top of page

ఇలాంటివన్నీ విష్ణుకే జరుగుతాయేంటో..?!

  • Guest Writer
  • May 27
  • 2 min read



కన్నప్ప’ హార్డ్‌డిస్క్‌ మాయమైంది. ఈ వ్యవహారంలో ఇద్దరు వ్యక్తులపై కేస్‌ పెట్టింది ‘కన్నప్ప’ టీమ్‌. కన్నప్ప హార్డ్‌ డిస్క్‌ పట్టుకొని ఇద్దరు పారిపోయారని, వాళ్లని పట్టుకోవాలని పోలీసుల్ని కోరారు కన్నప్ప ఎగ్జిక్యూటీవ్‌ ప్రొడ్యూసర్‌.

కన్నప్ప సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాల్ని ముంబైలోని ఓ స్టూడియోలో విజువల్‌ ఎఫెక్ట్స్‌ చేయించారు. వాళ్లేమో ఆ సన్నివేశాల్ని హార్డ్‌డిస్క్‌లో పెట్టి కొరియర్‌ చేశారు. ఆ కొరియర్‌ అందుకొన్న ఆఫీస్‌ బాయ్‌ రఘు దాన్ని తన దగ్గరే అట్టిపెట్టుకొన్నాడు. ఇప్పుడు మరో మహిళతో కలిసి పరార్‌ అయ్యాడు. ఆ హార్డ్‌ డిస్క్‌ కోసం ఇప్పుడు పోలీసుల్ని ఆశ్రయించింది టీమ్‌.

విష్ణు చెబుతోంది నిజమే అయితే ‘కన్నప్ప’ రూ.200 కోట్ల సినిమా. అలాంటి ఖరీదైన సినిమాలోని సన్నివేశాల్ని ఇలా కొరియర్లలో పంపిస్తారా ఎవరైనా? ఒకవేళ హార్డ్‌డిస్క్‌ మిస్‌ అయినా, సాఫ్ట్‌ కాపీ సదరు స్టూడియోలో ఉంటుంది కాబట్టి బెంగ పడాల్సిన పనిలేదు. అయితే ఈలోగా ఆ సన్నివేశాలు లీక్‌ చేస్తారేమో అనే భయం విష్ణుకి ఉండి ఉంటుంది. పారిపోయిన ఇద్దరూ ఒకరి ‘గైడెన్స్‌’లో నడుస్తున్నారని, దీని వెనుక ఓ అజ్ఞాత వ్యక్తి ఉన్నారని ఆ కంప్లైంట్‌ లో పేర్కొన్నారని తెలుస్తోంది.

మంచు మనోజ్‌ తో విష్ణుకి గొడవలున్న సంగతి తెలిసిందే. విష్ణు కూడా ఇక్కడ పరోక్షంగా మంచు మనోజ్‌ పేరే ప్రస్తావించాడనిపిస్తోంది. జనరేటర్‌లో పంచదార పోయడం.. హార్డ్‌ డిస్కులు ఎత్తుకుపోవడం.. ఇలాంటివన్నీ మంచు కుటుంబంలోనే జరుగుతాయెందుకో మరి.

ఇదేం ‘స్పిరిట్‌’ దీపికా??


దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా చేసిన ఓ ట్వీట్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. తానో కథానాయికకు కథ చెప్పానని, అయితే ఆ కథని లీక్‌ చేస్తోందని, ఓ దర్శ కుడు ఎవరికి కథ చెప్పినా దాన్ని లీక్‌ చేయకూడదన్నది ఓ అలిఖిత నిబంధన అని, దాన్ని సదరు కథానాయిక బ్రేక్‌ చేస్తోందని, ఇదేం ఫెమినిజం? అని ప్రశ్నించారు. ’’నాకు సినిమానే ప్రపంచం. ఓ కథ రాసుకోవడానికి సంవత్సరాలు కష్టపడతా. దాన్ని మీరు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. ఏం కావాలంటే అది చేసుకోండి. నేనెప్పటికీ భయ పడను’’ అంటూ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ దీపికా పదుకొణేని ఉద్దేశించి చేసిందే అన్నది అందరి అభిప్రాయం. ఎందుకంటే ఈమధ్యే ఆయన దీపికకు స్పిరిట్‌ కథ చెప్పారు. కథానాయికగా తీసుకొందామనుకొన్నారు. కానీ మధ్యలో దీపిక-సందీప్‌ మధ్య అభిప్రాయ బేధాలొచ్చాయి. దాంతో దీపిక పక్కకు వెళ్లిపోయింది. ఆ స్థానంలో త్రిప్తిని ఎంచుకొన్నారు. అయితే తనని పక్కన పెట్టారన్న కోపంతో దీపిక రగిలి పోతోందని, అందుకే స్పిరిట్‌ కథని అందరికీ లీక్‌ చేస్తోందని, అంతే కాకుండా ఇదో ఏ గ్రేడ్‌ సినిమా అంటూ ప్రచారం చేస్తోందని తెలుస్తోంది. ఈ విషయం సందీప్‌ రెడ్డికి తెలిసింది. దాంతో ఇలా స్పందించాల్సివచ్చింది. అయినా దీపికా లాంటి స్టార్‌ మరీ ఇంత చిన్నపిల్లలా ప్రవర్తించడం ఏమిటో అర్థం కావడం లేదు. తనని పక్కన పెట్టారన్న పంతం, కోపం ఇలా ప్రదర్శిస్తే నటిగా తన స్పిరిట్‌ ఏమైనట్టు? ఓ సినిమా నుంచి ఓ కథానాయికని తప్పించడం కొత్తగా జరిగిందేం కాదు.

తెలుగు 360.కామ్‌ సౌజన్యంతో...

బేబమ్మ బోల్డ్‌ టాక్స్‌.. ఐనా కానీ..!


ఉప్పెనతో సూపర్‌ క్రేజ్‌ తెచ్చుకున్న కృతిశెట్టి తొలి సినిమాతోనే యూత్‌ ఆడియన్స్‌ లో ఒక మంచి పాపులారిటీ సంపాదించింది. ఐతే ఆ సినిమా తో వచ్చిన క్రేజ్‌ కొన్నాళ్లే ఉండగా ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు తప్ప తర్వాత అన్నీ కూడా నిరాశపరిచాయి. కృతి శెట్టి చేసిన సినిమాలన్నీ కూడా ఫ్లాప్‌ అవ్వడంతో ఆమెకు అవకాశాలు కూడా సన్నగిల్లాయి. తెలుగులో చివరగ మనమే సినిమా చేసింది బేబమ్మ. ఆ తర్వాత ఒక్క ఛాన్స్‌ కూడా రాలేదు. మరోపక్క తమిళ్‌ లో అమ్మడు ఎల్‌.ఐ.కె, జినీ సినిమాలు చేస్తుంది. ఆ రెండిటి మీదే అంచనాలను పెట్టుకుంది. ఈమధ్యలో మలయాళంలో కూడా ఒక సినిమా ట్రైల్‌ వేసిన అమ్మడు అక్కడ పర్వాలేదు అనిపించుకున్నా నెక్స్ట్‌ ఛాన్స్‌ లు మాత్రం రాలేదు. అందుకే కలిసి వచ్చిన టాలీవుడ్‌ మీదే ఇంకాస్త ఫోకస్‌ పెట్టాలని అనుకుంటుంది కృతి శెట్టి. ఐతే ఇన్నాళ్లు గ్లామర్‌ షో విషయంలో కాస్త మొహమాటం చూపించిన అమ్మడు ఇక మీదట గ్లామర్‌ గేట్లు ఎత్తేయాలని ఫిక్స్‌ అయ్యింది.

అంతేకాదు ఏదైనా బోల్డ్‌ సబ్జెక్ట్‌ ఉన్నా కూడా చేయాలని చూస్తుందట. యూత్‌ ఆడియన్స్‌ కి ఈమధ్య కాస్త బోల్డ్‌ రోల్స్‌ చేసిన హీరోయిన్స్‌ ని ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఐతే కెరీర్‌ లో ఇప్పటివరకు కృతి శెట్టి గ్లామర్‌ రోల్స్‌ చేసింది లేదు. ఆమెకు వచ్చిన అవకాశాలను చేస్తూ కెరీర్‌ వెళ్లదీసింది. ఐతే గేర్‌ మార్చి అమ్మడు గ్లామర్‌ రోల్స్‌ బోల్డ్‌ అటెంప్ట్‌ చేయాలని ఫిక్స్‌ అయ్యింది. అలా చేస్తేనన్నా ఆడియన్స్‌ లో తను ఒక ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేయగలనని అనుకుంటుంది అమ్మడు. కృతి శెట్టి యాక్టింగ్‌ పరంగా పర్వాలేదనిపిస్తున్నా ఇక మీదట దానికి తోడు గ్లామర్‌ షో కూడా తోడైతే కెరీర్‌ ఇంకాస్త బెటర్‌ గా ఉంటుందని భావిస్తుంది. ఐతే బేబమ్మ నిర్ణయం వల్ల నిజంగానే ఆమె కెరీర్‌ ఊపందుకుంటుందా లేదా అన్నది చూడాలి. క్లాస్‌ లుక్స్‌ తో కుర్రాళ్లను మెప్పించిన కృతి శెట్టి ఇక మీదట గ్లామర్‌ డోస్‌ పెంచి అదరగొట్టాలని చూస్తుంది. మరి అమ్మడి ప్రయత్నాలు ఎంతవరకు వర్క్‌ అవుట్‌ అవుతాయో చూడాలి.

తుపాకి.కామ్‌ సౌజన్యంతో...

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page