top of page

ఎన్నికల మేనేజ్‌మెంట్‌లో మరో పాఠం

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Feb 11
  • 2 min read

ఢల్లీి ఎన్నికల్లో బీజేపీకి మొత్తంగా పోలైన ఓట్లు 43,23,110 కాగా, ఆమ్‌ ఆద్మీ పార్టీకి పోలైన ఓట్లు 41,33,898. అంటే రెండు పార్టీల మధ్య ఉన్న తేడా 1,89,212 ఓట్లు. ఈ ఏడు నెలల్లో కొత్తగా చేరిన ఓట్లు నాలుగు లక్షలు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో కొత్త ఓటర్ల సంఖ్య నమోదు కాలేదు. ఈ నాలుగు లక్షల ఓట్లు ఎవరివి? ఎలా చేరాయి? ఈ ఎన్నికల్లో ఎవరికి పోలయ్యాయి? అన్న ఆసక్తికరమైన ప్రశ్నలు ఆమ్‌ ఆద్మీ రాజకీయ పలుకుబడిని, నిర్మాణాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. 2014 నుంచి పోలింగ్‌ మేనేజ్మెంట్‌లో బీజేపీ అనుసరిస్తున్న వ్యూహం తెలిసిందే. ఏ ఎన్నికలకు ఆ ఎన్నికలనే యుద్ధంగా చూస్తోంది. ఒక ఎన్నికల్లో గెలిచాము, కేంద్రంలో అధికారంలో ఉన్నాం కదా అన్న ఏమరుపాటు ఆ పార్టీలో లేనేలేదు. పంచాయతీ ఎన్నికలు మొదలు పార్లమెంట్‌ ఎన్నికల వరకూ బీజేపీ ఎన్నికల యంత్రం పని చేసే వేగానికి దేశంలో ఏ పార్టీ తట్టుకుని ఎదురు నిలిచే పరిస్థితి లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే, బీజేపీ ఎన్నికల యంత్రాంగం కేవలం ఎన్నికల సమయంలో ప్రచారాన్ని, ఎన్నికల రోజున పోలింగ్‌ బూత్‌ను మేనేజ్‌ చేయటానికి పరిమితం కావటం లేదు అనేది తరచుగా మనం గుర్తించని వాస్తవం. ఓటర్ల జాబితా ను కూడా పర్యవేక్షిస్తోందని ఢల్లీి ఎన్నికల అనుభవం, గత ఏడాది చివరలో జరిగిన మహారాష్ట్ర ఎన్నికల అనుభవం తెలియచేస్తోంది. ఇంకా గమ్మత్తైన విషయం ఎన్నికల సంఘం సమాధానాలు చెప్పాల్సిన విష యం ఏమిటంటే మహారాష్ట్రలో మొత్తం వయోజన జనాభా కంటే ఓట్ల సంఖ్య ఎక్కువగా ఎందుకు ఉంది అన్న ప్రశ్న. కొన్ని నియోజకవర్గాల ఉదాహరణలు పరిశీలిస్తే ఈ కొత్త ఓటర్ల బెడద తీవ్రంగానే కాదు. అత్యంత చాకచక్యంగానూ, వ్యూహాత్మకంగానూ ఉన్నదని అర్థమవుతుంది. కేజ్రీవాల్‌ పోటీ చేసిన న్యూఢల్లీి నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 39,757 తగ్గింది. అంటే 2020లో ఓటు చేసిన వారిలో నాలుగో వంతు ఈసారి ఈ నియోజకవర్గంలో ఓటు వేయటానికి అనర్హులుగా మారారు. ముండక నియోజకవర్గంలో 2020 నుంచి 2024 మధ్య కేవలం 14,230 మంది కొత్త ఓటర్లు నమోదయితే, 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత 2025 జనవరి నాటికి అదనంగా 17,549 మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు. బాద్లీ నియోజకవర్గంలో నాలుగేళ్లలో కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్ల సంఖ్య 5684. కానీ లోక్‌సభ ఎన్నిక లకు, అసెంబ్లీ ఎన్నికలకూ ఉన్న మధ్యకాలంలో ఎకాఎకిన 13,145 మంది కొత్త ఓటర్లు నమోదు చేసుకు న్నారు. అదే సమయంలో నంగలోయి నియోజకవర్గంలో 2020`24 మధ్య కాలంలో 13,992 ఓట్లు రద్దయ్యాయి. కానీ 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత కొత్తగా 16,413 మంది ఓటర్ల జాబితాలోకి ఎక్కారు. బురారీ నియోజకవర్గంలో ఏకంగా 65,290 మంది కొత్త ఓటర్లు నమోదయితే, వికాసపురి నియోజకవర్గంలో 61,745 మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు. మరికొన్ని వివరాలు సేకరించి ఈ కథనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆమ్‌ ఆద్మీ పార్టీ 2020 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి, ఈసారి ఓడిపోయిన నియోజకవర్గాల్లోనే ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు, తొలగింపులు, చేరికలు పెద్ద మోతాదులో జరిగా యన్న విషయం రూఢీ అవుతుంది. నిజంగానే ఈ ఏడు నెలల కాలంలో అన్ని రాష్ట్రాల్లో ఇదే మోతాదులో అంటే మొత్తం ఓటర్లలో ఐదు శాతం మంది కొత్త ఓటర్లు నమోదయితే ఢల్లీిలో జరిగిన కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం కూడా సజావుగానే జరిగిందని భావించాలి. కానీ వ్యాసం ప్రారంభంలో చెప్పినట్లుగా కనీసం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో కొత్త ఓటర్ల నమోదు ఈ స్థాయిలో లేదు. ఇది మొత్తం ఎన్నికల క్రమాన్ని, ఎన్నికల సంఘం పాత్రను, పారదర్శకతనూ ప్రశ్నార్ధకం చేయటమే కాక అధికారంలో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ తన కళ్ల ముందే ఈ స్థాయిలో ఓటర్ల జాబితా తారుమారవుతుంటే ఏమి చేస్తోందన్నది దేశం సమాధానం తెలుసుకోవాలనుకుంటున్న మరో ప్రశ్న. ఇక్కడ చర్చించుకోవాల్సిన విషయం ఒకటుంది. 2020 నుంచి ఢల్లీి రాష్ట్రం పరిధిలో 4 లక్షల మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు. తెలంగాణలో కూడా గత ఐదేళ్లలో 2025 జనవరి నాటికి 5 లక్షల మంది మాత్రమే కొత్తగా చేరారు. ఈ కాలంలో ఆంధ్ర ప్రదేశ్‌లో సుమారు 6 లక్షల మంది కొత్తగా ఓటుహక్కు పొందారు. పోలిక ఇక్కడితో సరిపోతే బాగానే ఉంటుంది. కానీ లోక్‌సభ ఎన్నికలకు, మొన్న ముగిసిన ఢల్లీి అసెంబ్లీ ఎన్నికలకు మధ్య అంటే కేవలం 7 నెలల్లో మరో 4 లక్షల మంది కొత్తగా ఓటుహక్కు పొందారు. అంటే సాధారణ పరిస్థితికి భిన్నంగా ఢల్లీిలో ఈ ఐదేళ్లల్లో ఎనిమిది లక్షలమంది కొత్తగా ఓటుహక్కు పొందారు. ఇది అంతుచిక్కని ప్రశ్న. విశ్లేషణకు అందని ప్రశ్న. 4 లక్షల మంది ఢల్లీి యువత కేవలం ఆరు నెలల్లో ఓటు హక్కు పొందే వయోజనుల య్యారా? అలా ఎలా జరిగింది? అంటే సరిగ్గా 4 లక్షల మంది 18 ఏళ్ల క్రితం ఒకే తేదీన పుట్టారా? ఒక వేళ నిజంగా అలా పుట్టినా వారంతా ఎటువంటి ఈతిబాధలకు లోనుకాకుండా బాలారిష్టాలను కరోనా కష్టాలను తట్టుకుని బీజేపీకి ఓటు వేయటానికి తెర మీద అందని ప్రశ్న.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page