
ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వానికి అను కూలంగా వచ్చాయి. అయినా ఫలితాలు చూశాక అలర్ట్ కావాల్సిన పరిస్థితి మాత్రం ఎదురైంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ స్థానం ఫలితంలో చోటుచేసుకున్న ట్విస్ట్ తెలుగుదేశం, జన సేనకు షాక్ ఇచ్చింది. దాంతో ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. అయితే రెండు గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పట్టభద్రుల స్థానాలకు జరిగిన రెండు సీట్లు కూటమి మద్దతునిచ్చిన అభ్యర్థులే గెలిచారు. అనూహ్యంగా ఉత్తరాంధ్ర ఉపా ధ్యాయ సీటు మాత్రం పీఆర్టీయూ గెలుచుకుంది. టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో తెలుగుదేశం, జనసేన బలపర్చిన రఘువర్మ కాకుండా పీఆర్టీయూ అభ్యర్థి శ్రీనివాసులునాయుడు గెలుపొందడం కొంత కలవరపరిచినా, శ్రీనివాసులునాయుడికి అంతకుముందు బీజేపీ మద్దతు ప్రకటించడంతో అదికూడా కూటమి కోటాలోకే వచ్చినట్లయ్యింది. ఈ ఎన్నికలకు వైకాపా దూరంగా ఉంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి క్లీన్‌స్వీప్ చేసిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇప్పుడు ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్ ఓటర్లు ఇచ్చిన తీర్పు కూటమి ప్రభుత్వానికి ఎలాంటి సంకేతాలను ఇచ్చింది. ఈ ఫలితాల సందేశం ఏంటన్నది పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఏపీలో మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు దాదాపు వంద అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగాయి. 2024లో కూటమి రెండు అసెంబ్లీల మినహా ఈ సీట్ల లో విజయం సాధించింది. అప్పట్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్లు ఉమ్మడిగా కూటమికి జై కొట్టారు. ఇప్పటి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను చూస్తే ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఘన విజయం సాధించారు. గతంలో కూడా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూటమి అభ్యర్ధులు విజయం సాధించినా, ఈసారి ఎన్నికలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పూర్తి దృష్టి సారించారు. ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబు పలుమార్లు కూటమి నేతలతో సమీక్షలు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఈ ఫలితాలపై కూటమి నేతలు విశ్లేషణలు చేస్తున్నారు. వైకాపా పోటీలో లేకున్నా, రెండు గ్రాడ్యుయేట్ స్థానాల్లో పీడీఎఫ్ అభ్యర్థులకు వేల సంఖ్యలో ఓట్లు రావడాన్ని టీడీపీ నేతలు ఇప్పుడు విశ్లేషిస్తున్నారు. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో ఫలితం టీడీపీని కలవరపరిచింది. మేము కూడా పీఆర్టీయూ అభ్యర్ధినే బలపరిచామని తెలుగుదేశం, జనసేన నేతలు ఇప్పుడు చెప్పుకుం టున్నా, ఇది కూటమి ఓటమిగా వైకాపా విమర్శిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయకుండా వైకాపా ఎలాంటి టెన్షన్ లేకుండా బైటపడితే, ఎన్నికల నోటిఫికేషన్ నుంచి కూటమి నేతలలో మాత్రం టెన్షన్ కనిపించింది. కూటమి ప్రభుత్వం 8 నెలల పాలనను పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఎలా చూశారన్నది ఫలితాలు తేల్చాయి. అయితే టీచర్లలో అప్పుడే అసంతృప్తి చోటుచేసుకుందా అనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని కూటమి నేతలకు తెలుసు. అయినా హామీలు గుప్పిం చారు. సూపర్ సిక్స్ హామీలను ఒకటి రెండు మినహా మిగిలినవాటిని అమలుచేయలేక పోస్ట్‌పోన్ చేస్తూవచ్చారు. దీని ప్రభావం గ్రాడ్యుయేట్ ఎన్నికలలో కనిపించింది. సంవత్సరంలోపే ఈ టెన్షన్ పరిస్థితి ఉంటే, తర్వాత పరిస్థితి ఏంటన్నది సందేహంగా మారింది. గత ప్రభుత్వంలో చెలరేగిపోయిన వైకాపా నేతలపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సరిగా వ్యవహరించడం లేదని తొలుత తెలుగుదేశం కిందిస్థాయి కేడర్‌లో అసంతృప్తి చోటుచేసుకుంది. అయినా ఓపికగా ఎదురు చూశారు. ప్రతి పని విషయంలో ముందూ వెనుకా ఆర్థిక పరిస్థితి బాగోలేదన్న పాట పాటుతుం డటంతో ఈ విషయం ముందు తెలియదాన్న వ్యంగ్య ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇవన్నీ ఎమ్మెల్సీ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం టెన్షన్‌కు గురవడానికి కారణం అయింది. అందుకే ఎన్నికల్లో ఓటుకు లెక్కకట్టి మరీ డబ్బులు పంచాల్సి వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ నేతలకు తమ పార్టీ అధికార ప్రతినిధి, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా చేయడం సంకటంగా మారింది. పార్టీ అధినేత వైఖరి వల్లే ఒకనేత పార్టీకి దూరమయ్యాడన్న అభిప్రాయం నెల కొంది. ఈ ఎపిసోడ్ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనే చోటుచేసుకుంది.
Comments