top of page

అంత కాస్ట్‌లీ గిఫ్ట్‌ అవసరమా?

Writer: DV RAMANADV RAMANA

అమెరికా మొదటి మహిళ జిల్‌ బిడెన్‌కు ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చిన వజ్రం ధర 20వేల డాలర్లు. అంటే మన రూపాయి విలువలో లెక్కిస్తే రూ.17.14 లక్షలు. మన దేశ పౌరులు చెల్లించిన పన్నుల నుంచి వచ్చిన 20వేల డాలర్లతో ఇక్కడ, భారతదేశంలో ఏ విధంగా ఎన్ని పనులకు ఖర్చుపెట్టవచ్చో, ఎంతమందికి ఉపయోగపడేలా ఖర్చుపెట్టవచ్చో తెలుసా? వివిధ సందర్భాల్లో విదేశీ ప్రముఖులకు ప్రధాని ఇచ్చిన కానుకల ధరను వెల్లడిరచడానికి ప్రభుత్వం విముఖత వ్యక్తం చేసినప్పటికీ, 2023లో అమెరికా ప్రథమ మహిళ జిల్‌ బిడెన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ బహుమతిగా ఇచ్చిన వజ్రం విలువ సుమారు 20వేల డాలర్లు ఉంటుందని వాషింగ్టన్‌ వెల్లడిరచింది. 2023 జనవరి 7 నాటికీ డాలర్‌తో రూపాయి విలువ 85.7గా ఉంది. మోదీ బహుమతిగా ఇచ్చిన 7.5 క్యారెట్ల వజ్రం విలువ రూ.17.14 లక్షలు. ఇది తక్కువేమీ కాదు. వాస్తవానికి అమెరికా అధ్యక్షుడి కార్యాల యం వెల్లడిరచిన సమాచారం ప్రకారం, 2023లో విదేశీ ప్రముఖుల నుంచి బిడెన్‌ దంపతులు అందుకున్న బహుమతులలో ఇదే అత్యంత ఖరీదైన బహుమతి. రూ. 17.14 లక్షలను భారతదేశంలో అయితే ఏఏ అవసరాలకు ఖర్చు చేయచ్చో చూద్దాం. నలుగురు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు 12 నెలల జీతం. టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌లో తయారుచేసిన నివేదిక ప్రకారం, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు నెలకు పొందే సగటు జీతం రూ.31,255. ఈ లెక్కన చూస్తే, రూ.17.14 లక్షలతో నలుగురు ఉపాధ్యాయులకు ఒక్కొక్కరికి 12 నెలలకు వేతనాలు చెల్లించవచ్చు. 2021-22 లెక్కల ప్రకారం భారతదేశంలోని 21 ప్రధాన రాష్ట్రాల్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో దాదాపు 14.7 శాతం పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలేనని ‘ది హిందూ’ కథనం వెల్లడిరచింది. ఈ రాష్ట్రాలలో, అటువంటి ప్రతి పాఠశాలలో సగటున 33 మంది విద్యార్థులు ఉన్నారు. బీహార్‌లో సగటున 96 మంది వరకు ఉండవచ్చు. అటువంటి పాఠశాలల్లో అదనంగా మరొక ఉపాధ్యాయుణ్ణి నియమించినట్లయితే ఎంతోమంది పిల్లల జీవితాల్లో కచ్చితంగా మార్పు తీసుకురాగలరు. ఇటీవల సవరించిన ప్రభుత్వ అంచనాల ప్రకారం, చాలా రాష్ట్రాలతోపాటు ఢల్లీి, పుదుచ్చేరిలో బాల వాటికా, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం సరుకుల కోసం ఒక పిల్లవాడికి రోజుకు రూ.6.19 చొప్పున కేటాయిస్తారు. 7.5 క్యారెట్‌ వజ్రం వ్యయంతో ఈ విద్యార్థులకు 2,76,898 మధ్యాహ్న భోజనాలను అందించవచ్చు. గత నెలలో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో ప్రచురించబడిన నివేదిక ప్రకారం ఢల్లీి, గోవా, కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో పాఠశాలల్లో వంటమనిషి, హెల్పర్‌లుగా పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటల పని చేస్తారు. వారికి నెలకు కేవలం వెయ్యి రూపాయలు గౌరవ వేతనం చెల్లిస్తారు. కొన్ని ఇతర రాష్ట్రాలలో ఇందుకు భిన్నంగా, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయంపై ఆధారపడి గౌరవ వేతనం రూ. 12వేల వరకు ఉంటుంది. ఈ సమాచారం సరైనదైతే.. అటువంటి 342 మంది మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.17.14 లక్షలు, ఒకసారి రూ.5వేలు బోనస్‌ ఇవ్వడానికి తోడ్పడతాయి. గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్‌ పథకం అమలుకు ఎంపిక చేయబడిన లబ్ధిదారుల ఇళ్లలో ‘వ్యక్తిగత మరుగుదొడ్ల’ నిర్మాణానికి 142 ఇళ్లకు మంజూరు చేయటానికి అవసరమైన ఖర్చును రూ.17.14 లక్షలు ద్వారా భరించవచ్చు. ఒక గ్రామీణ కుటుంబంలో ఇద్దరు పని చేసే సభ్యులు ఉన్నారని, వారికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ప్రకారం సంవత్సరానికి 100 రోజుల పని దొరుకుతుందని భావించినట్లయితే, ప్రతి వ్యక్తికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు సగటు వేతనం రోజుకు రూ. 249.67 అవుతుంది. అంటే రూ. 17.14 లక్షలతో అలాంటి 34 కుటుంబాలకు 100 రోజుల ఉపాధి కల్పించవచ్చు. మాన్యువల్‌ స్కావెంజర్‌గా గుర్తించ బడిన 42 కుటుంబాలు మాన్యువల్‌ స్కావెంజర్‌ల పునరావాసం కోసం స్వయం ఉపాధి పథకం కింద ప్రభుత్వం మాన్యువల్‌ స్కావెంజర్‌గా గుర్తించబడిన కుటుంబానికి పరిహారంగా రూ.40వేలు అందిస్తుంది. రూ.17.14 లక్షలతో 42 కుటుంబాలకు ఈ పరిహారం అందజేయవచ్చు. 2023లో మణిపూర్‌లో జరిగిన హింసాత్మక సంఘటనలో మరణించిన వారి కుటుంబానికి / బంధువులకు రూ.10లక్షల పరిహారం అందజేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రకటించారు. రూ.17.14 లక్షలతో ఒక బాధితురాలి బంధువులకు పూర్తి పరిహారం చెల్లించవచ్చు. ప్రధాన్‌ మంత్రి పట్టణ ప్రాంత ఆవాస్‌ యోజన ‘లబ్ధిదారుల నాయకత్వంలో వ్యక్తిగత గృహ నిర్మాణం లేదా మెరుగుదల’ పథకం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజలకు రూ. 2.5 లక్షల వరకు రాయితీపై ఇళ్లను కేటాయించటానికి ఉద్దేశించ బడిరది. మొత్తం రూ. 17.14 లక్షలతో ఈ పథకం కింద ఆరు ఇళ్లకు సబ్సిడీల ఖర్చును భరించవచ్చు.

 
 
 

Коментарі


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page