చెన్నై సోయగం త్రిష గురించి పరిచయాలు అవసరం లేదు. ఇటు తెలుగుతో పాటు అటు తమిళంలోనూ భారీ స్టార్డమ్ సంపాదించుకున్న హీరోయిన్ల జాబితాలో త్రిష ఒకరు. పైగా సుధీర్ఘకాలం నుంచి ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతోంది. ఒకవైపు హీరోల పక్కన కమర్షియల్ చిత్రాలు చేస్తూనే.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ మూవీస్, వెబ్ సిరీస్‌లలో నటిస్తోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా త్రిషకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. ఓ స్టార్ హీరోపై ఉన్న పిచ్చ అభిమానంతోనే కెరీర్‌లోనే తొలిసారి ఐటెం సాంగ్ చేసేందుకు త్రిష ఒప్పుకుందట. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు దళపతి విజయ్. త్వరలోనే విజయ్ గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్) అనే మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.
సైన్స్ ఫిక్షన్, దేశభక్తి ప్రధానాంశాలుగా తీసుకుని ప్రముఖ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో తండ్రీకొడుకులుగా విజయ్ ద్విపాత్రాభినయం చేశాడు. మీనాక్షి చౌదరి, స్నేహా, లైలా, ప్రశాంత్, ప్రభు దేవా తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. సెప్టెంబర్ 5న భారీ అంచనాల నడుమ అట్టహాసంగా గోట్ మూవీ విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉంటుందట. ఆ సాంగ్‌లో విజయ్‌తో కలిసి త్రిష ఆడిపాడిరదని కోలీవుడ్‌లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఆ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నారని కూడా అంటున్నారు. కాగా, తమిళంలో విజయ్-త్రిష హిట్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. వీరు జంటగా నటించిన ఐదు సినిమాలు మంచి విజయం సాధించాయి. ఇప్పుడు ఈ హిట్ సెంటిమెంట్‌ను రిపేట్ చేయడం కోసమే త్రిష చేత స్పెషల్ సాంగ్ చేయించారని, అంతకుగానూ ఆమెకు భారీ మొత్తంలోనూ రెమ్యునరేషన్ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి.

కండోమ్ కంపెనీపై కేసు
ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుకొంటున్నారు. అది ఏ రూపంలో అందిస్తారన్నది మేకర్స్ చేతుల్లో ఉంటుంది. కొత్త పాయింట్లు ఎత్తుకొంటే తప్ప తెరపై కొత్త సీన్లు రావు. అందుకోసం పాయింట్ల వేటలో పడ్డారు దర్శకులు. సుహాస్ కొత్త సినిమా ‘జనక అయితే గనుక’ ట్రైలర్ వచ్చింది. ఆ ట్రైలర్ చూస్తే ఈ టీమ్ కూడా ఏదో ఓ కొత్త పాయింట్ పట్టారన్న నమ్మకం బలంగా కనిపిస్తోంది. ఓ మధ్యతరగతి హీరో. పెళ్లి చేసుకొన్నాడు. పిల్లలు వద్దనుకొన్నాడు. గర్భనిరోధక సాధనాలూ వాడుతున్నాడు. అయితే.. పెళ్లాం అనుకోకుండా నెలతప్పింది. దాంతో.. ఆ కండోమ్ కంపెనీపై భర్త కేసు వేశాడు. ఇదీ కథ.
ఫ్యామిలీ డ్రామాతో మొదలైన ఈ కథ, కోర్టు డ్రామాతో ముగుస్తుంది. పాయింట్ పరంగా బాగుంది. వెరైటీ కనిపిస్తోంది. కామెడీకి బోలెడంత స్కోప్ ఉంది. ఎమోషన్ పండిరచడానికీ ఛాన్సుంది. ఇలా ఈ కథలో అన్ని ఎలిమెంట్స్ పుష్కలంగా కనిపిస్తున్నాయి. దిల్ రాజు బ్యానర్ నుంచి వస్తున్న సినిమా ఇది. కాబట్టి ప్రమోషన్ పరంగా లోటు ఉండదు. మధ్యతరగతి కుర్రాడి పాత్రలో సుహాస్ ఒదిగిపోయాడు. వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, రాజేంద్ర ప్రసాద్.. లాంటి నటీనటుల బలం ఈ కథకు ఉంది. సంకీర్తన అనే తెలుగమ్మాయి హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. సందీప్ బండ్ల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సెప్టెంబరు 7న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.
పర్ఫెక్ట్ నడుముతో స్టన్నింగ్ లుక్స్
తెలుగులో గ్లామరస్ యాంకర్‌గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న ముద్దుగుమ్మ అరియానా గ్లోరి. ఈ అమ్మడు యుట్యూబ్ ఛానల్స్‌లో న్యూస్ యాంకర్‌గా కెరియర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత సెలబ్రెటీలని ఇంటర్వ్యూలు చేసింది. అలా రామ్ గోపాల్ వర్మని ఇంటర్వ్యూ చేసి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. రామ్‌గోపాల్ వర్మ అరియానా అందాన్ని ప్రశంసించడంతో లైమ్‌లైట్‌లోకి వచ్చింది. దాంతో తెలుగు బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసే ఛాన్స్‌ని అరియానా అందుకుంది. రెండుసార్లు బిగ్ బాస్ షో లో పార్టిసిపేట్ చేయడమే కాకుండా దానికి రిలేటెడ్‌గా ప్రసారం అయిన టాక్ షోకి అరియానా హోస్ట్‌గా చేసింది. తద్వారా ఈ బ్యూటీకి తెలుగునాట విశేషమైన ఇమేజ్ వచ్చింది. బుల్లితెర రియాలిటీషోలలో కూడా అరియానా సందడి చేసింది. ఇలా ఈ అమ్మడు సెలబ్రెటీగా స్టార్ యాంకర్‌గా మారిపోయింది. ప్రస్తుతం తెలుగులో ఉన్న హాట్ యాంకర్స్‌లో అరియానా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ని సొంతం చేసుకొని దూసుకుపోతోంది. అడపాదడపా సినిమాల్లో కూడా అరియానా నటిస్తోంది. ఈ ఏడాది అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ఆ ఒక్కటి అడక్కు సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్‌లో అరియానా నటించింది. హీరోయిన్ రేంజ్ క్యారెక్టర్ మాత్రం అరియానాకి లభించడం లేదు. కానీ అందంతో హీరోయిన్స్‌కి ఈ అమ్మడు పోటీ ఇస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ రెగ్యులర్‌గా హాట్ ఫోటోషూట్‌లతో సందడి చేస్తూ ఉంటుంది. ట్రెడిషనల్, వెస్ట్రన్ అవుట్ ఫిట్‌లతో అరియానా అందరిని ఎట్రాక్ట్ చేస్తోంది. ఈ అమ్మడు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతాయి. ఇదిలా ఉంటే తాజాగా అరియానా గ్లోరి నడుము అందాలు చూపిస్తూ బ్లాక్ కలర్ టైట్ ఫిట్ కాస్ట్యూమ్స్‌లో ఉన్న ఫోటోలని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ ఫోటోలకి నెటిజన్లు నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అరియానా అందం వావ్ అనేలా ఉందని ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అరియనా అందం ముందు ఎవరైనా దిగదుడుపే అంటూ ప్రశంసిస్తున్నారు.
Comentarios