ఇది సైకాలజీ డ్రామా కాదు.. సోషల్ సెటైర్!
- Guest Writer
- Jul 4
- 2 min read

అది 1990-91 నాటి ఓ మిగిలిపోయిన జమీందారు రామప్ప రావు బహదూర్ (సత్యదేవ్) కథ. రోజూ ఫుల్ బాటిల్ వేసుకుని పడుకునే అతనికి ఓ మానసిక సమస్య లాంటి సమస్య ఉంది.అది అనుమానం. అనుమానం పెనుభూతం అని మన పెద్దలు ఎప్పుడో చెప్పినట్లు ఆ భూతం అతన్ని పూతనలా అతని బుర్రలో గుజ్జుని పీల్చేస్తూంటుంది. అయినా సమస్య లేదు. ఎందుకంటే..
వయస్సు అయ్యిపోయిన రామప్ప కి కావాల్సినంత డబ్బుంది. ఆస్తి ఉంది. అంతస్దు ఉంది. పేద్ద బంగళా ఉంది. ఇంటినిండా పనోళ్లు ఉన్నారు. ఒంట్లో లివర్ కంప్లైంట్ ఉంది. డాక్టర్లు ఇచ్చిన మరికొద్ది నెలలు బ్రతుకుతారనే హామీ ఉంది. ఖాళీగా ఉన్న మెదుడు తయారు చేసిన అనుమానం తోడుగా ఉంది. ఇంకేం కావాలి. తోచినప్పుడల్లా తాగుతూ వాగుతూ కాలక్షేపం చేసేస్తున్నాడు.
సరే...ఇంతకీ ఆయన మెదడుని డ్రిల్ చేస్తున్న ఆ అనుమానం ఏమిటి అంటే..”నా పెద్ద కొడుకు తెల్లగా ఉన్నాడు... చిన్నోడు నల్లగా ఎందుకు పుట్టాడు?” అని. ఈ అనుమానం తీరేది కాదు..తేలేదీ కాదు..కానీ రోజు రోజుకీ వృధ్ది అయ్యేది.
ఇంట్లో అందరూ కాలంతో ముందుకు వెళ్లిపోయారు. రామప్ప మాత్రం తన అనుమానాన్ని ప్రతిరోజూ పాలిష్ చేస్తూ కూర్చున్నాడు. అంతేకాదు ఇదే విషయాన్ని ఖాళీ దొరికినప్పుడల్లా అతని స్నేహితుడు డాక్టర్ ఆచారితో (వికాస్ ముప్పాల) డిస్కస్ చేస్తూంటాడు.దాంతో ఆ ఆచారి డాక్టర్ గారు.... రాబోయే సరికొత్త ‘డీఎనఏ టెస్టింగ’ టెక్నాలజీ ద్వారా, ఎన్నో ఏళ్లుగా రామప్పను వేధిస్తున్న అనుమానానికి తెరదించవచ్చని నమ్ముతాడు. అయితే అందుకు చాలా సమస్యలు ఉన్నాయి. వాటిని దాటారా...చివరకు ఏమైంది..DNA టెస్ట్ నిజానిజాలను బయటపెట్టి రామప్పకు మనశ్సాంతి ఇచ్చిందా? రామప్ప మళ్లీ మామూలు మనిషి అయ్యాడా? అనేదే మిగతా కథ.
విశ్లేషణ
ట్రైలర్ చూసినవాళ్లు... ఇది ఒక సైకాలజీ మిస్టరీ అనుకుంటారు. సినిమా మొదటి 30 నిమిషాలు కూడా అలాగే అనిపిస్తుంది. రామప్పకు ఏదో తెలియని మానసిక వ్యాధి. డాక్టర్లకు కూడా అర్థం కావడం లేదు (అఫ్ కోర్స్ మనకు కూడా అర్దం కావటం లేదు). పాత రాజభవనం.,చనిపోయిన కొడుకు, వింత కలలు, పూర్వీకుల దర్శనాలు, ణచీA టెస్ట్. ఇవన్నీ చూసిన మనం “చివరికి ఏదో షాకింగ్ మిస్టరీ ఉంటుంది.” అని ఎదురుచూస్తాం. అఫ్ కోర్స్ అనుకున్నట్లే ట్విస్ట్ ఉంది. అయితే దర్శకుడు వెంకటేష్ మహా చెప్పాలనుకున్నది మిస్టరీ కాదు. ట్విస్ట్ గురించి కాదు. “వంశం అనేది జీవించే మనుషుల కంటే చనిపోయినవాళ్ల ఆలోచనల బరువు.” అని.
ఒక మనిషి మనసులో “వంశం” అనే భావన ఎలా పుడుతుంది? ఎలా పెరుగుతుంది? చివరికి ఎలా అతడినే మింగేస్తుంది? అదే సినిమా. నిజానికి మొదటి 15 నిమిషాల్లోనే సినిమా ఒక అద్భుతమైన హుక్ వేస్తుంది. “ఈ మనిషికి అసలు ఏమైంది?” ఇది చాలా పవర్‌ఫుల్ డ్రమటిక్ క్వశ్చన్. కానీ...ప్రశ్నకు సినిమా దాదాపు రెండున్నర గంటలు సేపు సమాధానం చెప్పరు. అంతసేపు ప్రేక్షకుడిని కూర్చోబెట్టాలంటే...ప్రతి 10-15 నిమిషాలకు కొత్త విషయమూ.. కొత్త కాన్పిక్టో... కొత్త రివీలేషనో రావాలి. అదేమీ జరగదు. దాంతో కథ ముందుకు వెళ్తున్న భావన కంటే...అక్కడక్కడే..అదే చోట తిరుగుతున్నట్లు అనిపిస్తుంది.
రచయితగా వెంకటేష్ మహాకి తాను ఏం చెప్పాలనుకుంటున్నాడో చాలా క్లారిటీ ఉంది. వంశాభిమానం, రక్త సంబంధాల మీద మోజు, పితృస్వామ్య ఆలోచనలు. శరీర రంగు ఆధారంగా పుట్టే అనుమానాలు. ణచీA మీద పెరిగిన ఆశ. ఇవన్నీ మంచి ఐడియాలే. అయితే చూసేవాడికి ఇవన్ని ఎందుకు..వాడికి కథ కావాలి. బోనస్ గా అవీ అందితే సంతోషం అనుకుంటాడు. అలాంటప్పుడు థీమ్ ... కథలోంచి బయటకు రావాలి. కానీ ఇక్కడ కథ ఆగిపోయి థీమ్ మాట్లాడటం మొదలెట్టింది. అలాగే ఈ సినిమాలో Syఎbశీశ్రీఱsఎ కూడా ఎక్కువ రిపీట్ అయ్యినట్లు అనిపించింది.
ఫస్టాఫ్ సెటప్ .. మొత్తం చాలా స్లోగా నడిచింది. ఎంతలా అంటే ఇంక ఎప్పుడు ఇంటర్వెల్ వస్తుందా..లేకపోతే ఇంటర్వెల్ అయ్యిపోయినా మనకు తెలియలేదా అనిపించేటంత. అయితే సెకండాఫ్ లో ఆ సమస్యను దాటాడు దర్శకుడు. కథలో అసలు విషయం తెలుస్తుంది. సత్యదేవ్ మనస్సులో ఉన్న ఆలోచన తెలిసి మనం ఫాలో అవటం మొదలెడతాం. అలాగే మిస్టరీ ఒక్కో పొర విప్పటం మొదలెడతారు. కాబట్టి కాస్త రిలీఫ్.
చాలా మంది అనుకున్నట్లు ఇది సైకాలజీ డ్రామా కాదు.. సోషల్ సెటైర్!
ఎవరెలా చేసారు
సత్యదేవ్ దే ఈ సినిమా.లెప్ట్ ,రైట్, పైనా, క్రిందా మొత్తం అతనితోనే సినిమా నడుస్తుంది. నడిపించాడు కూడా. మిగతా ఆర్టిస్ట్ లు అతని నటన ముందు కొన్ని సార్లు తేలిపోయారు. మరికొన్నిసార్లు అతను నటిస్తున్నాడు కదా మనకెందుకులే అని ఫ్రేమ్ లో రిలాక్స్ అయ్యారు.
ఇక టెక్నికల్ గా ఈ సినిమా మంచి సౌండ్ గా ఉంది. ఆ కాలం నాటి వాతావరణాన్ని బాగానే క్రియేట్ చేసారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమా మూడ్ ని ముందుకు తీసుకెళ్లింది. ఎప్పటిలాగే ఎడిటింగ్ ...వీక్. వెంకటేష్ మహా..కొత్త పాయింట్ ని ధైర్యంగా ఎంచుకున్నాడు ,కొత్తగా చెప్దామనే ప్రయత్నం చేసాడు. అది నచ్చిందా లేదా అనేది వేరే సంగతి.
ఫైనల్ థాట్
ఈ సినిమా మనని అలరించడానికి కంటే ఆలోచింపజేయడానికి ఎక్కువ ప్రయత్నించిన సినిమా. అదే సమయంలో మరీ ఆలోచన ఎక్కువైతే నిద్రలోకి జారుకునేవాళ్లు కూడా ఎక్కువే అని మర్చిపోయిన సినిమా.
-సూర్య ప్రకాష్ జోశ్యుల






Comments