top of page

అందుకే కాషాయం రెపరెపలాడింది..!

Writer: DV RAMANADV RAMANA

హర్యానాలో సిట్టింగ్‌ బీజేపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నా మూడోసారి విజయం సాధించడం వెనుక ఆ పార్టీ వ్యూహాత్మక ఎత్తుగడ కనిపిస్తుంది. దీనికి తోడు కాంగ్రెస్‌, ఆప్‌లు కలిసి పోటీ చేయక పోవడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయింది. ఇది బీజేపీకి పెద్ద ఎత్తున లాభించింది. అందుకే ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలు తప్పాయి. ముఖ్యంగా అమిత్‌ షా వ్యూహం వల్లే హర్యానాలో పెద్ద విజయం దక్కించుకుంది. ఎన్నికలకు ముందే కేజ్రీవాల్‌కు బెయిల్‌ వచ్చేటట్లు చేసి స్వేచ్ఛగా ఎన్నికల ప్రచారం చేసుకోవడానికి అవకాశం కల్పించడం ఒక రాజకీయ ఎత్తుగడ. హర్యానాను రెండు భాగాలుగా విభజిస్తే, అందులో ఒకటి అహిర్వాల్‌ రీజయన్‌, రెండోది జీటీ కర్నాల్‌ రోడ్‌ రీజియన్‌. 2015లో జరిగిన ఎన్నికల్లో 50 శాతం సీట్లు జీటీ కర్నాల్‌ రోడ్‌ రీజియన్‌ నుంచి, 40 శాతం సీట్లు అహిర్వాల్‌ రీజియన్‌ నుంచి బీజేపీ గెలుచుకుంది. ఇప్పుడు కూడా సరిగ్గా దాని మీదే దృష్టి పెట్టింది. హర్యానా నుంచి పంజాబ్‌లోకి వెళ్లే జీటీ కర్నాల్‌ రోడ్డులో సోనేపట్‌, పాలిపట్‌, కర్నాల్‌, కురుక్షేత్ర, అంబాలా వంటి ప్రాంతాలున్నాయి. రెండో పానిపట్‌ యుద్ధం కోసం చరిత్రలో చదువుకున్నాం. ఇక మహాభారత యుద్ధం జరిగిందని చెబుతున్న కురుక్షేత్రం ఇప్పటికీ అదే పేరుతో కొనసాగుతోంది. ఇక్కడ బ్రాహ్మణుల సంఖ్య ఎక్కువ. ఈ ప్రాంతంలోనే యమునా నగర్‌, పంచకుల ప్రాంతాలు ఉన్నాయి. చరిత్రలో యుద్ధా లకు నిలయమైన ఈ ప్రాంతంలో రాజ్‌పుత్‌, మరాఠా వీరుల జనాభా కూడా ఎక్కువే. ఇతర ఓబీసీలైన సైనీ, కాంబోజలు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. బ్రాహ్మణులు, రాజపుత్రులు, ఖత్రీలు, యాదవు లు, సైనీలు, కాంబోజలు మొదట్నుంచీ బీజేపీకి అనుకూలంగా ఉంటూవస్తున్నారు. ఇవన్నీ అర్బన్‌ ఏరియాలు. ఎలాగూ బీజేపీకి పట్టుంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో పట్టు తక్కువున్న బీజేపీ అక్కడ కూడా కాషాయ జెండాను ఎలా రెపరెపలాడిరచిందనేదే ఇక్కడ చెప్పుకోవాలి. అహిర్వాల్‌ రీజియన్‌లో జాట్‌ల తర్వాత ఎక్కువ జనాభా ఉన్నది (16శాతం) అహిర్‌లు. అంటే యాదవులు. జాట్‌ల ఆధిపత్యం కారణం గా అహిర్‌లు పెద్దగా వెలుగులోకి రాలేకపోయారు. రైతు ఉద్యమంలో జాట్‌లదే ఆధిపత్యం. అది హర్యానా కావచ్చు, లేదా పంజాబ్‌ కావచ్చు. సహజంగానే జాట్‌లు కాంగ్రెస్‌ వైపు ఎక్కువ ఉంటారు. ఇక్కడ జాట్‌లు ఎవరికి ఓటు వేస్తే, వారికి వ్యతిరేకంగా యాదవులు ఓటేస్తారు. అహిర్వాల్‌ రీజియన్‌లో యాదవులకు చెందిన పెద్ద నాయకుడు రావ్‌ ఇంద్రజిత్‌ సింగ్‌, హర్యానా మాజీ ముఖ్యమంత్రి కొడుకు. ఇంద్రజిత్‌ సింగ్‌ నార్నోల్‌ పట్టణానికి చెందినవాడు. కానీ ప్రతీసారి గుర్‌గావ్‌ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తాడు. ఈయన ఎవరికి ఓటు వేయమంటే, అహిర్‌ వాళ్లకే ఓటు వేస్తారు. మరో ముఖ్యమైన విషయ మేమిటంటే.. అహిర్‌లని పిలవబడుతున్న యాదవులు ఎక్కువ సంఖ్యలో త్రివిధ దళాల్లో పని చేస్తున్నా రు. కాబట్టి ఎవరు చెప్పినా, చెప్పకపోయినా బీజేపీకే ఓటు వేస్తారు. ఈ ఎన్నికల్లో జీటీ కర్నాల్‌ రోడ్‌ రీజియన్‌, అహిర్వాల్‌ రీజియన్‌లో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. విచిత్రమేమిటంటే.. అసలు హర్యానాలో జాట్‌ పాలిటిక్స్‌కు ప్రధాన కేంద్రమైన దేశ్‌వాలీ ప్రాంతంలో కూడా బీజేపీకి ఓట్లు పడ్డాయి. ఇక కేజ్రీవాల్‌ తన వంతుగా కాంగ్రెస్‌కు చెందిన 3 శాతం ఓట్లు చీల్చగలిగారు. వీటన్నిటికి తోడు మన దేశ సైన్యంలో, అది కూడా ఆర్మీ, పారా మిలటరీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో హర్యానా వాళ్లు ఎక్కువ ఉన్నా రు. కాబట్టి గెలుపు బీజేపీకి దక్కింది. ఉత్తరప్రదేశ్‌ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి తక్కువ సీట్లు రావడంతో ఆ పార్టీ నేతలంతా ఒక వ్యూహం ప్రకారం పని చేశారు. దీనికి తోడు ఆర్‌ఎస్‌ఎస్‌ కృషి ఈ ఎన్నికల్లో ఎక్కువ కనిపిస్తుంది. అన్నిటికీ మించి రాహుల్‌ గాంధీ తెలంగాణ మాదిరిగానే ఉచిత పథకాలు ప్రక టించారు. ప్రజలు నమ్మలేదు. ఉత్తరప్రదేశ్‌లో ఖటాకట్‌ వాగ్దానం ఏమైందో హర్యానా ప్రజలు తెలుసు కున్నారు. మరీ ముఖ్యంగా కాంగ్రెస్‌ తరఫున దీపేంద్ర సింగ్‌ ముఖ్యమంత్రి అయితే, సోనియా అల్లుడు రాబర్ట్‌ వాద్రా రంగంలోకి దిగుతారని గతంలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వాద్రాకు అక్రమంగా భూములు కట్టబెట్టారన్న ప్రచారం బలంగా పని చేసింది. ఎగ్జిట్‌ పోల్‌ అంచనాల మేరకు హర్యానాలో కాంగ్రెస్‌ గెలుస్తుందని మీడియా హౌస్‌లు భావించాయి. మంగళవారం ఎన్నికల ఫలితాలు వెలువడు తున్న సమయంలో కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న టైమ్‌లో అన్నిచోట్లా రాహుల్‌ ఫొటోతో లీడిరగ్‌ అంటూ ఇండియాటుడే చూపించింది. ఎప్పుడైతే లీడ్‌ తగ్గుతూ వచ్చిందో అప్పుడు రాహుల్‌ ఫొటో తీసేసి మల్లికార్జున్‌ ఖర్గే ఫొటో పెట్టింది. ఏదిఏమైనా అందరి అంచనాలు తలకిందులు చేయడం వెనుక, హర్యానాలో బీజేపీ మరోసారి గెలవడం వెనుక ముందుగా ఆ పార్టీ కేజ్రీవాల్‌కు థాంక్స్‌ చెప్పాలి.


 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page