top of page

ఆ ఇద్దరి గెలుపు మంత్రం ఒకటే!

Writer: DV RAMANADV RAMANA

ప్రజాస్వామ్య పవనాలను ఎవరు ఆపగలరు? మరి రెండు నెలల్లో ముగియనున్న 2024 ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామిక సమాజాలకు ఒక మరపురాని ప్రత్యేక సంవత్సరంగా గుర్తుండిపోతుంది. ఈ ఏడాదిలో 60కు పైగా దేశాలలో జాతీయ స్థాయి ఎన్నికలు జరిగాయి. అనేక దేశాలలో ప్రజలు దిగ్భ్రాంతికరమైన తీర్పునిచ్చారు. ప్రభుత్వాలు మారాయి. ఎదురులేని మొనగాళ్లలా వ్యవహరించిన నేతలు అధికార వైభవం కోల్పోవడమో లేక తగ్గిపోవడమో జరిగింది. గతంలో ప్రజల చేత తిరస్కరించబడిన నాయకులు అనూహ్యమైన ప్రజా మద్దతుతో మళ్లీ అధికారానికి వచ్చారు. ఈ ఏడాది వేసవిలో భారతీయ ఓటర్లు నడుస్తున్న చరిత్రను విస్మయపరిచారు. ఆ తర్వాత జూలైలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి పథనిర్దేశకులైన బ్రిటిష్‌ ప్రజలు యువనేత, సాహసోపేత ప్రధానమంత్రి రిషి సునాక్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటువేశారు. ప్రతిపక్షమైన లేబర్‌ పార్టీని అనూహ్య మెజారిటీతో గెలిపించారు. అమెరికాలో మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తన ఘనవిజయంతో చరిత్ర సృష్టించారు. ప్రజల్లో సాధారణంగా ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందనే సూత్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత సార్వత్రిక ఎన్నికల వరకు ఒక మినహాయింపుగా ఉండేవారు. అయితే 2024 లోక్‌సభ ఎన్నికలలో ఆయన పార్టీ సైతం 63 స్థానాలను కోల్పోయింది. ఒక దశాబ్ద కాలంగా బీజేపీలోను, దేశ రాజకీయా లలోను తిరుగులేని రీతిలో ఉన్న ప్రభావ ప్రాబల్యాలకు తీవ్ర విఘాతం వాటిల్లింది. సంపన్న రాజ్యమైన అమెరికాలో సైతం కొత్త ఉద్యోగాల సృష్టి జరగలేదు. ఉన్న ఉద్యోగాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రజల ఆదాయాలు పడిపోయాయి. జీవన వ్యయాలు అంతకంతకు పెరిగిపోసాగాయి. మరి స్వల్ప ఆదా యాలతో బతుకులను ఈడుస్తున్న కార్మిక శ్రేణులు డోనాల్డ్‌ ట్రంప్‌కు గట్టి మద్దతుదారులుగా ఉండడంలో ఆశ్చర్యమేముంది? అమెరికన్‌ సమాజం ‘వైవిధ్యం’తో వర్థిల్లాలన్న వాదనను డోనాల్డ్‌ ట్రంప్‌ తలకిందులు చేశారు. వలస వచ్చిన, వస్తున్న వారికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడారు. భిన్న జాతుల, మతాలకు చెందిన వలసకారులు అమెరికన్ల శ్రేయస్సును దెబ్బ తీస్తున్నారని ఆయన వాదిం చారు. ట్రంప్‌ ధోరణి గత లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ, బీజేపీ నాయకుల ధోరణికి భిన్నమైనది కాదు. నాగరిక విలువలు సమున్నతంగా ఉన్న ప్రపంచంలో అయితే, ట్రంప్‌, మోడీ, యోగి లాంటి నేతల విద్వేషపూరిత వ్యాఖ్యలు తీవ్రంగా గర్హింపబడేవి. అయితే 2024 ఎన్నికల ప్రచారాల్లో అటువంటి వ్యాఖ్యలు ఓటర్లలో అత్యధిక సంఖ్యాకులను తమ ఊహాత్మక ‘అంతర్గత’ శత్రువుకు వ్యతిరేకంగా పరిణమింపచేశాయి. మన దేశంలో ‘భిన్నత్వంలో ఏకత్వం’ అనే నెహ్రూ ఆదర్శానికి నిబద్ధులయిన వారిని ‘బూటకపు లౌకికవాదులు’గా భావిస్తున్నారిప్పుడు. ఒక విధంగా శక్తివంతమైన రాజకీయ నాయకులు అయిన డోనాల్డ్‌ ట్రంప్‌, నరేంద్ర మోడీ ఒకే విధమైన విజయ సూత్రాన్ని కనుగొన్నారు. స్వాతంత్య్ర శతాబ్ది (2047) నాటికి ‘వికసిత్‌ భారత్‌’ అనే స్వప్నాన్ని మోడీ పూయించగా, ‘అమెరికాను మళ్లీ గొప్ప దేశం’గా రూపొందిస్తానని డోనాల్డ్‌ ట్రంప్‌ వాగ్దానం చేశారు. జాతీయవాద భావోద్వేగాలను దృఢతరం చేసే ఈ జనాకర్షక నినాదాలు ట్రంప్‌`మోడీ రాజకీయ సందేశాలలో ప్రధానాంశాలుగా ఉంటున్నాయి. ‘బయటి వ్యక్తుల’ పట్ల భయాలు సృష్టించడం ఇరువురి ప్రచారాలలో ఒక ఉమ్మడి అంశం. అమెరికాలో ప్యూరిటోరికన్‌, హైతియన్‌ వలసకారులకు వ్యతిరేకంగా ట్రంప్‌, భారత్‌లో రోహింగ్యాలు లేదా బంగ్లాదేశీ చొరబాటుదారులకు వ్యతిరేకంగా మోడీ ఉద్దేశపూర్వకంగా అనుసరి స్తున్న వ్యూహాలలో భాగంగానే ‘బయటి వ్యక్తుల’ పట్ల భయాలు రెచ్చగొట్టడం జరుగుతోంది. ఒక విభిన్న అస్తిత్వాన్ని పటిష్ఠం చేసుకునేందుకు అనుసరిస్తున్న జాగరూక వ్యూహమది. అమెరికాలో ట్రంపియన్‌ అమెరికనిజం, భారత్‌లో బీజేపీ హిందుత్వ భావజాలాలు ఒక జాతీయవాద దాడిగా వ్యక్తమవుతున్న అదుపులేని, చేయలేని సాంస్కృతిక వక్కాణింపు ప్రాతిపదికపై ప్రభవించినవే. ఈ వ్యూహాలు చెప్పుకో దగిన రీతుల్లో ఫలిస్తున్నాయి. కారణమేమిటి? అటు అమెరికాలోను, ఇటు భారత్‌ లోను ప్రతిపక్షాలు తమ సొంత ప్రత్యేక విధానాలను ప్రతిపాదించడానికి బదులుగా, భావజాల ప్రత్యర్థుల వ్యక్తిత్వాలను సవాల్‌ చేయడమనే వలలో చిక్కుకోవడమే. భారత్‌లో ప్రతిపక్షాలు ఎంతకూ మోడీని విమర్శించడానికే పరిమితమవుతున్నాయి. అలాగే అమెరికాలో డెమొక్రాట్లు అమెరికా భవిష్యత్తు విషయమై ఒక సుసం బంధ దార్శనికతతో ఓటర్లను కొత్త సమున్నత లక్ష్యాల సాధనకు ప్రేరేపించడానికి బదులుగా నిరంతరం ట్రంప్‌ వ్యక్తిత్వంలోని లోపాలు, లొసుగులను ఎండగట్టేందుకే పరిమితమయ్యారు.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page