top of page

ఇండియా గేమ్ మొదలుపెట్టింది!

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • Apr 13
  • 2 min read
  • సీజ్‌ఫైర్ చర్చలు విఫలం కావడంతో రంగంలోకి జయశంకర్

  • యూకే, యూఏఈని దగ్గర చేర్చుకునే యత్నం


హార్మూజ్‌లో టోల్ వసూలుచేస్తే మన సముద్రంలోనూ టోల్ పెడతామని హెచ్చరిక

మొన్న దాదాపు 21 గంటల పాటు ఇస్లామాబాద్‌లో పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో ఇరాన్ యుద్ధంపై శాంతి చర్చలు జరిగాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ చర్చలు ఫెయిలయ్యాయని ప్రకటించాడు. వాస్తవానికి పాకిస్తాన్ అందరి టైంను వేస్ట్ చేస్తోంది. అణ్వాయుధ ప్రయోగాన్ని ఆపేయాలి, అలాగే 460 కేజీల యురేనియం నిల్వను కూడా ఇరాన్ తిరిగి ఇచ్చేయాలి అంటే కుదురుతుందా? ఈ ఒక్క పాయింట్ మీద చర్చలు ఫెయిýయ్యాయి. ఇదే టైంలో మన విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ యూఏఈకు వెళ్లారు. యూకే ప్రధాని కేఎస్ స్టార్మర్‌ను కలవడానికి ఖతార్ వెళ్లారు. హర్దీప్ సింగ్ పూరి దోహాకు వెళ్లి వచ్చారు. చివరకు వాణిజ్య మంత్రి బెహరీన్/ కువైట్‌కి వెళ్లారు. యునైటెడ్ కింగ్‌డమ్ 1940ల్లో ప్రపంచాన్ని తగలబెట్టేసింది. ఇరాన్, కాశ్మీర్, ఇజ్రాయిల్, పాలస్తీనా, చైనా, తైవాన్ ఈ యుద్ధాలన్నిటికీ కారణం బ్రిటిషర్లే. ఇప్ప్పుడా బ్రిటిషర్లే ఏడుస్తున్నారు. హార్మూజ్‌లో టోల్ కట్టేది లేదంటున్నాడు బ్రిటిష్ ప్రధాని. మన జయశంకర్ కూడా టోల్ కట్టే సంస్కృతిని తీసుకురావద్దని పరోక్షంగా చెబుతున్నారు. ఒక్కసారి హర్మూజ్‌లో టోల్ కడితే.. మిగిలిన దేశాý సముద్రభాగాల్లో కూడా టోల్ కట్టాల్సి వస్తుందని చెప్పి చాలా గట్టిగా జయశంకర్ దౌత్య యుద్ధం చేస్తున్నారు. ఇలా అయితే ఇండియన్ ఓషన్‌లో తిరిగే షిప్స్‌పై కూడా టోల్ వేస్తామనే అర్థం వచ్చేలా మారిషిస్‌లో మీటింగ్ పెట్టారు. మొన్న జయశంకర్ అబుదాబీలో పర్యటించారు. ఇరాన్`అమెరికా మధ్య కాల్పుల విరమణ చర్చలు జరుగుతున్నప్ప్పుడే ఈయన అక్కడికి ఎందుకెళ్లారంటే.. యూఏఈను ఈ చర్చల్లో పాకిస్తాన్ దూరం పెట్టింది. యుద్ధ సమయంలో పాకిస్తాన్ ఇరాన్‌తో క్లోజ్ అవ్వడం యూఏఈకు నచ్చలేదు. ఇరాన్‌పై ఆంక్షలు ఎత్తివేయాలంటూ పాకిస్తాన్ ప్రకటించడం యూఏఈకి నచ్చడం లేదు. పాకిస్తాన్ యూఏఈకి దాదాపు 26వేల కోట్లు బాకీ ఉంది. యుద్ధం మధ్యలో యూఏఈ తమ అప్పులను వెంటనే తీర్చుమని పాకిస్తాన్‌పై వత్తిడి పెట్టింది. లేదంటే దుబాయ్‌లో ఆస్తులు కొన్న పాక్ ధనవంతుల ఆస్తులను జప్తు చేస్తాము అని బెదిరించింది. దీన్ని క్యాష్ చేయడానికే జయశంకర్ యూఏఈకి వెళ్లారు. అంతే కాదు.. సౌదీ, కువైట్, ఒమాన్, ఖతార్, బెహరీన్.. మొత్తంగా ఐదు దేశాల నుంచి పాకిస్తాన్‌ను దూరం చేయడానికి ప్లానింగ్ జరుగుతోంది. పాక్ వల్ల కువైట్ జిడిపీలో 14% కోల్పోయింది. అలాగే పాకిస్తాన్ ఇస్లామిక్ దేశాలకు పెద్దన్న అవ్వాలని ట్రై చేస్తోంది. తమ దేశాల పాలనలో పాకిస్తాన్ ఎంట్రీ ఇవ్వడం మిగతా గల్ఫ్ దేశాలకు ఇష్టం లేదు.

జేడి వాన్స్‌కు ఏం కావాలి? ఇరాన్‌కు ఏం కావాలి? అని కరెక్ట్‌గా అర్థం చేసుకొని పాకిస్తాన్ మీడియేషన్ చేసిందా అనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఎందుకంటే.. 100, 200 మిలియన్ డాలర్స్ కోసం చేతులు, కాళ్లు ఆడించే పాకిస్తాన్ కేవలం 30 రోజుల్లో సీజ్‌ఫైర్ ఎలా చేస్తుందని ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలందరూ నోర్లు వెల్లబెట్టుకున్నారు. పాకిస్తాన్ ఏం మాట్లాడిందో ఏమో గాని 21 గంటల్లో జేడి వాన్స్ తల పట్టుకొని ఎంబసీకి పారిపోయాడు. ఇక్కడ పాక్‌ను నమ్మి ఇరాన్ ట్రాప్‌లో ఇరుక్కుందా? జయశంకర్ గేమ్ మనం అర్థం చేసుకోవాలి. ఏప్రిల్ 11.. అంటే మొన్న పాకిస్తాన్ 13ఎఫ్ 16 ఫైటర్ జెట్స్‌ను, 1300 మంది సైనికుల్ని సౌదీ అరేబియాకు పంపింది. క్లైమాక్స్ ఫైట్ అయిపోయిన తర్వాత పోలీసులు వచ్చినట్లు ఇప్పుడు వచ్చి ఏం పీకుతారు. ఇక్కడ సౌదీ అరేబియా పాకిస్తాన్‌ను నమ్మడం లేదు. ఈ గ్యాప్‌ను ఫిల్ చేయడానికే జయశంకర్ గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు. పాక్ లాగా ఇండియా ఎప్పుడూ వెన్నుపోటు పొడవదు. వి ఆర్ టైం టెస్టెడ్ ఫ్రెండ్స్ అని చెప్పి సున్నీ ఇస్లామిక్ రాజుల భరోసాను గెలుచుకోవడానికి వెళ్లారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page