top of page

ఆందోళనకరంగా సీ-సెక్షన్ ప్రసవాలు

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Jun 1
  • 2 min read

ప్రసవం అనేది మహిళలకు పునర్జన్మలాంటింది. బిడ్డకు జన్మనిచ్చి ఈ లోకంలోకి తీసుకురావడం ద్వారా అపురూపమైన మాతృత్వపు మధురిమకు పాత్రమైనప్పటికీ.. దానికిముందు ఆమె అనుభవించే యాతన వర్ణనాతీతం. అటువంటి కాన్పులు సహజసిద్ధంగా జరగడమే మాతృమÖర్తుల శారీరక ఆరోగ్యానికి క్షేమదాయకమని, సురక్షితమని ప్రభుత్వాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటివి ఘోషిస్తున్నాయి. అనివార్య, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే కడుపు కోసి బిడ్డను బయటకు తీసే ప్రక్రియకు వెళ్లాలని ఏళ్లతరబడి సూచిస్తున్నాయి. దీన్నే సిజేరియన్ ఆపరేషన్ లేదా సీ`సెక్షన్ ప్రసవం అని అంటారు. దురదృష్టవశాత్తు మన దేశంలో ఈ సీ`సెక్షన్ ప్రసవాలే భారీగా పెరిగిపోతున్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ ఎఫ్‌హెచ్ ఎస్) తాజా గణాంకాలు ఆందోళనకర పరిస్థితిని ఆవిష్కరిస్తున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని పథకాలు అమలు చేస్తున్నా.. ఎన్ని ప్రోత్సాహకాలు ఇస్తున్నా.. ప్రజాచైతన్య కార్యక్రమాల ద్వారా ఎంతగా అవగాహన కల్పిస్తున్నా సీ`సెక్షన్ ప్రసవాలకు మాత్రం కళ్లెం వేయలేకపోతున్నాయని ఈ సర్వే ద్వారా స్పష్టమైంది. ముఖ్యంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్ ఆపరేషన్ల సంఖ్య అదుపు చేయలేని విధంగా పెరిగిపోతున్నది. రాష్ట్రాలవారీగా చూస్తే జమ్మూ కశ్మీర్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాల్లో పరిస్థితి మరింత దయనీయంగా ఉన్నట్లు వెల్లడైంది. ఇటీవల విడుదల చేసి ఎనఎఫ్‌హెచఎస్ నివేదిక ప్రకారం ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్ ప్రసవాల రేటు అత్యధికంగా జమ్మూ కశ్మీర్‌లో ఏకంగా 90 శాతంగా నమోదైంది. పశ్చిమ బెంగాల్‌లో 87.7 శాతం, తెలంగాణలో 84 శాతంగా నమోదైంది. దాంతో ఈ మÖడు రాష్ట్రాలు రెడ్‌జోన్‌లో ఉన్నట్లే. తెలంగాణలో ఒక్క ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే 84 శాతం ప్రసవాలు సిజేరియన్ ద్వారా జరుగుతున్నాయని, ప్రభుత్వాస్పత్రుల్లో పరిస్థితి కాస్త నయంగా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో సిజేరియన్ ఆపరేషన్లు 66 శాతంగా నమోదు కాగా, అసోంలో 81.4 శాతం, ఒడిశాలో 76.8 శాతం ప్రసవాలు సి-సెక్షన్‌గా నమోదయ్యాయి. జాతీయ స్థాయిలో గణాంకాలు కూడా పరిస్థితి తీవ్రతను కళ్లకు కడుతున్నాయి. గత రెండు దశాబ్దాలుగా దేశంలో సిజేరియన్ ప్రసవాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2005-06లో దేశవ్యాప్తంగా 8.5 శాతంగా ఉన్న సి-సెక్షన్ ప్రసవాల రేటు 2015-16 నాటికి రెట్టింపు పెరిగి 17.2 శాతానికి ఎగబాకింది. 2019-21లో ఈ సంఖ్య 21.5 శాతంగా నమోదైంది. తాజా గణాంకాల ప్రకారం దేశంలో జరిగే మొత్తం ప్రసవాల్లో 27.2 శాతం సిజేరియన్ ద్వారానే జరుగుతున్నాయని తేలింది. అయితే ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిజేరియన్ ప్రసవాల పెరుగుదల ప్రైవేట్ ఆస్పత్రులతో పోలిస్తే తక్కువగా ఉండటం గమనార్హం. ప్రభుత్వాస్పత్రుల్లో నార్మల్ డెలివరీ(సాధారణ ప్రసవాలు)ల రేటు 62 శాతం నుంచి 71 శాతానికి పెరిగింది. కానీ ప్రైవేట్ ఆస్పత్రుల్లో దాదాపు సగం.. అంటే 47 శాతం మేరకు సిజేరియన్లే జరుగుతున్నాయి. ప్రపంచ బ్యాంకు మార్గదర్శకాల ప్రకారం ఇది గరిష్టంగా 15 శాతానికి మించకూడది. సురక్షితమైన సాధారణ డెలివరీలను కాదని రిస్క్‌తో కూడిన సిజేరియన్ ఆపరేషన్లు ఎక్కువగా జరుగుతుండటానికి అనేక అంశాలు కారణమవుతున్నాయి. వీటిలో ప్రధానమైనది ప్రైవేట్ ఆస్పత్రులు ఆదాయ కాంక్ష. నార్మల్ డెలివరీ కంటే సిజేరియన్ కేసులు ఎక్కువ రోజుల ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్‌గా ఉండాల్సి వస్తుంది. దాంతోపాటు శస్త్రచికిత్స, మందులు, రూము ఛార్జీలు, ఇతరత్రా ఖర్చులు కలిపి ప్రతి కేసు నుంచి భారీగానే ఫీజుల రూపంలో అందుతాయి. దీనివల్ల ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు రకరకాల సాకులతో గర్భిణులను సిజేరియన్ వైపే మొగ్గేలా మోటివేట్ చేస్తుంటారు. ఇందులో ప్రజల పాత్ర కూడా ఉంది. నార్మల్ డెలివరీ అంటే ప్రసవం జరిగే వరకు నొప్పులను తట్టుకుని లేబర్ రూములో ఎదురుచూడాలి. ఇది మెజారిటీ గర్భిణులను భయాందోళనకు గురిచేస్తుంది. దీనికితోడు ఈమధ్య కాలంలో తిథులు, నక్షత్రాలను పరిగణనలోకి తీసుకోవడం పెరిగింది. తమ బిడ్డ శుభఘడియల్లో ఈ లోకంలోకి అడుగుపెడితే అతని భవిష్యత్తు దివ్యంగా ఉంటుందన్న భావన, నమ్మకం పెరిగాయి. అయితే సాధారణ ప్రసవాన్ని ఆ లెక్కల ప్రకారం నిర్దేశించలేం. కానీ సిజేరియన్ ప్రసవానికి ఆ వెసులుబాటు ఉంది. నెలలు నిండిన తర్వాత మనం మంచి ఘడియలు చూసుకుని ఏ రోజు, ఎన్ని గంటలు, నిమిషాలకు తమ బిడ్డకు జన్మనివ్వాలని కోరుకుంటారో.. ఆ వివరాలు వైద్యుడికి చెబితే అదే సమయానికి సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీసే సౌకర్యాన్ని కూడా చాలా కార్పొరేట్ ఆస్పత్రులు కల్పిస్తున్నాయి. సీ`సెక్షన్ ద్వారా ప్రసవ తేదీ, సమయాన్ని ముందుగానే నిర్ణయించుకునే సౌలభ్యం ఉండటం వల్ల కుటుంబ సభ్యులు అందుకు అవసరమైన ఏర్పాట్లను సులభంగా చేసుకోవచ్చు. ఇది కూడా సిజేరియన్ ప్రసవాల పెరుగుదలకు ఒక కారణంగా భావిస్తున్నారు. ఇవి కాకుండా పుట్టబోయే శిశువు భద్రతపై ఆందోళన, ప్రసవ సమయంలో ఏదైనా సమస్య తలెత్తుతుందేమోననే భయం కుటుంబాల్లో ఉంటుంది. ఈ కారణంగా కొందరు సిజేరియన్ ప్రసవం చేయాలని స్వయంగా వైద్యులను కోరుతుంటారు. ప్రసవ పద్ధతిని కేవలం భయం, సౌకర్యం లేదా వ్యక్తిగత అభిరుచుల ఆధారంగా నిర్ణయించకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తల్లి, శిశువు ఆరోగ్య పరిస్థితులను పరిశీలించిన తర్వాత వైద్యుల సలహా మేరకు మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. తల్లి లేదా శిశువు ఆరోగ్యానికి ప్రమాదం ఉన్న పరిస్థితుల్లోనే సిజేరియన్ ప్రసవం సురక్షితమైన, అవసరమైన ఎంపికగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేందుకు, ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు చేసుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు దాదాపు 2011 నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. నార్మల్ డెలివరీ చేసుకునే తల్లికి రూ.1400, ప్రోత్సహించే ఆశ వర్కర్‌కు రూ.600 ప్రోత్సాహక నగదు అందిస్తున్నారు. అయినా ప్రైవేట్ ఆస్పత్రు ý విషయంలో ఇవేవీ పనిచేయడంలేదు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page