
(సత్యంన్యూస్, శ్రీకాకుళం అర్బన్)
పాలకుడు పాలన పట్ల ఎంత నిబద్ధతతో ఉన్నాడన్నదే లెక్కగాని, ఎన్నిసార్లు బటన్ నొక్కాం, ఎన్ని కోట్లు పంచామ న్నది పట్టించుకోమని మొన్నటి ఎన్నికల్లో ప్రజలు నిరూపిం చారు. తన నియోజకవర్గంలో జరుగుతున్న ప్రతీ చిన్న విషయం పట్టించుకుంటారని ఈసారి గొండు శంకర్‌ను గెలిపించుకున్నారు. ఆయన కూడా ఇప్పటి వరకు ప్రజల ఆకాంక్షలకు దూరంగా జరగలేదు. నగర కార్పొరేషన్ పరిధిలో ఉన్న అన్ని మురికి కాలువల్లోను సిల్ట్ తీయిస్తు న్నారు. ఇది గతంలో ఎన్నడూ జరగనంత పెద్ద స్థాయిలో జరుగుతుంది. కాలువల నుంచి తీసిన సిల్ట్ ఎండేవరకు కాలువ పక్కనే ఉంచుతారు. అయితే రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి కాలువల్లో ఉండాల్సిన చెత్త రోడ్డుపైకి రావడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వాట్సాప్ ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే శంకర్ వెంటనే రోడ్డుపై ఉన్న మురుగును యుద్ధ ప్రాతిపదికన ఎత్తించారు. శుక్రవారం రాత్రి దీపామహల్ మెయిన్ రోడ్డు మీద అడుగుపెట్టే పరి స్థితి లేకపోగా శనివారం మధ్యాహ్నానికి అది క్లీన్ చేసేశారు.

Comments