top of page

ఎక్కడ చూసినా మీసాల పిల్ల ట్రెండే!!

  • Guest Writer
  • Oct 7
  • 3 min read

ree

ఒక సాంగ్‌ ఎంత హిట్‌ అయ్యింది అన్నది సోషల్‌ మీడియాలో చూస్తే తెలుస్తుంది. లేటెస్ట్‌ గా సోషల్‌ మీడియా అటు ఇన్‌ స్టా, యూట్యూబ్‌ రీల్స్‌ లో కూడా మెగాస్టార్‌ చిరంజీవి మీసాల పిల్ల సాంగ్‌ ట్రెండిరగ్‌ లో ఉంది. మెగాస్టార్‌ చిరంజీవి అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌ లో వస్తున్న మన శంకర వరప్రసాద్‌ సినిమా నుంచి ఫస్ట్‌ సాంగ్‌ గా మీసాల పిల్ల ప్రోమో రిలీజైంది. భీమ్స్‌ మ్యూజిక్‌ అందిస్తున్న ఈ సినిమాలోని ఫస్ట్‌ సాంగ్‌ ప్రోమోతోనే బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్నారు.

మన శంకర వరప్రసాద్‌ సినిమాలో మీసాల పిల్ల సాంగ్‌.. ఏ సినిమా అయినా పూర్తి సాంగ్‌ రిలీజ్‌ అయ్యాక సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. కానీ మన శంకర వరప్రసాద్‌ సినిమాలో మీసాల పిల్ల సాంగ్‌ ప్రోమోతోనే సెన్సేషనల్‌ అనిపించారు. ఎందుకంటే ఈ సాంగ్‌ ప్రోమో ఇన్‌ స్టా రీల్స్‌ తో మరింత క్రేజ్‌ తెచ్చుకుంది. ఏదైనా సినిమాలో సాంగ్‌ నచ్చితే వెంటనే సాంగ్‌ ని రీల్స్‌ చేస్తారు నెటిజెన్లు. షైన్‌ స్క్రీన్‌ బ్యానర్‌ లో సాహు గారపాటి నిర్మిస్తున్న మన శంకర వర ప్రసాద్‌ సినిమాలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌ గా నటిస్తుంది. అనిల్‌ రావిపూడి చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు భీమ్స్‌ మ్యూజిక్‌ సూపర్‌ హిట్‌ అవ్వడంతో మళ్లీ చిరు సినిమాకు కూడా అతన్నే రిపీట్‌ చేస్తున్నారు. మన శంకర వరప్రసాద్‌ సినిమాలోని ఫస్ట్‌ సాంగ్‌ గా మీసాల పిల్ల మెలోడియస్‌ ప్రోమో వచ్చింది. ఐతే ఈ సాంగ్‌ కి మెగా ఫ్యాన్స్‌ నుంచే కాదు కామన్‌ ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

చిరంజీవి తో మొదటిసారి.. ఒక సినిమా తీయడం అందరు చేస్తారు కానీ దాన్ని ఎలా ప్రమోట్‌ చేయాలన్నది అనిల్‌ రావిపూడి దగ్గర నేర్చుకోవాలి అనేలా ఆయన ప్రమోషనల్‌ యాక్టివిటీస్‌ ఉంటాయి. చిరంజీవి తో మొదటిసారి కలిసి సినిమా చేస్తున్న అనిల్‌ మెగాస్టార్‌ వింటేజ్‌ వైబ్‌ ని ఈ సినిమాతో చూపిస్తాడని అంటున్నారు. ఇక భీమ్స్‌ కూడా తన మార్క్‌ మ్యూజిక్‌ తో మెగాస్టార్‌ ని ఇంప్రెస్‌ చేయాలని ఫిక్స్‌ అయ్యాడు. చిరంజీవి, అనిల్‌, భీమ్స్‌ ఈ కాంబో కలిసింది మొదటిసారే అయినా ఫ్యాన్స్‌ కి అదిరిపోయే ట్రీట్‌ ఇవ్వాలని చూస్తున్నారు. మీసాల పిల్ల సాంగ్‌ ప్రోమో చిరంజీవి గ్రేస్‌ అదిరిపోయింది. 70 ఏళ్ల వయసులో కూడా చిరు ఈ రేంజ్‌ లో డాన్స్‌ చేయడం చూసి ఫ్యాన్స్‌ సూపర్‌ అనేస్తున్నారు. మన శంకర వరప్రసాద్‌ సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్‌ ఫిక్స్‌ చేశారు. ఈ సినిమాకు పోటీగా సంక్రాంతి బరిలో భారీ సినిమాలే వస్తున్నాయి. ఐతే ఏ సినిమాకు ఆ సినిమా ప్రత్యేకంగా వస్తున్నాయి.

- తుపాకి.కామ్‌ సౌజన్యంతో...

కన్నడ సీమని ఏలుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌
ree

ఆర్‌ఆర్‌ఆర్‌ అంటే రాజమౌళి తీసిన గురించి కాదు.. ఇది కన్నడ త్రయం గురించి. కన్నడ సినిమా రంగంలోని రిషబ్‌ శెట్టి, రక్షిత్‌ శెట్టి, రాజ్‌ బి. శెట్టి.. ఈ ముగ్గురు శెట్టి త్రయం చూట్టే ఇప్పుడు కన్నడ సినిమా తిరుగుతోంది. వీరి కలయికలో రూపొందిన ‘గరుడ గమన వృషభ వాహన’ (రక్షిత్‌ సమర్పణలో, రాజ్‌, రిషబ్‌ నటనలో), ‘కాంతార’ (ఇందులో రాజ్‌ సంభాషణలు రాసి ఒక సన్నివేశాన్ని కొరియోగ్రాఫ్‌ చేశారు) వంటి సినిమాలు పెద్ద విజయాలు సాధించాయి. ఈ ముగ్గురుది విలక్షణమైన దారి. ముగ్గురిలో ఉండే కామన్‌ క్యాలిటీ కల్చర్‌ కి పెద్ద పీట వేయడం. వీరు ఎంచుకునే కథలు కన్నడ రూట్స్‌కి దగ్గర ఉంటూనే పాన్‌ ఇండియాని ఆకర్షిస్తున్నాయి.

రిషబ్‌ శెట్టి కన్నడ చిత్ర పరిశ్రమలో దర్శకుడు, నటుడు, నిర్మాతగా నిలబడ్డారు. ‘‘కాంతార’’తో విప్లవాత్మక విజయాన్ని సాధించాడు. ఆయన సినిమాలు కేవలం వినోదమే కాక, సాంస్కృతిక చిహ్నాలు కనిపిస్తాయి. రక్షిత్‌ శెట్టి నటుడు, దర్శకుడు, నిర్మాత. 777 చార్లీ, సప్త సాగరాలు దాటి వంటి చిత్రాలు ఆయన ప్రతిభకు అద్దం పట్టాయి. ఇంటర్‌టైన్‌మెంట్‌, ఆర్ట్‌ మిక్స్‌ చేయడం ఆయన స్టైల్‌. రాజ్‌ బి. శెట్టి నటుడు, దర్శకుడు, రచయిత, కొరియోగ్రాఫర్‌. కన్నడ సాంస్కృతిక నేపథ్యాలతో సినిమాలు చేయడం ఆయన స్టైల్‌. ఇటీవల సు ఫ్రమ్‌ సో సినిమాతో మంచి హిట్టు కొట్టారు. ఈ త్రయం ఇప్పుడు కన్నడ చిత్ర సీమకు కొత్త ఊపిరిని అందిస్తోంది.

- తెలుగు 360.కామ్‌ సౌజన్యంతో...

శర్మా గాళ్‌ అందాల విందు
ree

ఐషా శర్మ నిరంతర ఫోటోషూట్లు సోషల్‌ మీడియాల్లో వైరల్‌గా దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. నేహా శర్మ- ఐషా శర్మ దశాబ్ధ కాలంగా కెరీర్‌ కోసం ఎంతగా ప్రయత్నిస్తున్నా అది అందని ద్రాక్షే అయింది. కానీ ఫోటోషూట్లతో నిరంతరం అభిమానులకు టచ్‌లో ఉన్నారు. శర్మా గాళ్‌ ఈసారి కూడా స్పెషల్‌ అవతార్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఐషా ఆల్మోస్ట్‌ టాప్‌లెస్‌ ఫ్రాకులో గుబులు పుట్టించిందని చెప్పాలి. ఇది ఇటీవలి కాలంలో నెవ్వర్‌ బిఫోర్‌ లుక్‌. అందుకే ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారుతోంది. అయితే రెగ్యులర్‌ ఫోటోషూట్లపై దృష్టి సారిస్తున్న ఈ బ్యూటీ కెరీర్‌ కోసం ఏం చేస్తోందో అర్థం కాని గందరగోళం కనిపిస్తోంది.

వేడి అనేది సమస్య కాదు.. దానిని తిరస్కరించడం కూడా అంతే. ఒకసారి మీరు దానిని సొంతం చేసుకున్న తర్వాత, అది మిమ్మల్ని ఇకపై బంధించదు. మీ ఉనికి తాలూకా మరో లేయర్‌గా మారుతుంది.. అనే అందమైన క్యాప్షన్‌ని ఇచ్చింది ఈ భామ. ఐషా శర్మ ధరించిన షోల్డర్‌ లెస్‌ ఫ్రాక్‌ ఇప్పుడు ఇంటర్నె ట్‌ లో గుబులు రేపుతోంది. కెరీర్‌ మ్యాటర్‌కి వస్తే.. .శర్మాగాళ్‌ ఎంతగా ప్రయత్నిస్తున్నా ఇటీవ బెటర్‌ మెంట్‌ కనిపించడం లేదు. కానీ సోషల్‌ మీడియాల్లో నిరంతరం అభిమానుల కోసం స్పెషల్‌ ట్రీట్‌ ని ప్లాన్‌ చేస్తూనే ఉంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page