top of page

అవినీతి అనురాధ ఔట్..!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Mar 28
  • 1 min read
  • డీబీసీడబ్ల్యూవో నుంచి ఏబీసీడబ్ల్యూవోగా డీమోషన్

  • జిల్లాలోనూ కొనసాగిన కలెక్షన్ల పర్వం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారిణిగా విధులు నిర్వహిస్తున్న ఇ.అనురాధను సహాయ బీసీ సంక్షేమ అధికారిగా డిమోషన్ ఇస్తూ వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ డైరెక్టర్ శనివారం ఉత్తర్వులు విడుదల చేశారు. కర్నూల్‌లో సహాయ బీసీ సంక్షేమ శాఖ అధికారిణిగా పనిచేసిన సమయంలో అనురాధపై ఏసీబీ కొన్ని ఛార్జెస్ ఫ్రేమ్ చేసింది. దీంతో సంబంధిత శాఖ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. ఈలోగానే పదోన్నతులు రావడంతో తాత్కాలిక పద్ధతిలో శ్రీకాకుళం డీబీసీడబ్ల్యూవోగా బదిలీ చేశారు. ఇప్ప్పుడు అప్పటిలో నియమించిన కమిటీ విచారణ పూర్తి చేసి అనురాధ అవినీతికి పాల్పడినట్టు పేర్కొనడంతో జిల్లా అధికారిగా కొనసాగుతున్న ఆమెను తక్షణమే రిలీవ్ చేయాలని జిల్లా ఉన్నతాధికారులకు ఆదేశించారు. ఆమెను అన్నమయ్య జిల్లా పీలేరు సహాయ బీసీ సంక్షేమశాఖ అధికారిగా బదిలీ చేస్తూ డైరెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. గతంలో వైకాపా నాయకుల సిఫార్సుతో జిల్లాకు డీబీసీడబ్ల్యూవోగా బదిలీపై వచ్చారు. సుమారు నాలుగేళ్లుగా జిల్లాలో పని చేసిన అనురాధపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. రాజకీయ నాయకుల అండతో వాటిని తొక్కిపెట్టి నెట్టుకొచ్చారు. బొడ్డేపల్లి రాజగోపాలరావు శతజయంతి ఉత్సవాలకు ప్రభుత్వం రూ.20లక్షలు విడుదల చేస్తే, వాటిని దుర్వినియోగం చేసినట్టు ఆధారాలతో ప్రభుత్వానికి కలెక్టర్ ఆమెపై ఫిర్యాదు చేశారు. నాలుగేళ్లలో శాఖ ఉద్యోగులు, సిబ్బందికి ఇచ్చిన ప్రమోషన్లు, బదిలీలు, డెప్యూటేషన్ల పేరుతో అవినీతి, అక్రమంగా శాంతినగర్‌లో రూ.కోటి విలువైన ఆస్తులు, కంచిలి మండలంలో వార్డెన్ ఉపేంద్ర సహకారంతో అక్రమ సంపాదనతో సొంత ఇల్లు నిర్మించుకున్నట్టు అనురాధపై అభియోగాలు ఉన్నాయి. అనురాధ భర్త సచివాలయంలో డిజి{ల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. రాజకీయ సిఫార్సుతో ఇచ్ఛాపురంలో పని చేస్తున్న ఆయన్ని బదిలీపై శ్రీకాకుళం కేఆర్ స్టేడియంకు తీసుకువచ్చారు. దీంతోపాటు ఇటీవల కంచిలి ఏబీసీడబ్ల్యూవో కార్యాలయంలో ఏసీబీ రైడ్స్‌లో పట్టుబడ్డ రూ.1.84 లక్షలు అనురాధకు చెందినట్టుగా పట్టుబడ్డ బాలముకుందం ఆధారాలు సమర్పించారు. వీటితో పాటు అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడినట్టు సీఎంవోకు, మంత్రి లోకేష్‌కు బాధితులు ఫిర్యాదులు చేయడంతో అనురాధను తక్షణమే డిమోషన్ ఇచ్చి వెనక్కి పంపించినట్టు విశ్వసనీయ సమాచారం.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page