top of page

ఇదేం పాట అన్నారందరూ.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ హిట్‌!!

  • Guest Writer
  • Apr 10
  • 2 min read


తెలుగు చిత్ర పరిశ్రమకి ఇళయరాజా అప్పుడప్పుడే పరిచయం అవుతున్న రోజులు. కెఎస్‌. రామారావు అంతకు ముందు తమిళ్‌ డబ్బింగులు చేసి ఉండటం వల్ల తన తొలి స్ట్రెయిట్‌ తెలుగు సినిమాకి ఇళయరాజాని మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పెట్టుకున్నాడు.

సత్యానంద్‌ మాటలు. లోక్‌సింగ్‌ కెమెరా.. రాజా, కోదండరామిరెడ్డి, చిరంజీవి.. మొత్తం ఐదుగురు కాంబినేషన్లో ఐదు సినిమాలు చేద్దామనుకొని ఒక అగ్రిమెంట్‌. అలా వచ్చినవే చాలెంజ్‌, రాక్షసుడు వగైరా. ఆ వరుసలో అభిలాష మొదటిది.

ఈ సినిమాకి కో- డైరెక్టర్‌ అజయ్‌కుమార్‌. అతడు మద్రాసులో సాంగ్‌ రికార్డింగ్‌ దగ్గర ఉన్నాడు. విశాఖపట్నంలో షూటింగ్‌ జరుగుతోంది. మరుసటి రోజు సాంగ్‌ షూట్‌.

ఇప్పుడున్నంత ఆధునిక టెక్నాలజీ అప్పుడు లేదు. ముందురోజు మెడ్రాస్‌ నుంచి అజయ్‌ కుమార్‌ పాట తాలూకు రీల్‌ తీసుకొచ్చాడు.

అందరూ గుండ్రంగా కూర్చుని ఉత్సాహంగా, ఆసక్తిగా విన్నారు.

పాట చాలా నత్తనడకల ఆలాపనతో మొదలైంది. అప్పటికి అందరూ చక్రవర్తి మ్యూజిక్‌ డైరెక్షన్‌కి అలవాటు పడ్డవారు. పెద్ద పెద్ద సౌండ్లు.. హడావుడి..!

అందరి మొహాలు పాలిపోయాయి...ఏదో గిరిజన సంగీతంలా ఉన్నదన్నారు ఒకరు. ‘ఇదేమిటి? ఇదెలా..చిరంజీవి మీద ఈ పాటా?’ లాంటి గుసగుసలు.

డాన్స్‌ డైరెక్టర్‌ తారా మాస్టర్‌ ‘‘దీనికి డాన్స్‌ కంపోజిషన్‌ ఎలా చేయాలి?’’ అంటూ పెదవి విరిచింది.

రామారావుక్కూడా పాట నిరాశాజనకంగానే ఉన్నట్టు అనిపించింది కానీ మరుసటి రోజు షూటింగ్‌. క్యాన్సిల్‌ చేస్తే లక్షల్లో నష్టం. కాబట్టి రకరకాల కోణాల్లో ఆలోచిస్తూ ఉండిపోయాడు.

సినిమా అందరికీ ప్రెస్టేజి. అంత స్లో సాంగ్‌ని మాస్‌హీరో చిరంజీవి మీద ఎలా చిత్రీకరణ చేయాలి అని కోదండరామిరెడ్డి కూడా అటు ఇటుగా ఊగాడు. అయితే సాయంత్రానికి అతడు ఒక నిర్ణయానికి వచ్చి ‘వినగా వినగా బావున్నట్టుంది. చేసేద్దాంలే’ అన్నాడు. రామారావు ‘హమ్మయ్య’ అనుకున్నాడు. మొదటినుంచీ అతడు కాస్త కాన్ఫిడెంట్‌ గానే ఉన్నాడు.

ఆ మరుసటి రోజు షూటింగ్‌ ప్రారంభమైంది. అంతే..! సాయంత్రానికల్లా లైట్‌- బోయ్‌ ల దగ్గర నుంచి మొత్తం యూనిట్‌ అందరి నోటా వేటూరి పాట ‘‘బంతీ..చామంతీ..’’ అంటూ కంటిన్యూయస్‌గా ఆ పల్లవి రిపీట్‌ అవుతూ ఉండటంతో, సాంగ్‌ సూపర్‌ హిట్‌ అవుతుందని నమ్మకం కుదిరింది.

ఆపై ‘అభిలాష’ విజయవంతం కావటానికి వెనక ఉన్న కొన్ని కారణాల్లో ఈ పాట ఒకటిగా నిలచింది.

మార్పు మొదట నిర్ద్వంద్వంగా నిరాకరింపబడుతుంది. ఆపై తూట్లు తూట్లుగా విమర్శించబడుతుంది. ఆ తరువాత ఒప్పుకోబడుతుంది.

సాయంకాలం సాగర తీరం, జయ జయ జయ ప్రియ భారత జనయత్రీ దివ్యధాత్రి, సందెపొద్దులకాడ, శుభలేఖ వ్రాసుకున్నా, ఉరకలై గోదావరి, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, కరిగిపోయాను కర్పూర వీణలా లాంటి ఆ పై వచ్చిన పాటలన్నీ కోదండరామిరెడ్డి ఆ మహానుభావుడి చేత ఏరి కోరి, కోరి కోరి చేయించుకున్నాడు.

-యండమూరి వీరేంద్రనాధ్‌




జ్యోతి పూర్వాజ్‌.. సింపుల్‌ గానే హీటెక్కించేసింది

ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండే నటీమణుల్లో జ్యోతి పూర్వాజ్‌ ఒకరు. నటిగా మాత్రమే కాకుండా, సోషల్‌ మీడియాలో గ్లామర్‌ ఫొటోషూట్లతో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఆమె తాజా ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. రెస్టారెంట్‌లో కాఫీ లేదా వాటర్‌ గ్లాస్‌తో ముస్తాబైన ఈ ఫోటోషూట్‌ చాలా స్టైలిష్‌ గా, ఫ్రెష్‌ గా కనిపిస్తోంది. ఈ ఫోటోలలో జ్యోతి మరీ అందంగా మెరిసిపోయింది. రెడ్‌ ‘వి’ నెక్‌ టాప్‌, ఓపెన్‌ హెయిర్‌ స్టైల్‌, లైట్‌ మేకప్‌లో ఆమె లుక్‌ చాలా ఆకట్టుకుంటోంది.

కళ్లలో వున్న సాఫ్ట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌, స్మైలింగ్‌ ఆమె సౌందర్యాన్ని మరింత మెరిపించాయి. ముఖ్యంగా ఆమె నాచురల్‌ బ్యూటీకి సోషల్‌ మీడియా యూజర్లు ఫిదా అవుతున్నారు. ఇటీవల జ్యోతి పూర్వాజ్‌ కొన్ని టీవీ షోస్‌, యూట్యూబ్‌ ఇంటర్వ్యూల ద్వారా పాపులర్‌ అయింది. ఇప్పటికే కొన్ని చిత్రాల్లో సపోర్టింగ్‌ రోల్స్‌ చేసిందామె. అయితే మోడలింగ్‌, గ్లామర్‌ ఫొటోషూట్ల ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు ఆమె వెబ్‌ సిరీస్‌లు, ఓటీటీ ప్రాజెక్టులపై ఫోకస్‌ పెట్టినట్టు తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో జ్యోతి పూర్వాజ్‌ కి ఫాలోయింగ్‌ భారీగానే ఉంది. ప్రతి ఫోటోపోస్ట్‌కు వేలల్లో లైక్స్‌, వందలలో కామెంట్స్‌ వస్తుండటంతో ఆమె క్రేజ్‌ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. తన అందాన్ని బోల్డ్‌గా, కాన్ఫిడెంట్‌గా ప్రెజెంట్‌ చేస్తూ ఫ్యాషన్‌ ప్రపంచంలో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది.

ఈ లేటెస్ట్‌ ఫోటోలు చూస్తుంటే.. ఆమె కెరీర్‌ కొత్త దిశలో సాగుతుందని, మరిన్ని అవకాశాలు ఆమె కోసం ఎదురుచూస్తున్నాయన్న నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. సింపుల్‌ కానీ స్టైలిష్‌ లుక్స్‌లో కనిపిస్తున్న జ్యోతి, నటనతో పాటు గ్లామర్‌ ఆటిట్యూడ్‌ తో కూడా అలరిస్తోంది. త్వరలోనే ఓటీటీలు లేదా మ్యూజిక్‌ వీడియోల ద్వారా మరింతగా ప్రేక్షకుల మన్ననలు పొందే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

` తుపాకి.కామ్‌ సౌజన్యంతో...

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page