top of page

ఎన్నికల ప్రక్రియే ఓడింది!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Jun 15
  • 2 min read

రాజ్యాంగ వ్యవస్థలు దేనికవే స్వతంత్రంగా వ్యవహరిస్తుంటాయి. ఇవి తమ విధుల్లో పరస్పరం జోక్యం చేసుకోకుండా నియంత్రించేందుకే రాజ్యాంగ నిర్మాతలు న్యాయ, శాసన, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ లతో పాటు ఎన్నికల సంఘం వంటి వాటికి పూర్తి స్వతంత్రత కల్పించింది. అయితే వ్యవస్థల మధ్య సంఘర్షణ, ప్రజాహక్కులకు భంగం కలిగే పరిస్థితులు వంటి అరుదైన సందర్భాల్లో రాజ్యాంగ వ్యవస్థలు తీసుకునే నిర్ణయాలపై న్యాయ, రాజ్యాంగ సమీక్ష నిర్వహించే అవకాశాన్ని రాజ్యాంగం కల్పించింది. దీనికి కట్టుబడిని సుప్రీంకోర్టు సహా ఇతర న్యాయవ్యవస్థలు ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న సమయంలో తలెత్తే వివాదాల్లో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తున్నాయి. దీనివల్ల కొన్ని సందర్భాల్లో కొందరు అభ్యర్థులు, పార్టీలు బాధితులుగా మారిపోతుండటం దురదృష్టకరం. దీనికి తాజా ఉదాహరణే తాజా రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో పోటీ చేసిన మీనాక్షి నటరాజన్ గెలిచే అవకాశం ఉన్నా అనూహ్యంగా అనర్హత వేటుకు గురికావడం. ఫలితంగా తగిన మెజారిటీ లేకపోయినా కూడా బీజేపీ ఒక అదనపు సీటు ఎగరేసుకుపోయింది. రాజ్యాంగ వ్యవస్థల మధ్య రాజ్యాంగం నిర్మాతలు గీసిన సన్నని లక్ష్మణరేఖ అధికారపక్షాలకు అనుకూలంగా మారుతున్నది. 2024 ఎన్నికల్లో లోక్‌సభలో అత్తెసరు సీట్లు గెలిచిన బీజేపీ ఎన్డీయే కూటమి మెజారిటీ ఆధారంగా అధికారాన్ని కాపాడుకోగా.. రాజ్యసభలో ఆ పార్టీకి అసలు మెజారిటీయే లేదు. దాంతో రెండు చట్టసభల్లోనూ సంఖ్యాబలం పెంచుకునేందుకు ‘చీల్చు`చేర్చుకో’ అనే సూత్రాన్ని అమలు చేస్తున్నది. ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమÖల్ కాంగ్రెస్‌కు చెందిన లోక్‌సభ పక్షాలను చీల్చి తనకు అనుకూలంగా మలచుకుంది. 20 మంది తృణమÖల్ లోక్‌సభ సభ్యులు తాజాగా స్పీకర్‌ను కలిసి తాము నేషనల్ సిటిజన్స్ పార్టీలో చేరుతున్నామని, తమ పార్టీని ఎన్డీయేకు అనుబంధంగా గుర్తించాలని వారు లిఖితపూర్వకంగా కోరడం విశేషం. మరోవైపు 245 స్థానాలున్న రాజ్యసభలో ఇప్పటికీ ఎన్డీయే కూటమికి మÖడింట రెండొంతుల మెజారిటీ లేదు. దానికి మరో 15 సీట్లు కావాలి. సాధించాలి. ప్రజాస్వామ్యబద్ధంగా తన బలాన్ని పెంచుకోవాల్సిందిపోయి అక్రమ మార్గాలను అనుసరిస్తుందన్న ఆరోపణలున్నాయి. అందుకు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలే నిదర్శనం. ఇటీవల ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల నిర్వహణలో భాగంగా మధ్యప్రదేశ్‌లో మÖడు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 230 సీట్లున్న ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వపక్షమైన బీజేపీ బలం 165. ఎన్నికలు జరిగే మÖడు రాజ్యసభ స్థానాలను గెలుచుకునేందుకు ఈ సంఖ్యాబలం సరిపోదు. మరో పదిమంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అయినా బీజేపీ ముగ్గురు అభ్యర్థులను బరిలో నిలిపింది. పోనీ ఇతరులెవరైనా మద్దతు ఇస్తారనుకుంటే.. అసెంబ్లీలో భారత్ ఆదివాసీ పార్టీకి చెందిన ఒక సభ్యుడు తప్ప ఇండిపెండెంట్లు లేరు. ఇతర పార్టీల సభ్యులూ లేరు. 64 మంది సభ్యులున్న ఇండియా కూటమి సభ్యుల్లో పదిమంది క్రాస్ ఓటింగుకు పాల్పడితే తప్ప బీజేపీ మÖడో అభ్యర్థి గట్టెక్కడం కష్టం. అది తెలిసి కూడా బీజేపీ అభ్యర్థిని రంగంలోకి దింపి ఎమ్మెల్యేల బహిరంగ కొనుగోళ్లకు ద్వారాలు తెరవడమే కాకుండా కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి ఎన్నిక కాకుండా అడ్డుకునేందుకు సామదానభేద దండోపాయాలను ప్రయోగించింది. బీజేపీ బేరసారాల నుంచి తప్పించుకునేందుకు తమ ఎమ్మెల్యేలను బెంగళూరు తరలించడానికి కాంగ్రెస్ ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక విమానం బయలుదేరడానికి అనూహ్యంగా విమానాశ్రయ అధికారుల నుంచి అనుమతి లభించలేదు. గంటలకొద్దీ ఆలస్యం జరిగింది. ఈలోగానే మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. న్యాయం కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ తలుపు తట్టినా, సుప్రీంకోర్టును ఆశ్రయించినా నిరాశే మిగిలింది. పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదు కేసు వివరాలు వెల్లడించకపోవడం, అసంపూర్ణమైన ఫామ్ 26 అఫిడవిట్ దాఖలు చేశారంటూ రిటర్నింగ్ ఆఫీసర్ ఆమె నామినేషన్‌ను తిరస్కరించారు. అఫిడవిట్‌తో సంబంధంలేని నోటీసుల అంశాన్ని తెరపైకి తెచ్చి బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేయడం, రిటర్నింగ్ ఆఫీసర్ నామినేషన్ తిరస్కరించడం వెనువెంటనే జరిగిపోయాయి. నామినేషన్ల ప్రక్రియలో రిటర్నింగ్ అధికారికి సందేహాలు తలెత్తితే మొదట రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు, ఆ తర్వాత కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నివేదించాల్సి ఉంటుంది. ఆ దిశగా ఎన్నికల అధికారులు ప్రయత్నించారో లేదో గానీ.. కాంగ్రెస్ అగ్రనేతలే కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. చివరికి సుప్రీంకోర్టు కూడా ఒక ఎన్నిక ప్రక్రియ ప్రారంభించాక అందులో జోక్యం చేసుకోవడానికి నిరాకరించే సంప్రదాయాన్నే కొనసాగించింది. అయితే ఇక్కడ మీనాక్షి నటరాజన్ తన నామినేషన్‌ను ఆమోదించమని అభ్యర్థించారే తప్ప.. ఎన్నికను నిలిపివేయమని కోరలేదన్నది గమనార్హం. ఎన్నిక ప్రక్రియ కొనసాగింపులో భాగంగానే వివాదం న్యాయస్థానం ముందుకు జోక్యం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆ మేరకు మీనాక్షి నటరాజన్ కేసు విచారణకు నోచుకుంటే బాగుండేది. కాగా సుప్రీంకోర్టు కేసు చేపట్టడానికి ఒకరోజు ముందే ఎన్నికల కమిషన్ ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించి ప్రక్రియ ముగించేసింది. సాంకేతిక, చట్టపరమైన అంశాలు ఎలా ఉన్నా.. తగిన బలం లేకుండానే రాజ్యసభ ఎన్నికల్లో మూడో అభ్యర్థిని నిలపడంలో గల ఔచిత్యంపై బీజేపీ స్పందించలేదు. మొత్తానికి బలం లేకుండానే ఒక రాజ్యసభ సీటును చేజిక్కించుకుంది. ఏ కేసు వివరాలను అఫిడవిట్‌లో వెల్లడించలేదని ఆరోపిస్తూ మీనాక్షి నామినేషన్‌ను తిరస్కరించాలని బీజేపీ చేసిన డిమాండ్ మేరకు రిటర్నింగ్ అధికారి నిర్ణయం తీసుకోకున్నారో. తిరస్కరణకు గురైన రెండో రోజే ఆకేసు పిటిషన్‌ను నాంపల్లి కోర్టు వెనక్కి పంపడం కొసమెరుపు. ఏదైతేనేం మీనాక్షి నటరాజన్‌కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

1 Comment


Madina Sylani khajasha
Madina Sylani khajasha
Jun 15

that's how bjp killing every other ethical processes of India which are untouched most of the times. andhbhakthuku vunnatha varaku vallanu yevaru yemi peekaleru

Like

Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page