రాష్ట్రంలో మొదటి ఆరు లైన్ల హైవే మనదే
అత్యధిక ట్రాఫిక్ ఉండటమే కారణం
హైవే వల్ల లబ్ధి పొందిన జిల్లా సిక్కోలేనని పేర్కొన్న సర్వేలు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
స్వర్ణ చతుర్భుజి.. దేశంలో మౌలిక వసతుల్లో భాగమైన సుదూర రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన పేరు అది. భారతీయ జనతా పార్టీ నేతృత్వ ఎన్డీఏ హయాంలో దేశంలో మౌలిక వసతులకు ప్రాధాన్యం ఇచ్చిన కాలమది. దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలో రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన ఎన్డీయే కూటమి మౌలిక వస్తువుల రంగానికి పెద్దపీట వేసింది. ఇందులో భాగంగానే దేశం నలుదిక్కులు కలిసేలా మహా నగరాల మధ్య నాలుగు లైన్ల రహదారుల నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించింది. ఢల్లీి నుంచి చెన్నైకి, చెన్నై నుంచి కోల్‌కతాకి, కోల్‌కతా నుంచి ముంబైకి, ముంబై నుంచి ఢల్లీికి.. ఇలా నాలుగు నగరాలు కలిపితే స్వర్ణ చతుర్భుజి అనే గొప్ప ఆలోచనకి నాటి దార్శనికుడు వాజ్‌పేయి అంకురార్పణ చేశారు.

దేశంలోని నాలుగు మహా నగరాలను కలుపుతూ, 5846 కిలోమీటర్ల పరిధిలో నాలుగు లైన్ల నిర్మాణం ప్రారంభమైంది. మొదటి అడుగు మాత్రం చెన్నై`హౌరా మధ్య రోడ్డుతోనే సాగింది. 1661 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ రెండు లైన్ల మధ్య పూర్తిస్థాయిలో నాలుగు లైన్ల నిర్మాణం పూర్తి కావడానికి దాదాపు ఆరు సంవత్సరాలు పట్టింది. దీంతో అంతవరకు ఎప్పుడూ కనివిని ఎరుగని అద్భుతమైన రహదారి మీద ప్రయాణించే అవకాశం మనందరికీ దక్కింది. ఈ స్వర్ణ చతుర్భుజి వలన వాహనాల వేగం పెరిగింది. దూరం తగ్గకపోయినా ప్రయాణించే సమయం తగ్గింది. ఈరోజు విశాఖపట్నం నుంచి శ్రీకాకుళానికి ప్రతిరోజు విద్యార్థులు, ఉద్యోగులు షటిల్ చేస్తున్నారు అంటే అది హైవేల నిర్మాణం గొప్పతనమే అని చెప్పక తప్పదు. ఒక్క మాటలో చెప్పాలంటే అటల్ కలలకు ప్రతిరూపం. అప్పట్లో ప్రాజెక్టు పూర్తి చేయడానికి రూ.50వేల కోట్లు అవుతాయని అంచనా వేశారు. అంత డబ్బులా..? అని అధికార యంత్రాంగం వెనకడుగు వేసింది. కానీ వాజ్‌పేయి తెగించి ముందడుగు వేశారు. ఫలితంగా భారతదేశ పురోగమనంలో నాలుగు లైన్ల రోడ్ల నిర్మాణం ఒక మేలిమలుపుగా మిగింది. ఆ తర్వాత 2015 నుంచి సిక్స్‌లైన్ నిర్మాణం ప్రారంభమైంది. దీనితో దేశ మౌలిక వసతుల రంగంలో మరో అంకం మొదలైంది. ఈ ప్రాజెక్టు వల్ల ఎక్కువగా లబ్ధి పొందింది మాత్రం శ్రీకాకుళం జిల్లావాసులు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. వరల్డ్ బ్యాంకు నాలుగు లైన్ల రోడ్ల నిర్మాణం మీద ఇచ్చిన ఒక రిపోర్ట్‌లో జాతీయ రహదారుల విస్తరణ వల్ల సిక్కోలుకు జరిగిన మేలుని వివరించింది. సుదీర్ఘమైన జాతీయ రహదారి మనకు వరం. ఇచ్ఛాపురం నుంచి పైడిభీమవరం వరకు ఉన్న జాతీయ రహదారి ప్రాంతమంతా విశేషంగా అభివృద్ధి చెందింది. నాలుగు లైన్ల నిర్మాణం పూర్తయిన రెండు దశాబ్దాలలో శ్రీకాకుళం జిల్లాలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. జాతీయ రహదారి ప్రాంతమంతా వ్యాపార వ్యవహారాలకు వేదికగా మారింది. జాతీయ రహదారికి రెండువైపులా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు వచ్చాయి. పరిశ్రమలు పెరిగాయి. 3 స్టార్ హోటళ్లు వెలిశాయి. కాకా హోటళ్లు ప్రతి అడుక్కి పుట్టుకొచ్చాయి. భూముల విలువ పెరిగింది. ఎకరా లక్ష రూపాయలు కూడా చేయని భూమి ఈరోజు కోట్లు చేస్తుంది. రైతులు బాగుపడ్డారు. వాళ్ల పిల్లలకు మంచి చదువులు చెప్పించగలిగారు. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వెళ్లే దారిలో జాతీయ రహదారిలో సగం ప్రాంతమంతా ఏదో ఒక వ్యాపార వ్యవహారాలతో కళకళలాడుతూ ఉంటోంది. ప్రతి కిలోమీటర్ దూరంలో నాలుగైదు హోటల్స్ ఉంటాయి. విద్యాసంస్థలు ఉన్నాయి. రణస్థలం వరకు జాతీయ రహదారిపై సెంటు రూ.10 లక్షలకు కూడా జాగా దొరకడం లేదంటే అది కేవలం నాలుగు లైన్ల నిర్మాణం పుణ్యమే. రెండు దశాబ్దాల కిందట గుజరాతిపేట దాటిన తర్వాత బైపాస్ రోడ్డు వరకు పెద్దగా వ్యాపారాలు ఉండేవి కాదు. ఇప్పుడు ఆ ప్రాంతమంతా బిజీ రూట్ అయిపోయింది. డే అండ్ నైట్ జంక్షన్ నుంచి సింహద్వారం వరకు ఎదిగిన వ్యాపార సామ్రాజ్యాన్ని చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. పదేళ్ల తర్వాత ఎవరైనా ఈ ఊళ్లో అడుగుపెట్టినట్లయితే ఆ ప్రాంతాన్ని చూసి నోరు తెరుచుకుని ఉండిపోతారు. జాతీయ రహదారిని ఆనుకుని ఉండడం వల్ల శ్రీకాకుళానికి కలిగిన మరో ప్రయోజనం ఇది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అధ్యయనం సంస్థ చైర్మన్ ప్రొఫెసర్ మహేందర్ దేవ్, నాలుగు లైన్ల జాతీయ రహదారి వల్ల శ్రీకాకుళానికి కలిగిన ప్రయోజనాన్ని వివరించారు. అభివృద్ధి అనేది దశదిశలా పాకుతోందని ఆయన ఈ సందర్భంగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. నాలుగు లైన్లు జాతీయ రహదారుల నిర్మాణం వల్ల సిక్కోలుకు జరిగిన ప్రయోజనాన్ని ప్రపంచ బ్యాంక్ ప్రముఖంగా ప్రస్తావించిందని ఆయన వివరించారు. ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. 2019 నుంచి 2024 మధ్యకాలంలో శ్రీకాకుళం నుంచి వైజాగ్ మధ్య ఆన్‌లైన్‌లో పనులు చకచక జరిగాయి. రాష్ట్రంలో ఇప్పటికీ కొన్ని చోట్ల ఆరు లైన్లు పనులు పూర్తికాలేదు.
ట్రాఫిక్కే మన పంట పండించింది
దేశవ్యాప్తంగా స్వర్ణచతుర్భుజి పేరిట జాతీయ రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించినా, విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం మాత్రం ఈమధ్య కాలంలో ఆరు లైన్లయింది. అందుకు కారణం ఈ నిర్దేశిత ప్రాంతంలో రవాణా వాహనాల రద్దీ ఎక్కువ కావడమే. అందుకే రాష్ట్రంలో మహానగరాలున్నా ఆంధ్రప్రదేశ్‌లో ఆరు వరుసల రహదారి విస్తరణను తొలుత నరసన్నపేట`విశాఖపట్నం మధ్యలో ప్రారంభించారు. రాష్ట్రంలో అత్యంత రద్దీగా ఉన్న రూటిది. రోజుకి దాదాపు 10వేల పెద్ద వాహనాలు ఈ దారిలో వెళ్తాయని విస్తరణ సర్వే చేపట్టిన ఓ సంస్థ తన అధ్యయనంలో వెల్లడిరచింది. అందుకే ముందుగా ఈ రహదారి విస్తరణ చేపట్టారు. ఇప్పుడు అనకాపల్లి నుంచి రాజమండ్రి మధ్య ఆన్‌లైన్ విస్తరణ ప్రారంభమైంది. ముందుగా సిక్కోలు ప్రాంతంలో విస్తరణ చేపట్టడం కూడా ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో ఉపయోగపడిందిద.
Comments