top of page

ఇది వ్యక్తిగత వైఫల్యం కాదు.. సిస్టమిక్ సైకలాజికల్ ఫెయిల్యూర్

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • May 14
  • 4 min read

బండి సంజయ్ ప్రసంగాలు వింటే, అందులో ‘యుద్ధం’, ‘చీల్చడం’, ‘తొక్కడం’ వంటి పదజాలం తరచుగా కనిపిస్తుంది. ఒక బిడ్డకు తండ్రే మొదటి హీరో. తండ్రి తన నోటి దూకుడు ద్వారా రాజకీయంగా ఎదిగి, పదిమందిలో గుర్తింపు పొందుతున్నాడని చూసిన కొడుకు మనసులో ‘అగ్రెసెన్ ఈక్వల్ పవర’ (దూకుడే అధికారం) అనే సూత్రం బలంగా నాటుకుపోయింది. తండ్రి ప్రసంగాల్లోని ‘తీవ్రత’ను కొడుకు తన చేతల్లో హింసగా మార్చుకున్నాడు. ఇది కేవలం కోపం కాదు, ఒక రకమైన వికారియస్ లెగ్నింగ్.

అధికారం అనేది ఒక మత్తు. అది ఒక కుర్చీకి సంబంధించిన విషయం కాదు. అది మనిషి మెదడు పనితీరును, కుటుంబ వ్యవస్థను, ఆ ఇంట్లో పెరిగే పిల్లల మనస్తత్వాన్ని పూర్తిగా మార్చేసే ఒక సామాజిక రసాయనం. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నవారి పిల్లల ప్రవర్తన ఈ మధ్య కాలంలో పెద్ద చర్చకు దారితీస్తోంది. అసలు ఈ ‘పవర్ బబుల’ (అధికార వలయం)లో పెరిగే పిల్లలు ఎందుకు సమాజ వ్యతిరేక ధోరణి వైపు వెళ్తున్నారు? దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలేంటి? అనే దానిమీద ప్రముఖ సైకాలజిస్ట్ విశేష్ కూడా తీవ్రంగానే స్పందించారు. దీన్ని అఫ్లూయెంజా అంటారని సమాజానికి తెలియజెప్పారు.

రాజకీయ కుటుంబాల్లో పెరిగే పిల్లల చుట్టూ ఒక కృత్రిమ వాతావరణం ఉంటుంది. చిన్నప్పటి నుండి గన్‌మెన్‌లు, సలాం కొట్టే అనుచరులు, వంగి వంగి దండాలు పెట్టే కార్యకర్తలను చూస్తూ వారు పెరుగుతారు. దీనివల్ల వారిలో ‘సైకలాజికల్ ఎంటైటిల్‌మెంట’ అనే ఒక మానసిక స్థితి ఏర్పడుతుంది. “నేను అందరికంటే ప్రత్యేకమైన వాడిని, చట్టాలు నా కోసం కాదు, సామాన్యుల కోసం మాత్రమే” అనే బలమైన భావన వారిలో నాటుకుపోతుంది.

సంపద తెచ్చిన జబ్బు

సంపద, అధికారం కలిసి మనిషికి ‘అఫ్లూయెంజా’ అనే ఒక రకమైన మానసిక స్థితిని కలిగిస్తాయి. ఇది అంటువ్యాధి లాంటిది. ఈ స్థితిలో ఉన్న యువత తాము చేసే తప్పుల పర్యవసానాలను అంచనా వేయలేరు. తల్లిదండ్రుల అధికారం తమను దేనినుండైనా కాపాడుతుందనే ధీమా వారిని నేరాల వైపు ఉసిగొల్పుతుంది. దీనికి తోడు ‘హ్యుబ్రిస్ సిండ్రోమ’ తోడైతే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. మితిమీరిన అహంకారం, ఇతరుల పట్ల చులకన భావం ఈ సిండ్రోమ్ ముఖ్య లక్షణాలు.

కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన పాల్ పిఫ్ అనే సైకాలజిస్ట్ దీనిపై అద్భుతమైన పరిశోధన చేశారు. ఆయన పరిశోధనల ప్రకారం, మనిషి దగ్గర అధికారం, డబ్బు పెరిగే కొద్దీ ఇతరుల పట్ల ఉండే సానుభూతి క్రమంగా తగ్గుతుంది. మెదడులోని ‘మిర్రర్ న్యూరాన్లు’ అంటే ఇతరుల బాధను చూసి స్పందించే కణాలు మొద్దుబారిపోతాయి. ఫలితంగా ఎదుటి వ్యక్తిని ఒక మనిషిలా కాకుండా ఒక వస్తువులా చూడటం మొదలవుతుంది.

ఒంటరితనం, అటెన్షన్ కోరుకోవడం

రాజకీయ నాయకులు నిరంతరం ప్రజల మధ్య, పార్టీ పనుల్లో బిజీగా ఉంటారు. దీనివల్ల పిల్లలకు కావాల్సిన సహజమైన ప్రేమానురాగాలు ఇంట్లో లభించవు. తల్లిదండ్రులు ఇచ్చే డబ్బు, లగ్జరీ జీవితం ఆ లోటును భర్తీ చేయలేవు. ఈ క్రమంలో పిల్లలు ఒక రకమైన ఏకాంతానికి లోనవుతారు. తమ ఉనికిని చాటుకోవడానికి, తల్లిదండ్రుల దృష్టిని ఆకర్షించడానికి వారు విపరీతమైన పనులు చేయడం మొదలుపెడతారు. దీన్నే ‘అటెన్షన్ సీకింగ్ బిహేవియర’ అంటారు. చెడ్డ పనైనా సరే, తన గురించి పది మంది మాట్లాడుకోవాలి, తన తండ్రి తన కోసం రంగంలోకి దిగాలి అనే ఒక వికృత కోరిక వారిని తప్పు దారి పట్టిస్తుంది.

బండి భగీరథ్ కేసు.. ఒక సామాజిక విశ్లేషణ..

ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ సాయి వ్యవహారాన్ని మనం ఒక కేస్ స్టడీగా చూడొచ్చు. 17 ఏళ్ల బాలికపై అత్యాచారం, బలవంతంగా మద్యం తాగించడం వంటి తీవ్రమైన ఆరోపణలతో అతనిపై పోక్సో కేసు నమోదైంది. ఈ ఘటన అధికార బలంతో కూడిన అహంకారానికి, బాధ్యతారాహిత్యానికి ఒక నిదర్శనంగా కనిపిస్తుంది.

ఈ కేసులో వెలుగులోకి వచ్చిన ‘హనీ ట్రాప’ వాదన కూడా ఆసక్తికరంగా ఉంది. తనను ట్రాప్ చేసి రూ.5 కోట్లు డిమాండ్ చేశారని భగీరథ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకపక్క తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు, మరోపక్క కుట్ర వాదనలు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, అధికారం ఉన్న కుటుంబాల్లో పిల్లలు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు వెంటనే రక్షణ కవచంలా మారుతారు.

బండి సంజయ్ కూడా ఇది తన రాజకీయ ఎదుగుదలను దెబ్బతీసే కుట్ర అని పేర్కొన్నారు. తప్పు ఎవరిదైనా సరే, ఇలాంటి ఉన్నత వర్గాల పిల్లల చుట్టూ ఉండే ‘ఎనేబ్లింగ్ ఎన్విరాన్‌మెంట’ వారిని మరింతగా నేరాల వైపు ప్రోత్సహిస్తుంది. అంటే, ఏం చేసినా వెనుక తండ్రి ఉన్నాడు, డబ్బు ఉంది, అధికారం ఉంది అనే ధైర్యం వారిని చట్టానికి భయపడకుండా చేస్తుంది.

సామాజిక బాధ్యత ఎక్కడ?

లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ చేసిన పరిశోధన ప్రకారం, అధికారంలో ఉన్నవారి చుట్టూ ఉండే ‘యస్-మెన’ (అవును అనేవారు) ఆ కుటుంబంలోని పిల్లలను కూడా చెడగొడతారు. వారు తప్పు చేసినా ప్రశ్నించే ధైర్యం ఎవరికీ ఉండదు. పైగా ఆ తప్పును సమర్థించే వారు, దానికి సహకరించే వారు అధికంగా ఉంటారు. ఇలాంటి వాతావరణంలో పెరిగే యువతకు సామాజిక బాధ్యత అంటే ఏంటో తెలియదు. వారు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించడం నుండి మహిళలను వేధించడం వరకు దేనినైనా ఒక సాదాసీదా విషయంగా చూస్తారు.

కొలంబియా విశ్వవిద్యాలయ అధ్యయనాలు చెప్తున్నట్లుగా, ఉన్నత వర్గాల పిల్లల్లో డ్రగ్స్ అలవాటు, హింసాత్మక ధోరణి ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం వారి చుట్టూ ఉండే లగ్జరీ వాతావరణం, దానితో వచ్చే ఒంటరితనం. వారు ఆ ఒత్తిడిని తట్టుకోలేక విచ్చలవిడితనానికి అలవాటు పడతారు. ఒకవేళ ఆ అమ్మాయికి మైనార్టీ తీరిపోయినంత మాత్రాన బండి భగీరథ్ ఆమె ఇష్టం లేకుండా ఆరోపణలో పేర్కొన్నట్లు వ్యవహరించడం తప్ప్పు. కోర్టు సినిమాలో చూపించినట్టు 18 ఏళ్ల లోపు ఇంటర్‌కోర్స్ జరిగితే నేరంగాను, దాటితే అంగీకారంగాను చూసే విధానం మారాలి. ఎప్ప్పుడైనా అమ్మాయి అంగీకారం లేకుండా జరిగే ఏ అంశం కూడా తప్పే. ఇదే లైన్‌ను పట్టుకొని తెలుగులో వకీల్‌సాబ్ సినిమా తీశారు. ఇప్ప్పుడు బండి భగీరథ్ కథ కూడా దాదాపు ఇటువంటిదే.

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు వార్తలు, గతంలో అతను తోటి విద్యార్థులపై దాడి చేసిన వీడియోలు చూస్తుంటే.. ఒక భయంకరమైన సామాజిక వాస్తవం కళ్లకు కడుతోంది. ఇది కేవలం ఒక వ్యక్తిగత నేరం కాదు, ఇది ఒక ‘సిస్టమిక్ సైకలాజికల్ ఫెయిల్యూర్’.

గతంలోనూ మనం ఇలాంటి ‘పుత్రరత్నాల’ అరాచకాలను చూశాం.

ఉత్తరప్రదేశ్‌లో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా రైతులపైకి వాహనాన్ని ఎక్కించిన ఘటన (లఖింపూర్ ఖేరీ), గతంలో మను శర్మ (వినోద్ శర్మ కుమారుడు) జెస్సికా లాల్‌ను కాల్చి చంపిన ఉదంతం.

హైదరాబాద్‌లోని జుబ్లీహిల్స్‌లో ఒక మైనర్ బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో అప్పటి అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే కుమారుడు, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కుమారుడు సహా పలువురు ఉన్నత స్థాయి రాజకీయ నాయకుల పిల్లలు నిందితులుగా ఉన్నారు. ప్రభుత్వ వాహనాన్నే ఈ నేరానికి వాడటం అప్పట్లో పెను సంచలనం.

2022లో జుబ్లీహిల్స్‌లో జరిగిన ఒక హిట్ అండ్ రన్ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు నిందితుడు. వీరందరి విషయంలోనూ ఒకటే కామన్ పాయింట్ - తండ్రి అధికారం అనే కవచం వెనుక దాక్కుని చట్టాన్ని పరిహసించడం. ఒక వ్యక్తి ప్రవర్తన అనేది ఆకాశం నుంచి ఊడిపడదు. అది అతను పెరిగిన వాతావరణం, అతను చూసిన రోల్ మోడల్స్, చట్టం పట్ల అతనికి ఉన్న చులకన భావం నుండి పుడుతుంది. బండి సాయి భగీరథ్ ఉదంతం ఒక వ్యక్తిగత వైఫల్యం కాదు, అది ఒక సిస్టమిక్ సైకలాజికల్ ఫెయిల్యూర్.

కొన్నాళ్ల క్రితం సోషల్ మీడియాలో కనిపించిన వీడియోలలో అతను తోటి విద్యార్థులను కొడుతున్నప్పుడు అతని కళ్లలో కనిపించేది కోపం కాదు, ఒక రకమైన సాడిస్టిక్ ప్లెజర్. చుట్టూ ఉన్నవారు ఆపుతున్నా అతను ఆపకపోవడానికి కారణం-అతని మనసులో ఉన్న సెన్స్ ఆఫ్ ఎన్‌టైటిల్‌మెంట్. ‘నేను కేంద్ర మంత్రి కొడుకును, నన్ను తాకే ధైర్యం ఎవరికి ఉంది?” అనే అహంకారం అతని విచక్షణను కప్పేసింది. దీన్నే క్లినికల్ సైకాలజీలో మాలిగ్నంట్ నార్సిజమ్ అంటారు.

ఒక బాలికకు మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడటం అనేది ఒక వ్యక్తిలోని అత్యంత నీచమైన ప్రిడేటరీ బిహేవియర్‌ని సూచిస్తుంది. అయినా అతనిలో ఎలాంటి పశ్చాత్తాపం లేదు, రాకపోవచ్చు కూడా. ఎందుకంటే, గతంలో దాడులు చేసినప్పుడు తండ్రి లేదా వ్యవస్థ అతనిని కంట్రోల్ చేయకపోవడం వల్ల, “నేను ఏం చేసినా తప్పించుకోగలను” అనే ధైర్యం పెరిగింది.

డ్యూయల్ పర్సనాలిటీ

బయట ప్రపంచానికి ‘దేశం’, ‘ధర్మం’, ‘సంస్కృతి’ అని చెప్పే తండ్రి.. తన కుమారుడికి కనీసం ‘మహిళల పట్ల గౌరవం’ అనే ప్రాథమిక ధర్మాన్ని నేర్పలేకపోయారు. దీన్నే మోరల్ డిసెంగేజ్‌మెంట్ అంటారు. అంటే సిద్ధాంతాలు వేదికలకే పరిమితం, వ్యక్తిగత జీవితంలో అరాచకమే పరమార్థం. అధికారం అనే కవచం వెనుక దాక్కుని చేసే ఇటువంటి నేరాలు సమాజానికి క్యాన్సర్ లాంటివి. భగీరథ్ ప్రవర్తన అనేది ఒక వ్యక్తిగత నేరం మాత్రమే కాదు, అది ఒక పొలిటికల్ వైరస్. అధికారం తలకెక్కిన నార్సిసిజం, శిక్ష పడదనే అహంకారం.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page