ఒకరి పెళ్లాం ఇంకొకడి మొగుడితో లేచిపోవడమే లేటెస్ట్ ఫ్యాషన్
- ADMIN
- Feb 20
- 2 min read

సమయం అర్థరాత్రి దాటింది, ఊరు ఊరంతా గాఢ నిద్రలో ఉంది..
ఇంతలో ఓ మండువా లోగిలి ఇంటిలో నుంచి ఓ పద్దెనిమిదేళ్ల అమ్మాయి చప్పుడు చేయకుండా గోడ దూకింది..
బయట ఓ కుర్రాడు సైకిల్ మీద రెడీగా ఉన్నాడు..
అమ్మాయి రాగానే గబుక్కున సైకిల్ ఎక్కించుకుని వాయువేగంతో తొక్కడం మొదలుపెట్టాడు..
కట్ చేస్తే..
కుర్రాడు కోయంబత్తూరు గుడిలో పిల్ల మెడలో తాళి కడతాడు..
కట్ చేస్తే..
పిల్ల తండ్రి కొంతమంది రౌడీలను వేసుకుని చేజింగ్ మొదలుపెడతాడు !
ఏంటి స్టోరీ అనుకుంటున్నారా?
మొన్నటిదాకా సినిమాల్లో స్టోరీలు ఇలాగే ఉండేవి కదా!
ఇప్పుడు స్టోరీలు మారిపోయాయి.. పెళ్లి కాని పిల్లలు లేచిపోవడం పాత స్టోరీలు. పెళ్లయిన అంకుల్స్.. పెళ్లయిన ఆంటీలు లేచిపోవడం కొత్త స్టోరీలు. అవును కొత్త స్టోరీలు పుట్టుకొస్తున్నాయి !
కొత్త స్టోరీ ఏంటంటారా?
సమయం అర్థరాత్రి దాటింది.. ఊరు ఊరంతా గాఢనిద్రలో ఉంది.. సుబ్బారావుకు సడెన్‌గా మెలుకువ వచ్చింది.. పక్కలో చూసి ఉలిక్కిపడ్డాడు.. పక్కన ఉండాల్సిన భార్య లేదు.. సరిగ్గా అదే టైమ్‌కు వాట్సాప్ మోగింది.. సుబ్బారావు భార్య అప్పారావుతో లేచిపోయి కేక్ కటింగ్ చేసుకుంటున్న వీడియో కనిపించింది..
కింద టైటిల్.. ‘అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.. 57తో 47 ప్రేమలో పడిరది..’. ఇదేంటి స్టోరీ డిఫరెంట్‌గా ఉంది అనుకుంటున్నారా?
ఎంతసేపూ పాత చింతకాయ పచ్చడేనా?
ప్రస్తుతం ట్రెండిరగ్‌లో ఉన్న స్టోరీలు కూడా చెప్పుకోవాలి కదా?
మొన్నటికి మొన్న మన నరేష్ పవిత్ర బంధం నుంచి ఈనాటి దువ్వాడ అడల్టరేషన్ స్నేహాలు సూపర్ ట్రెండిరగ్ అవలేదూ?
ఇంకోడి పెళ్లాం ఇంకోడి మొగుడితో లేచిపోవడమే లేటెస్ట్ ఫ్యాషన్ అయిపోయింది కదా!
లేటు వయసులో కుటుంబాలను గాలికి వదిలేసి లేచిపోయే ముందు కనీసం పరువు ప్రతిష్ఠ అని సిగ్గుపడుతున్నారా అంటే అదీ లేదు. సుబ్బరంగా ఫోటోషూట్ తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. పైగా ఆ దరిద్రాలను పబ్లిక్ చేస్తున్నారు.
ఎటుపోతుంది వైవాహిక వ్యవస్థ? నాలుగు గోడల మధ్య పరిష్కారం చేసుకోవాల్సిన ఫ్యామిలీ విషయాలు బజారున పడేసుకోవడం లేదూ?
ఆ మధ్య భార్య మీద అలిగి సినీ నటుడు నరేష్ క్యారక్టర్ ఆర్టిస్టు వివాహిత అయిన పవిత్రతో ఏకంగా బెంగుళూరులో ఓ హోటల్ రూంలో నైట్ స్టే చేసి ఈ విషయాన్ని కావాలనే భార్యకు తెలిసేలా చేసి నానా అల్లరి చేసుకున్నాడు. అదో ఆనందం..!
ఈ లేచిపోవడాల స్టోరీ అంతా టీవీల్లో డైలీ ఎపిసోడ్లు టెలీకాస్ట్ అయ్యాయి కూడా. అది అయ్యింది అనుకునేలోపు దువ్వాడ ఎపిసోడ్ మొదలైంది. పెళ్లయి పెళ్లాం పిల్లలు ఉన్న దువ్వాడ శ్రీను (పైగా ఎమ్మెల్సీ కూడా) ఇంకొకరి భార్యతో రిలేషన్ షిప్‌లో ఉన్నాడని ఆయన భార్య ఇంటిముందు నిరాహార దీక్ష కూడా చేసింది.
చట్ మా ఇద్దరి మధ్య అలాటిది ఏమీ లేదు.. కేవలం అడల్టరేషన్ స్నేహం మాత్రమే ఉందని కొత్త అర్థం చెప్పింది ఆ ఇంకొకరి భార్య దివ్వెల మాధురి.
అమెరికాలో ఉన్న మాధురి భర్తను మీడియా వాళ్లు అడిగితే మా అవిడ చెప్పింది నిజమే.. అంతేగా అంతేగా అన్నాడు (వదిలించుకుందాం అనుకునేవాళ్లు లేటెస్టుగా ఈ ఫార్ములా ఫాలో అవుతున్నారు)
సరే ధనం మూలం ఇదం జగత్ అన్నారు కదా.. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని ఆ రష్యా ఆయన ఎప్పుడో చెప్పేశాడు కదా.. డబ్బుతో పరిష్కారం కానిది ఏముంటుంది? సెటిల్ అయ్యింది.. కథ సుఖాంతం అయ్యింది. మళ్లీ ఇన్నాళ్లకు.. పడక పడక ఆ దిక్కుమాలిన వీడియో నాకంట పడాలా?
మొన్న వాలంటెన్ డే సందర్భంగా లేటు వయసులో ఘాటు ప్రేమికులు దువ్వాడ శ్రీను.. దివ్వెల మాధురి తమ ముదర ప్రేమకు గుర్తుగా నలుగురినీ పిలిచి కేక్ కటింగ్ చేశారు. కేక్ కట్ చేస్తే చేశారు.. ఆవిడగారు ఆయన గారికి ముద్దు కూడా పెట్టేశారు.. పైగా ఓ యూ ట్యూబ్ ఛానెల్ వారిని పిలిచి మరీ తమ ప్రేమను లైవ్‌లో పెట్టేశారు. పెడితే పెట్టారు.. దువ్వాడ శ్రీనుతో పిల్లల్ని కనాలని ఉందని ఆవిడ గారు మనసులో మాట బయటపెట్టింది.
అప్పుడు అర్థమైంది నాకు.. ఓహో అవిడ చెప్పిన అడల్టరేషన్ స్నేహం అంటే ఇదా అని. ఇక ఆ నరేష్ గారైతే ఏకంగా కొత్త ఫార్ములా చెప్పేశారు.. ఈ వయసులో పిల్లల్ని ప్లాన్ చేసుకుంటే తనకు ఎన్నేళ్లు వస్తే పిల్లవాడు పెరిగి చేతికి అంది వస్తాడో లెక్కలు వేసి మరీ చెప్పాడు. ఆ మాధమేటిక్స్ చూసి వార్నీ అనుకున్నా.
అన్నట్టు ఈ రెండు స్టోరీలు చూసి ఇన్‌స్పైర్ అయినట్టు ఉన్నారు గుంటూరుకు చెందిన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ గారు. వారు కూడా ఇంకొకరి భార్యతో అడల్టరేషన్ స్నేహంలో ఉండగా.. ఆయన భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీస్ కంప్లయింట్ ఇచ్చిందట. ఇప్పుడు టీవీల్లో వస్తుంది. ఇంకో స్టోరీ మొదలైంది. పర్లేదు కొత్త ఫార్ములాని జనం బానే ఫాలో అవుతున్నారు. సెకండ్ హ్యాండ్లకు గిరాకీ బానే ఉంది! ఎందుకో ఈమధ్య స్లో అయ్యాడు కానీ.. లేకపోతేనా రామ్‌గోపాల్ వర్మ ఈ రెండు స్టోరీలు కలిపి ఓ సినిమా తీసి చూస్తే చూడండి లేకపోతే మీ ఖర్మ అని జనం మీదికి వదిలేవాడు. అదీ సంగతి..
- పరేష్ తుర్లపాటి
Comments