‌ లో కూడా నటించింది. అలా ఇంద్రజకి ఎక్కువ స్టార్డం అయితే రాలేదు. అయితే ఇంద్రజ అప్పట్లో ఓ హీరోని ప్రేమించిందని, టాలీవుడ్‌ మీడియాలో ఎన్నో రూమర్స్‌ వినిపించాయి. ఇక ఆ హీరో ఎవరంటే రాజేంద్ర ప్రసాద్‌.. అప్పట్లో రాజేంద్రప్రసాద్‌ పై హీరోయిన్‌ ల విషయంలో ఎన్నో రూమర్స్‌ వినిపించాయి. అయితే అందులో ఎంత నిజముందో తెలియదు కానీ హీరోయిన్‌ ఇంద్రజ కూడా రాజేంద్ర ప్రసాద్‌ ని ప్రేమించిందని టాలీవుడ్లో కొంతమంది గుసగుసలు పెట్టుకున్నారు.

ఇక వీరి మధ్య ఉన్న ప్రేమ కారణంగానే ఇంద్రజ ఆ హీరోతో కలిసి ఐదారు సినిమాల్లో స్క్రీన్‌ షేర్‌ చేసుకుందని భావించారు. కానీ రాజేంద్ర ప్రసాద్‌ ఇంద్రజలు మాత్రం హీరో హీరోయిన్స్‌ గా స్క్రీన్‌ మీద మాత్రమే నటించారని, వారి మధ్య పర్సనల్‌ గా ఎలాంటి రిలేషన్‌ లేదని ఆ తర్వాత బయటపడిరది. ఇది కేవలం మీడియాలో వినిపించిన రూమర్‌ మాత్రమేనని అర్థమైంది. అయితే చాలామంది హీరో హీరోయిన్ల మధ్య ఇలాంటి రూమర్స్‌ ఎన్నో వినిపించాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page