top of page

‘ఉపాధి’తోనే అభివృద్ధి

Writer: DV RAMANADV RAMANA

మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ద్వారా ఉపాధి పొందుతున్న వారి శాతం ఈ సంవ త్సరం మొదటి అర్ధ భాగంలో 16.6 శాతం తగ్గింది. గత రెండేళ్లలో ఎనిమిది కోట్ల మంది ‘ఉపాధి హామీ’ నుంచి తొలగించబడ్డారని ఈ చట్టం అమలుపై లిబ్‌ టెక్‌ ఇండియా, ఎన్‌.ఆర్‌.ఇ.జి.ఎ సంఘర్ష్‌ మోర్చా చేసిన సర్వే ప్రకటించింది. దేశాన్ని అగ్రభాగన నడుపుతున్నామని, 2047 నాటికి వికసిత్‌ భారత్‌గా మారుస్తానని దేశ ప్రధాని ఒకవైపు చెబుతుంటే, గ్రామీణ పేదలకు సంవత్సరానికి కనీసం వంద రోజుల పనిని గ్యారంటీగా కల్పించాల్సిన ‘ఉపాధి హామీ’ దినదిన గండం నూరేళ్ల ఆయష్షుగా మారిందని ఈ నివేదక నిర్ధారించింది. 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేసిన సర్వే 14 రాష్ట్రాల్లో గ్రామీణ ఉపాధి క్షీణించినట్లు తెలిపింది. ఈ పథకం కింద గత ఏడాది ఏప్రిల్‌-సెప్టెంబర్‌ మధ్య పని చేసిన చురు కైన కార్మికుల సంఖ్య (యాక్టివ్‌ వర్కర్స్‌) ఈ సంవత్సరం అదే నెలలో 8 శాతం తగ్గింది. ఈ ఒక్క సంవ త్సరమే దేశవ్యాప్తంగా 39 లక్షల మంది ఉపాధి హామీ కార్మికులు పనులు కోల్పోయారు. ఇప్పటికే వ్యవ సాయ సంక్షోభంతో కునారిల్లుతున్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఈ పరిణామంతో మరింత సంక్షోభంలో కూరుకుపోతుంది. పేదలకు పని లేకపోవడం వల్ల వారి కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. ముఖ్యంగా పౌష్టికాహారం పొందలేకపోవడంతో పాటు, విద్య, వైద్యానికి దూరమవుతారు. గ్రామాల్లోని కోట్ల మంది పేదలు దారిద్య్రపు కోరల్లో చిక్కుకుంటారు. పారిశ్రామిక ఉత్పత్తుల అమ్మకాలు మందగించి, పట్టణ పరి శ్రమల్లో ఉత్పత్తి తగ్గుతుంది. అందులో పని చేస్తున్న అనేక మంది ఉపాధి అవకాశాలను కోల్పోయి అప్ప టికే ఉన్న పాత నిరుద్యోగులతో కలుస్తారు. ఈ విష వలయం దేశాన్ని వికసిత్‌ భారత్‌ వైపు ఎలా తీసుకు పోతుంది? దేశంలో కోట్ల మందిగా వున్న గ్రామీణ కూలీలకు ఉపాధి గ్యారంటీ కల్పించడం కోసం స్వాతంత్య్రానంతరం వచ్చిన ఒకే ఒక్క పథకం ఎన్‌.ఆర్‌.ఇ.జి.ఎ. ఈ పథకం అమలు కావడం వల్ల పేదల కడుపులోకి నాలుగు మెతుకులు పోవడంతో పాటు ఆత్మగౌరవంతో బేరసారాల శక్తి పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 742 జిల్లాలు, 7,204 మండలాలు (లేదా బ్లాక్‌లు), 2,69,121 గ్రామ పంచా యతీల్లో ఉపాధి హామీ చట్టం అమలవుతుంది. ఈ సంవత్సరం ఏప్రిల్‌ నాటికి 12 కోట్ల 88 లక్షల మంది రూ.74,274 కోట్లను కూలీ రూపంలో పొందారు. ఇందులో క్రమంగా యంత్రాల వాటా పెరిగింది. మన రాష్ట్రంలో ఉమ్మడి 13 జిల్లాల్లో 661 మండలాలు, 13,285 గ్రామ పంచాయితీలు, 47,115 నివాస ప్రాంతాల్లో ఈ పథకం అమలవుతుంది. 1,03,55,184 మంది కూలీలు ఈ చట్టం ద్వారా పనికి అర్హులు. ఉపాధి పనుల ద్వారా పొందిన వేతనాల్లో ఎక్కువ భాగం పని చేసిన గ్రామాల్లోనే రోజువారి కుటుంబ అవసరాలు, సామాజిక కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తారు. ఆ మేరకు గ్రామాల్లో డబ్బుల చెలా మణి పెరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా కూలీల్లో బేరమాడే శక్తి కొంత పెరిగింది. గ్రామాల్లో కొంత సామాజిక చైతన్యం పెరగడానికి ఇది తోడ్పడిరది. గత పది సంవత్సరాల్లో క్రమంగా నిధులను తగ్గిస్తూ వచ్చింది. 2023 బడ్జెట్‌లో ఈ పథకానికి 33 శాతం నిధులు తగ్గించింది. బడ్జెట్‌లో కేటాయింపులకు ఆచరణలో ఖర్చు చేసే దానికి చాలా వ్యత్యాసం వుంది. డిఎంకె ఎంపీ కనిమొళి నేతృత్వంలోని పార్లమెం టరీ కమిటీ ఉపాధి హామీ చట్టం పని దినాల సంఖ్యను 100 నుంచి 150 రోజులకు పెంచాలని ఈ సంవత్సరం ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ కూలీల కుటుంబాల్లో కేవలం 7.5 శాతం మందికి మాత్రమే వంద రోజుల పని దొరికింది. పని చేసిన తర్వాత నెలల తరబడి బిల్లులు చెల్లించకపోవడం లాంటి అనేక పద్ధతుల ద్వారా ఉపాధి పనికి వెళ్లాలనే ఉత్సాహాన్ని కూలీలలో తగ్గించివేసింది. ఈ సంవత్సరం ఏప్రిల్‌ నాటికి ఉపాధి చట్టం కింద పని చేసిన కూలీలకు రూ. 20,751 కోట్ల బిల్లులు పెండిరగ్‌లో వున్నాయి. రోజూ పని చేస్తే తప్ప పూట గడవని కూలీలకు ఆరేడు నెలలుగా బిల్లులు ఎందుకు బకాయి వుంటున్నాయి? కూలీలకు సకాలంలో డబ్బులు అందకపోతే అనివార్యంగా ఈ పని నుంచి తప్పుకుంటారు. పని దినాలు కల్పించాలనే డిమాండ్‌ చేయ డం తగ్గిపోతుంది. తిరిగి మరలా గ్రామీణ వేతన దోపిడికి గురికావలసి వస్తుంది. రాష్ట్రంలోని నేతలకు, మీడియాకు తిరుపతి లడ్డు మీద, కుటుంబ వ్యక్తిగత ఆస్థుల మీద వున్న శ్రద్ధలో ఒకటో వంతైనా కోట్లమంది వ్యవసాయ కూలీల మీద పెట్టడంలేదు. మా దేశంలో, రాష్ట్రంలో అన్నీ రాయితీలు ఇస్తాం పరిశ్రమలు పెట్టండి మహాప్రభో అని దేశ ప్రధాని నుండి రాష్ట్ర మంత్రుల వరకు దేశదేశాలు తిరుగుతున్నా పరిశ్రమలు ఎందుకు రావడంలేదు? ప్రజల కొనుగోలు శక్తి వుంటే ఎవరూ అడక్కపోయినా పెట్టుబడిదారులు వస్తారు, పరిశ్రమలు పెడతారు. కొనుగోలు శక్తి పెరగాలంటే గ్రామాల్లో ఉపాధి, పట్టణాల్లో ఉద్యోగాలు కల్పించాలి.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page