top of page

అసలు సమస్యలు ఈవీఎంలు కాదు..!

Writer: DV RAMANADV RAMANA

హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా పరాజయం పాలైన తర్వాత ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (ఈవీఎం) గురించి కాంగ్రెస్‌ తన ఆందోళనా స్వరాన్ని పెంచింది. ఎన్నికల సమగ్రతకు సంబంధించి చాలా అంశాలున్నాయి. వాటి పట్ల భారత ఎన్నికల సంఘం స్వచ్ఛంగా వుండాల్సిన అవసరముంది. ఈవీఎంలను ఎలక్ట్రానిక్‌ ట్యాంపరింగ్‌ చేసే ముప్పు ఈ జాబితాలోకి రాదు. కాంగ్రెస్‌ ఓ తప్పుడు అంశంపై గొంతెత్తుతోంది. అది కూడా ఎంపిక చేసుకున్న అంశాల పైనే. అందులోనూ ఓడిపోయిన వాటిపైనే మాట్లాడుతోంది. ఈవీఎంలకు సంబంధించి అవక తవకల ముప్పుఉందని సూచించేలా పరోక్షంగా, లేదా ముందుగానే ప్రోగ్రామింగ్‌ చేయడం ద్వారా ట్యాంపరింగ్‌ జరిగి ఉంటుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని కాంగ్రెస్‌ నేతలే కొందరు బహి రంగంగా అభిప్రాయపడ్డారు. ఇద్దరు ప్రతిపక్ష నేతలు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత, జమ్మూ కాశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా, తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత అభిషేక్‌ బెనర్జీ కూడా ఈ ఆరోపణలతో తమకు సంబంధం లేదని విడగొట్టుకున్నారు. ఈవీఎంలలో చాలా కచ్చితంగా, తెలివిగా అవక తవకలకు పాల్పడ్డారని భావించేందుకు వీల్లేదు. ఎందుకంటే, కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించింది, మరికొన్ని రాష్ట్రాల్లో ఓడిపోయింది. కాబట్టి ఇక్కడ ఆ లాజిక్‌ పని చేయడం లేదు. ఇదంతా కాకపోయినా 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణ మెజారిటీని సాధించలేకపో యింది. పైగా, ఈ ఫలితాలన్నీ మరీ ముఖ్యంగా హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఫలితాలు సామా జిక, రాజకీయ సమీకరణలు ఎలా పనిచేశాయో సరిగానే వివరించాయి. ఈవీఎంలలో అవకతవక ల గురించి పదే పదే లేవనెత్తడం ద్వారా ఎన్నికల సమగ్రతకు సంబంధించిన నిజమైన, తీవ్రమైన అంశాలు వెనక్కి పోతున్నాయి. ప్రతిపక్షాల పోలింగ్‌ ఏజెంట్లు లేని పోలింగ్‌ బూత్‌లలో, ఒక పార్టీ ఆధిపత్యమే ఉన్నచోట ఈవీఎంలను ఎత్తుకుపోవడానికి గల అవకాశాలనేవి వాటిలో ఒకటి. పోలింగ్‌ ముగిసే సమయంలో చాలాచోట్ల పెద్ద ఎత్తున ఓటింగ్‌ శాతం నమోదు కావడంపై ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో ఇది సందర్భోచితమైన అంశంగా ఉంది. ఈ ధోరణిని ఎన్నికల కమిషన్‌ సంతృప్తికరమైన రీతిలో వివరించడం లేదు. దీనికి తోడు పెద్ద ఎత్తున ఓటర్ల పేర్లు నమోదు కావడం, తొలగించడమనేది కూడా ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోన్న ధోరణిగా ఉంది. ఎన్నికల కమిషన్‌ దీన్ని పెద్దగా పట్టించుకోనట్లు కనిపిస్తోంది. ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్న ఢల్లీిలో ముస్లిం ఓటర్ల పేర్లను ఎంపిక చేసి మరీ తొలగించినట్లు ఆరోపణలున్నాయి. యూపీ ఉప ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారని ఊహించిన ఓటర్లను నిలువరించేందుకు పోలీసులు పక్షపాతంతో వ్యవహరించడం వివాదాస్పదమైంది. ఇక ఎన్నికల షెడ్యూలు అనేది మరో తీవ్రమైన అంశం. ఎన్నికల కమిషన్‌ దీనిపై పారదర్శకంగా వ్యవహరించడం లేదు. దేశంలో, రాష్ట్రాల్లో ఒకే సారి ఎన్నికలను నిర్వహించేందుకు సమాయత్తమవుతున్న దేశం ఇటీవల మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను రెండు విడతలుగా నిర్వహించింది. దీనివల్ల లబ్ధి పొందింది బీజేపీ మాత్రమే. ఈ అంశాల్లో కొన్ని స్థానికమైనవి, మరికొన్ని బీజేపీ, ప్రతిపక్షం మధ్య గల సామర్ధ్య అంతరం భారీగా ఉండడానికి సంబంధించినవి. మరికొన్ని ఎన్నికల కమిషన్‌ కోర్టులో ఉన్నవి. ఎన్నికల సమగ్రతకు సంబంధించిన వాస్తవిక అంశాలపై ప్రతిపక్షం దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. అంతే కానీ ఈవీఎంలపై భయాలు ఈ వాస్తవిక అంశాలను మరుగుపరిచేవిగా ఉండకూడదు. మన దేశంలో ఎన్నికల ఫలితాలను తేల్చేవి పార్టీల మేనిఫెస్టోలో, ఈవీఎంలో కాదు. పోల్‌ మేనేజ్‌మెంటే ఇక్కడ కీలకం. 2014 తర్వాత కాంగ్రెస్‌ దీని మీద పూర్తిగా పట్టు వదిలేసింది. ఎప్పుడైతే 2014 నుంచి బీజేపీ కూటమి అప్రతిహతంగా కేంద్రంలో పాలిస్తోందో.. అప్పట్నుంచి కాంగ్రెస్‌ పోల్‌ మేనేజ్‌మెంట్‌లో మరింత బలహీనపడిరది. కేవలం ఒక రాష్ట్రంలో, ఒక ప్రాంతంలో, ఒక పోలింగ్‌ బూత్‌లో ఈవీఎంను టాంపర్‌ చేయడం వల్ల ఓడిపోయామని చెప్పడం కంటే, ఎన్నికలకు ముందే బూత్‌ స్థాయిలో ఓటర్ల జాబితాను సరిచూసుకోవడం, కొత్తవి చేర్చడం, చనిపోయినవారిని తొల గించడం వంటి పనులు ఎప్పుడో మానేశారు. తీరా ఫలితాలు వచ్చిన తర్వాత ఈవీఎంలను మేనేజ్‌ చేయడం ద్వారా తమకు ఓట్లు పడలేదని చెప్పడం సబబు కాదు. అదే సమయంలో ఎన్నిక ల్లో పోటీ చేసిన ఒక అభ్యర్థి ఇంట్లో ఐదు ఓట్లుంటే, ఆ కేండిడేట్‌కు ఒక్క ఓటు మాత్రమే ఈవీఎం లో చూపించడం వంటి వాటి మీద కూడా ఎన్నికల కమిషన్‌ జవాబు చెప్పివుండాల్సింది.

 
 
 

留言


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page