top of page

‘ఇన్‌ఛార్జి’ రాజ్యం.. ఇంకెన్నాళ్లు?

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Mar 28
  • 3 min read
  • 60 శాతానికిపైగా పోస్టులది ఇదే పరిస్థితి

  • రెగ్యులర్ అధికారులు లేక పాలన పడక

  • ఉన్న వారికి అదనపు బాధ్యతల భారం

  • పంచాయతీలు, మున్సిపాలిటీల పైనా ప్రత్యేక ముద్ర

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

కలెక్టర్ పేరుతో జిల్లా పరిపాలన సాగించాల్సిన రెవెన్యూ అధికారి (డీఆర్వో) పోస్టును ఐదు నెలల తర్వాత ఏలూరు నుంచి వచ్చిన విశ్వేశ్వరరావుతో భర్తీ చేశారు. అంటే కీలకమైన ఈ పోస్టు సుదీర్ఘ కాలం ఖాళీగా ఉండిపోతే దాని ప్రభావం జిల్లా పాలనపై ఎంతగా ఉంటుందో చెప్పనవసరంలేదు. ఇదొక్కటే కాదు రెగ్యులర్ అధికారులు లేక ఇన్‌ఛార్జీలతో కొన్ని విభాగాలు, ఆ దిక్కు కూడా లేక అనాథల్లా మరికొన్ని డిపార్ట్‌మెంట్లు కునారిల్లుతున్నది. డ్వామా ఇన్‌ఛార్జి పీడీగా లవరాజు వ్యవహరిస్తున్నారు. ఇదే విభాగంలో విజిలెన్స్ సెల్‌లో పని చేస్తున్న ఈయనకు పీడీ అదనపు బాధ్యత. మెప్మా పీడీగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన శైల్పుకు వికలాంగుల శాఖ ఏడీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ ఇన్‌చార్జిగా శ్రీకాకుళం డివిజనల్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌కు బాధ్యతలు అప్పగించి ఏడాదైంది. ఇక జిల్లా విద్యాశాఖలో డిప్యూటీ డీఈవోలందరూ ఇన్‌ఛార్జిలే. శ్రీకాకుళం కార్పొరేషన్‌కు నెల రోజుల పాటు జేసీని ఇన్‌ఛార్జిగా వేసిన ప్రభుత్వం తిరిగి మూడునాలుగు రోజుల క్రితం కూర్మారావుపై సస్పెన్షన్ ఎత్తివేసి కమిషనర్‌గా తిరిగి నియమించింది. నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ విభాగంలో ఇద్దరు డీఈలు మినహా మిగతా కీలక విభాగాల్లో నాలుగేళ్లుగా ఇన్‌ఛార్జిలతో నెట్టుకొస్తున్నారు. జెడ్పీ సీఈవో శ్రీధర్‌రాజా బదిలీ అయ్యి ఆరు నెలలు కావస్తున్నా ఇంతవరకు ఎవరినీ నియమించకుండా డిప్యూటీ సీఈవో సత్యనారాయణను ఇన్‌ఛార్జిగా కొనసాగిస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖలో ఎంపీడీవోలకు ఉద్యోగోన్నతులు కల్పించినా రెగ్యులర్ జెడ్పీ సీఈవోను మాత్రం నియమించలేదు. శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి(రిమ్స్) సీఎసఆరఎంవో డాక్టర్ అనితకే జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈమెపై అవినీతి ఆరోపణలు వచ్చినా పట్టించుకోకుండా తొమ్మిది నెలలుగా ఎఫఏసీ ీVAదాలో కొనసాగిస్తున్నారు. వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ ఉద్యోగ విరమణ చేసి ఏడు నెలలు కాగా ఆ స్థానంలో డీడీ కె.త్రినాథస్వామిని పూర్తి అదనపు బాధ్యతలతో నెట్టుకొస్తున్నారు. జిల్లా నీటిపారుదల శాఖలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఈఈని ఎసఈగా, డీఈలను ఈఈలుగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించి కొనసాగిస్తున్నారు. పశుసంవర్ధక శాఖ జేడీ పోస్టు నెలల తరబడి ఖాళీగా ఉండగా డీడీ కె.రాజగోపాలరావు ఎఫఏసీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గృహనిర్మాణశాఖ పీడీ ఏడు నెలల క్రితం రిటైర్ కాగా ఆయన స్థానంలో పూర్తి అదనపు బాధ్యతలు, ఇన్‌ఛార్జిలుగా ఇద్దరిని నియమించి ప్రస్తుత ఈఈకి బాధ్యతలు అప్పగించారు. మత్స్యశాఖ జేడీగా ప్రమోషన్ పొంది గత ఏడాది మార్చిలో బదిలీపై వెళ్లిపోయిన అధికారి స్థానంలో ఏడీ సత్యనారాయణకు అదనపు బాధ్యతలు అప్పగించారు. గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య విభాగం ఇన్‌ఛార్జి ఎసఈగా ఈఈ పి.శంకరబాబే రెండేళ్లుగా వ్యవహరిస్తున్నారు. జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ బాధ్యతలను విజయనగరం జిల్లాకు చెందిన అధికారికి అప్పగించారు. ఐసీడీఎస్ పీడీ విమల విధుల్లో చేరిన ఆరునెలల్లోనే బదిలీపై వెళ్లిపోవడంతో రణస్థలం పీవోగా పనిచేస్తున్న కె.రూపలతను తీసుకొచ్చి పీడీ(ఎఫఏసీ)గా బాధ్యతలు అప్పగించారు. పంచాయతీరాజ్ ఎసఐగా ఈఈ వీరన్నాయుడు పూర్తి అదనపు బాధ్యతలు చూస్తున్నారు. జిల్లా రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్న అధికారి విజయనగరంలోనూ బాధ్యతల్లో ఉన్నారు. వారంలో ఒకరోజు మాత్రమే శ్రీకాకుళం వచ్చి వెళుతున్నారు. ఇలా అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ ఇన్‌చార్జిల తంతు నడుస్తున్నది.

స్థానికసంస్థలదీ అదే దుస్థితి

ప్రభుత్వ శాఖýను పూర్తిస్థాయి అధికారుల కొరత వేధిస్తున్నా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. రిటైర్‌మెంట్లు, ప్రమోషన్ల ద్వారా ఖాళీ అవుతున్న కీలక స్థానాల్లో ఇన్‌ఛార్జిలనో, ఎఫఏసీలనో నియమించి చేతులు దులుపు కొంటున్నారు. ఖాళీ అవుతున్న పోస్టుల్లో స్థానంలో రెగ్యులర్ అధికారులను నెలల తరబడి నియమించకపోవడం వల్ల పాలన పడకేస్తున్నది. అదే సమయంలో ఇన్‌ఛార్జీలుగా, ఎఫఏసీలుగా వ్యవహరిస్తున్న అధికారులు తమ రెగ్యులర్ పోస్టుతోపాటు అదనపు బాధ్యతలు చూడలేక పనిభారంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. రెండు పడవలపై ప్రయాణం మాదిరిగా దేనికీ న్యాయం చేయలేకపోతున్నారు. జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులు నిర్వహించే టెలీ, వీడియో కాన్ఫరెన్స్‌లు, శాఖాపరమైన సమీక్షలు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక సమావేశాýతో సతమతమవుతున్నారు. దీనికితోడు కార్యాలయాల్లో దిగువ స్థాయి ఉద్యోగులు, సిబ్బంది కొరత వేధిస్తుండడంతో అదనపు బాధ్యతలు భారంగా మారాయని తలలు పట్టుకుంటున్నారు. జిల్లా కార్యాలయాల్లోని సుమారు 60 శాతం స్థానాల్లో ఎఫఏసీలు, ఇన్‌ఛార్జిలే కొనసాగుతున్నారు. దీనికితోడు పట్టణ స్థానిక సంస్థల పదవీకాలం పూర్తి కావడంతో మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళ్లిపోయాయి. అలాగే సర్పంచుల పదవీ కాలం పూర్తి కానుండటంతో ఏప్రిల్ రెండు నుంచి గ్రామ పంచాయతీలకు కూడా ప్రత్యేక అధికారులు రానున్నారు. జిల్లాలోని 912 పంచాయతీలకు అధికారులను ఖరారు చేసే కసరత్తు ఇప్పటికే ప్రారంభమైంది. బీసీ రిజర్వేషన్లపై స్పష్టత వచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తుండటంతో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం లేదన్న చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ ఏడాది సెప్టెంబర్ 25 నాటికి ఎంపీపీ, జెడ్పీటీసీల పదవీ కాలం పూర్తికానుంది. సెప్టెంబర్ నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోÔ ఆ తర్వాత జనగణన ఎన్నికల ప్రక్రియకు అడ్డంకిగా మారవచ్చంటున్నారు. కొన్ని శాఖల అధికారుల విషయంలో ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని తమకు అనుకూలమైన వారికి పోస్టింగులు ఇస్తూ మిగతా శాఖలను మాత్రం గాలికొదిలేస్తున్నారన్న అభిప్రాయం ఉద్యోగ వర్గాల్లో ఉంది. ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైతే జిల్లాలో ఉన్న అధికారులందరూ రెండు, అంతకంటే ఎక్కువ బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page