top of page

ఉపాధిలో స్వావలంబన దిశగా మహిళలు

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Sep 9
  • 2 min read

ree

మహిళల విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. గతంలో ఇంటికే పరిమితమైన మహిళలు ఇటీవలి కాలంలో గడప దాటి బయటకొచ్చి పురుషులకు ధీటుగా దాదాపు అన్ని రంగాల్లోనూ అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. అక్షరాస్యత, ఉపాధి రంగాల్లో ప్రగతి సాధించినప్పుడే మహిళా రంగం వికసిస్తుందన్నది వాస్తవం. ఈ దిశగా ఆశించిన ప్రగతి కనిపిస్తోందని కేంద్ర కార్మిక శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత ఆరేళ్లలో భారతీయ మహిళలు ఉపాధి, వ్యాపార రంగాల్లో గణ నీయ పురోగతి సాధించారు. మహిళా సాధికారత దిశగా దేశం పయనిస్తోందన్న ఆశాభావం వ్యక్త మవుతోంది. ఉద్యోగాల్లో మహిళల వాటా బాగా పెరిగింది. పిరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (పీఎల్‌ ఎఫ్‌ఎస్‌) తాజా లెక్కల ప్రకారం.. 2017-18లో జాబ్‌ చేసే మహిళలు (డబ్ల్యూపీఆర్‌) 22 శాతం ఉండగా 2023-24 నాటికి అది 40.3 శాతానికి పెరిగింది. అదే సమయంలో 2017-18లో 5.6 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు (యూఆర్‌) 2023-24 నాటికి 3.2 శాతానికి తగ్గింది. ఈ మార్పు గ్రామీణ ప్రాంతాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ మహిళల ఉపాధి 96 శాతం మేర పెరగ్గా.. పట్టణాల్లో 43 శాతం వృద్ధి నమోదైంది. ముఖ్యంగా మహిళా పట్టభద్రులు ఆకాశమే హద్దు గా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. 2013లో 42 శాతంగా ఉన్న ఈ వర్గం ఉపాధి శాతం 2024 నాటికి 47.53 శాతానికి పెరిగింది. పీజీ, ఆపై చదువులు చదివిన మహిళల ఉపాధి రేటు 2017-18లో 34.5 శాతం నుంచి 2023-24లో 40 శాతానికి చేరింది. ఇక భారత స్కిల్స్‌ రిపోర్ట్‌`2025 ప్రకారం.. 2024లో పట్టభద్రుల్లో 51.2 శాతం మంది అంతర్జాతీయంగా ఉపాధికి అర్హులు కాగా, ఈ ఏడాది అది 55 శాతానికి పెరిగింది. అసంఘటిత సహా అనేక ఇతర రంగా ల్లోనూ మహిళల భాగస్వామ్యం పెరుగుతున్నట్లు ఈపీఎఫ్‌వో పేరోల్‌ డేటా పేర్కొంది. గత ఏడేళ్లలో 1.56 కోట్లకు పైగా మహిళలు ఉద్యోగాల్లో చేరారు. అదే సమయంలో ఈ శ్రమ్‌ పోర్టల్‌ ద్వారా 2025 ఆగస్టు నాటికి 16.69 కోట్లకు పైగా మహిళా కార్మికులు అసంఘటిత రంగాల్లో నమోద య్యారు. మరోవైపు దేశవ్యాప్తంగా 15 మంత్రిత్వశాఖల పరిధిలోని 70 కేంద్ర పథకాలు, 400కు పైగా రాష్ట్ర పథకాల ద్వారా మహిళలు పెద్దసంఖ్యలో వ్యాపార రంగంలో ప్రవేశిస్తున్నారు. పీఎల్‌ ఎఫ్‌ఎస్‌ డేటా ప్రకారం.. ఆరేళ్లలో స్వయం ఉపాధి పొందుతున్న మహిళల సంఖ్య 30 శాతం పెరి గింది. 2017-18లో 51.9 శాతం ఉండగా 2023-24 నాటికి అది 67.4 శాతానికి చేరుకుంది. ఆత్మనిర్భర్‌ భారత్‌ కార్యక్రమం కూడా మహిళలకు మంచి ఊతమిస్తోంది. గత దశాబ్దంలో జెండర్‌ బడ్జెట్‌ 429 శాతం పెరిగింది. 2013-14లో రూ.0.85 లక్షల కోట్ల నుంచి ఈ ఏడాది 2025-26లో రూ.4.49 లక్షల కోట్లకు చేరింది. స్టార్టప్‌ ఇండియా కార్యక్రమాలతో మహిళలకు అవకా శాలు విరివిగా లభిస్తున్నాయి. 1.54 లక్షలకు పైగా డీపీఐఐటీ నమోదిత స్టార్టప్‌లలో సుమారు 50 శాతం సంస్థల డైరెక్టర్ల బోర్డుల్లో కనీసం ఒక మహిళ అయినా సభ్యులుగా ఉన్నారు. 74,410 స్టార్టప్‌ల ద్వారా పెద్దసంఖ్యలో మహిళలు కోటీశ్వరుల స్థాయి అందుకోగలిగారు. నమో డ్రోన్‌ దిదీ, దీనదయాళ్‌ అంత్యోదయ యోజన, ఎన్‌ఆర్‌ఎల్‌ఎం వంటి పథకాలు మహిళలకు అవసరమైన వన రులు, అవకాశాలను అందిస్తున్నాయి. మహిళల స్వయం ఉపాధిని పెంచడంలో కీలక పాత్ర పోషి స్తున్న మరో స్కీమ్‌ ప్రధాన్‌ మంత్రి ముద్రా యోజన. మొత్తం ముద్రా లోన్లలో 68 శాతం మేరకు మహిళలకు లభించాయి. వీటి మొత్తం విలువ రూ.14.72 లక్షల కోట్లు. పీఎం స్వనిధి పథకంలో సుమారు 44 శాతం లబ్ధిదారులు మహిళలే కావడం విశేషం. ఇక మహిళలు నిర్విహిస్తున్న చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) దేశ ఆర్థిక అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. 2020-21 నుంచి 2022-23 మధ్యకాలంలో 89 లక్షల అదనపు ఉద్యోగాలు మహిళలకు లభిం చాయి. మహిళలు నడుపుతున్న వ్యాపారాలు 2010-11లో 17.4 శాతం ఉండగా, 2023-24 నాటికి వాటి సంఖ్య 26.2 శాతానికి పెరిగింది. తద్వారా మహిళలు నిర్వహిస్తున్న ఎంఎస్‌ఎంఈల సంఖ్య ఒక కోటి నుంచి 1.92 కోట్లకు పెరగడం విశేషం. ఆర్థిక, ఉపాధి రంగాల్లో ఇంత ప్రగతి సాధిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నా.. వాస్తవ పరిస్థితులు దీనికి కొంత భిన్నమైన దృశ్యాన్ని చూపి స్తున్నాయి. గ్రామీణ, చిన్న పట్టణ ప్రాంతాల్లో ఉపాధికి నోచుకోని మహిళలు పెద్దసంఖ్యలోనే కనిపిస్తున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page