top of page

ఎన్టీఆర్‌ పేరెత్తడానికి భయమేసిందా?

Writer: DV RAMANADV RAMANA

అనంత శ్రీరామ్‌కి కోపం వచ్చింది. భారత, రామాయణ ఇతిహాసాల ఆధారంగా తీసిన సినిమాల్లో వక్రీకరణకు పాల్పడటం, రాముడు తన కొడుకులైన లవకుశులతో యుద్ధం చేసినట్టు చూపడం, కర్ణుడి పాత్రను అతి ఉత్కృష్టంగా చిత్రీకరించడం, మిగిలిన పాత్రలను చిన్నబుచ్చటం వగైరాలు సినిమా పరంగా జరిగాయని, సినిమా వాళ్ల అందరి తరఫున ఈయన బాధ్యత వహించేసి నిన్న జరిగిన హైందవ శంఖా రావంలో వచ్చిన వాళ్లందరికీ ఏక మొత్తంగా క్షమాపణలు చెప్పేశాడు. పనిలో పనిగా అతను ఎవరో సంగీత దర్శకుడు ఈయన రాసిన ఒక పదాన్ని తొలగించమని కోరితే ఇక జీవితంలో నీకెప్పుడూ పాట రాయనని భీష్మ ప్రతిజ్ఞ చేశాను అంటూ చెప్పుకొచ్చాడు. అదే సభలో మన సత్యవాణి గారు కూడా ఉన్నా రట. ఆమెను అందరూ కలియుగ ద్రౌపది అంటూ కీర్తించారని కురుసభలో ద్రౌపదిని వివస్త్రను చేయ మంటూ ఫీుంకరించిన కర్ణుడిని ఉదాత్తంగా ఎలా వర్ణిస్తారంటూ ఒక ప్రశ్న కూడా సంధించాడు. ఏదేమైనా కథా వక్రీకరణకు పాల్పడి కర్ణుడి పాత్రను హెచ్చించి మిగిలిన పాత్రలను చిన్నబుచ్చడాన్ని చాలా ఆవేశంగా ఖండిరచాడు. వచ్చిన సభికులందరికీ జరుగుతున్న ఘోరాల పట్ల నిమ్మకు నీరెత్తినట్టు మిన్న కుండిపోవటమా లేక తిరగబడి ఎదిరించడమా అనేది తేల్చుకోవాలంటూ ఒక పరీక్ష పెట్టాడు. కల్కి సినిమాలో ప్రభాస్‌ పాత్ర గురించి కూడా అతను వేలెత్తి చూపాడు. అంతా బాగుంది. అనంత శ్రీరామ్‌ ఆవేదనను నిష్పక్షపాతంగా చూస్తే ఇంత ఆవేదన పడినవాడు అలాంటి వక్రీకరణలకు మూలపురుషుడు ఎన్టీ రామారావును కనీసం పేరు ఎత్తలేకపోయాడు ఏంటి అని అనిపిస్తుంది ఎవరికైనా. దానవీరశూరకర్ణ సినిమాలో పాండవపత్ని, పాతివ్రత్యానికి ప్రతీకగా చెప్పబడే ద్రౌపది తనకు ఐదుగురు ఉన్నప్పటికీ కూడా కర్ణుడితో కూడా కలిసి ఉండాలనుందనే కోరికను ఎన్టీఆర్‌ ధరించిన మరొక పాత్ర కృష్ణుడితో చెప్పుకోవ డం, కర్ణుడి చేత చిక్కిన భీముణ్ణి (ఆ పాత్ర అమాయకుడు సత్యనారాయణ వేస్తాడు) తిండిపోతా నీకెందు కురా యుద్ధం అంటూ దారుణంగా అవమానించడం, ఎన్టీఆర్‌ నటించిన మరొక సినిమా శ్రీమద్విరాట్ప ర్వంలో ఆయన ధరించిన కీచకుడు పాత్రను ద్రౌపది మోహించటం, వాళ్లిద్దరూ డ్యూయెట్‌ పాడుకోవడం, ద్వంద్వయుద్ధంలో కీచకుడు భీముణ్ణి చితక్కొట్టేయటం, ఇవేవీ పాపం శ్రీరామ్‌కి కనిపించలేదనేది మనం దరికీ కలిగే అనుమానం. పై సినిమాలే కాకుండా ఎన్టీరామారావు రావణుడు పాత్ర వేసినప్పుడు రావణుడే రాముడు కంటే సర్వోత్తముడని చిత్రీకరించడం కూడా కద్దు. మరి అన్ని వక్రీకరణలకు పాల్పడి ఇతిహాసా లను కేవలం తన దరహాసానికి అనుకూలంగా మార్చేసుకున్న ఎన్టీ రామారావు పేరు ఎత్తడానికి భయం వేసిందా? అలాంటప్పుడు నీకు అక్కడ అంత ఆవేశం దేనికి? సెలెక్టివ్‌గా నీకు నచ్చినవాళ్లని ఎంచుకోవ టం, నువ్వు కావాలనుకున్న విషం చిమ్మేయడం అంతేనా హిందుత్వం అంటే? అదెక్కడి ఆవేశమయ్య శ్రీరామయ్య? కర్ణుడి ఔన్నత్యం.. ద్రోణుడు తగ్గించలేదు.. పరశురాముడు తగ్గించలేదు.. కృష్ణుడు తగ్గించ లేదు.. వ్యాసుడు తగ్గించలేదు.. హిందూ సమాజం తగ్గించలేదు.. ఒక్క సెల్ఫ్‌ పిటీ తప్పు అన్నారు. అధర్మం వైపు నిలపడొద్దు అన్నారు.. వివక్షలో కూడా ఎలా ఎదగొచ్చో చెప్పారు. కర్ణుడు ద్రౌపది విషయంలో మాట్లాడిన దుర్మార్గం.. ద్రౌపది, భీముడు తన కులం విషయంలో తక్కువ చేసి మాట్లాడిన దుర్మార్గంతో సమానమే కదా. అనంత శ్రీరామ్‌, భారత రామాయణాల్లో మంచి చెడు రెండూ చెప్పారు.. నిజంగా సినిమాల పైత్యాల గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయ్‌. అర్జెంటుగా కర్ణుడి వ్యక్తిత్వ హననం చేయాల్సిన పని లేదు.. నీ తాపత్రయం మంచిదే, కానీ తీసుకున్న టాపిక్‌ సరైనది కాదు. కల్కి సినిమా రిలీజైనప్పుడు కర్ణుడు ధూర్తుడా..? గొప్పవాడా..? అర్జునుడికన్నా గొప్పవాడా? వంటి చర్చలు జోరుగా జరిగాయి. మళ్లీ ఇప్పుడు సినీగేయ రచయిత ఆ చర్చను పునఃప్రారంభించాడు నిన్నటి హైందవ శంఖారావం సభలో కొన్ని వ్యాఖ్యలతో. మళ్లీ ఇప్పుడు ఆ చర్చతో ఆ శంఖారావం సభ ఎజెండా ఎక్కడికో పోయింది. అనవసర చర్చ. ఎందుకంటే..? ఏ పురాణం తీసుకున్నా సరే, ఒక పాత్ర కోణంలో చూస్తే ఒకరకంగా ఉండొచ్చు, మరో పాత్ర కోణంలో చూస్తే మరోరకంగా ఉండొచ్చు. కర్ణుడు చాలా అంశాల్లో దుర్యోధనుడితో కలిసి నింది తుడు, ధూర్తుడు కావచ్చుగాక.. కానీ నిజానికి ఆ భారతంలో అందరికన్నా ఎక్కువ బాధితుడు. కుల వివక్షను అనుభవించినవాడు. కానీ వితరణశీలి, నమ్మిన స్నేహధర్మం కోసం నిలబడ్డాడు, నష్టపోయాడు తప్ప శిబిరం మార్చలేదు, వ్యక్తిగా దిగజారలేదు. రావణుడికి, కర్ణుడికి కూడా గుళ్లున్నాయి ఈ దేశంలో. పూజించేవాళ్లున్నారు. వాళ్లందరూ ధర్మద్రోహులేనా..? హైందవులు కారా..?

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page