top of page

ఎక్కడపడితే అక్కడ చదివేస్తామంటే కుదరదు..!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Apr 28
  • 2 min read
  • డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్‌కూ ఓ పరిధి వుంది

  • పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న సర్టిఫికెట్లు చెల్లవు

  • UGC నిబంధనల మేరకు తేల్చిచెప్పిన తెలంగాణ హైకోర్టు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

ఏదో ఒక కోటాలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం, ఆ తర్వాత పదోన్నతి కోసం పైచదువులు చదివామంటూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో ఓ సర్టిఫికెట్‌ను తీసుకురావడం, ఆ మేరకు ప్రమోషన్ పొందడం ఇక నుంచి చెల్లదు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో డిగ్రీలు, లేదా తత్సంబంధిత కోర్సులు పూర్తిచేశామని సర్టిఫికెట్లు సమర్పిస్తున్నవారు వాటి రాష్ట్రాల పరిధి గుర్తించాలని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్, మరో న్యాయమÖర్తి జి.ఎం. మొహిద్దీన్‌ల బెంచ్ ఈ నెల 4న ఒక తీర్పు వెలువరించింది. తెలంగాణ స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌కు వి.అనిల్‌కుమార్‌తో పాటు ఏడుగురు వేసిన రిట్ అప్పీల్‌ను పరిగణలోకి తీసుకొని 35 పేజీల గైడ్‌లైన్స్‌ను తెలంగాణ హైకోర్టు విడుదల చేసింది. అయితే ఇది కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితమైనది కాదు కనుక ఈ కథనం ప్రచురిస్తున్నాం.

1991లో చేసిన ఓ చట్టం మేరకు రాష్ట్రంలో ఏ యÖనివర్సిటీ పరిధిలోకి ఏయే జిల్లాలు వస్తాయో స్పష్టంగా చెప్పారు. ఆ మేరకు ఆంధ్రా యÖనివర్సిటీ నుంచి శ్రీకాకుళం, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలను తప్పించారు. దాంతో శ్రీకాకుళం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యÖనివర్సిటీలో చేరిందన్నమాట. అలాగే కాకతీయ యÖనివర్సిటీ నుంచి అదిలాబాద్, కరీంనగర్‌ను తప్పించారు. నాగార్జున యÖనివర్సిటీ పరిధి నుంచి కృష్ణా, కర్నూలు జిల్లాలను మినహాయించారు. ఇక తెలంగాణలో ఉస్మానియా నుంచి నల్గొండ జిల్లాను మినహాయించారు. 2008లో మెదక్ జిల్లాను ఉస్మానియా నుంచి తీసేసినా 2011లో మళ్లీ చేర్చారు. శ్రీకృష్ణదేవరాయ యÖనివర్సిటీ పరిధిలో అనంతపురం మాత్రమే ఉంటుంది. ఆచార్య నాగార్జున యÖనివర్సిటీ పరిధిలో గుంటూరు, ప్రకాశం, కాజా, నంబూర్ ప్రాంతాలు ఉంటాయి.

యÖనివర్సిటీల పరిపాలనా సౌలభ్యం కోసం ఈ చట్టం చేయడం వల్ల ఇప్ప్పుడు ఆ పరిధిలో ఉన్నవారు ఆ యÖనివర్సిటీల్లోనే డిస్టెన్స్ మోడ్‌లో చదవాల్సి ఉంటుంది. అలా కాకుండా నాగార్జున యÖనివర్సిటీ తెలంగాణలో పెట్టిన ఆఫ్ క్యాంపస్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా ఏదైనా కోర్సు పూర్తిచేసి, సర్టిఫికెట్ తీసుకుంటే అది ఉద్యోగానికి గాని, ప్రమోషన్లకు గాని చెల్లదని కోర్టు స్పష్టంగా పేర్కొంది. ఇక్కడ నాగార్జున యÖనివర్సిటీ అనేది కేవలం ఉదాహరణకు మాత్రమే చెప్పిన పేరు. యÖనివర్సిటీ పరిధి దాటి ఉన్న ప్రాంతం నుంచి ఎవరు డిస్టెన్స్ మోడ్‌లో సర్టిఫికెట్ పొందినా, అవి చెల్లవని కోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాల్లోనూ అనేకమంది డిస్టెన్స్ మోడ్‌లో సర్టిఫికెట్లు తీసుకొని పదోన్నతులు, ఉద్యోగాలు పొందుతున్నారు. దీనికి ఈ తీర్పు అడ్డుకట్ట వేసినట్టయింది. ఈ యÖనివర్సిటీల పరిధిలు 2004, 2008, 2011లలో అమలులోకి వచ్చాయి.

2010 మే నెల 26న యÖజీసీ విధించిన నిబంధనల మేరకు కేంద్ర ప్రభుత్వం డీమ్డ్ యÖనివర్సిటీలుగా ప్రకటించిన ఏ సంస్థా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సును నిర్వహించడానికి అనుమతించలేదు. అలాగే 2010 మే 26కు ముందు డీమ్డ్ యÖనివర్సిటీలుగా ప్రకటించుకున్న సంస్థలు ఆ తర్వాత ఏ ఆఫ్‌క్యాంపస్ కేంద్రాల నుంచి కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నడపడానికి వీళ్లేదు. వేరే ప్రాంతాల్లో ఎటువంటి స్టడీ సెంటర్లు ఏర్పాటు చేయడానికి కూడా ఏ ఒక్క డీమ్డ్ యÖనివర్సిటీ యÖజీసీ అనుమతి అనుమతి ఇవ్వలేదు. 2013 జూన్ 27న ఇచ్చిన పబ్లిక్ నోటీసు మేరకు ఒక యÖనివర్సిటీ దానికి కేటాయించిన ప్రాదేశిక పరిధిలో మాత్రమే పని చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర సరిహద్దులు దాటి పని చేయకూడదని యÖజీసీ పేర్కొంది. అంటే.. వేర్వేరు రాష్ట్రాల్లో తాము చదివామంటూ తెస్తున్న సర్టిఫికెట్లు చెల్లవని తేలిపోయింది. ఇప్ప్పుడిదే విషయాన్ని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page