top of page

ఎవరూ గెలవని యుద్ధం

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Apr 9
  • 3 min read
  • పాకిస్తాన్ బ్రోకరిజమ్‌తో ఓడిపోయిన ఇరాన్

  • లక్ష్యాలు సాధించని అమెరికా, ఇజ్రాయిల్

  • ఇరాన్ అమెరికా బి`టీమ్‌గా మారనుందా?

  • గల్ఫ్ దేశాలకు ముప్ప్పు తప్పదు

యుద్ధంలో ఎవరు గెలిచారు? ఒకపక్క ఇరాన్ విజయాన్ని ప్రకటించింది. మరోపక్క డొనాల్డ్ ట్రంప్ మేమే విజయాన్ని సాధించామంటున్నాడు. అసలు ఎవరు గెలిచారు?

ఫిబ్రవరి 28 నుంచి యుఎసఏ`ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ యుద్ధంలో ఇజ్రాయిల్ లక్ష్యం పూర్తిగా కాకపోయినా కొంతవరకు నెరవేరింది. ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత ఇజ్రాయిల్ కేవలం 10 నిమిషాల్లో లెబనాన్‌లో 100 చోట్ల హెజ్బుల్లా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌పై దాడి చేసింది. వాస్తవానికి మొన్న డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ నాగరికతను ధ్వంసం చేస్తామన్నాడు కదా. కానీ లెబనాన్ నాగరికతను ఇజ్రాయిల్ ధ్వంసం చేస్తోంది. ఈ శాంతిఒప్పందంలో లెబనాన్‌కు సంబంధించి ఎటువంటి షరతులు లేవని ఇజ్రాయిల్ అంటుంది. ఇరాన్‌లోని దాదాపు అన్ని న్యూక్లియర్ సైట్స్‌పై ఇజ్రాయిల్ ఫైటర్ జెట్స్ దాడి చేశాయి. ఇరాన్ మళ్లీ న్యూక్లియర్ వెపన్స్‌ను న్యూక్లియర్ ఎన్‌రిచ్మెంట్‌ను పునర్‌వద్ధి చేయడానికి పదేళ్లు పడుతుందని ఐఐఏ ప్రకటించింది.

ఇజ్రాయిల్‌ను పక్కన పెడితే యూఎసఏ ఎంతవరకు విజయాన్ని సాధించింది? ఇరాన్ లక్ష్యాలు ఎంతవరకు నెరవేరాయి? అసలు ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు?

ట్రంప్ గంటకొక ట్వీట్ పెడుతున్నాడు. ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్ మార్చ్ 26 నుంచి ఇరాన్‌ను వైప్ అవుట్ చేస్తా అని 40 సార్లు వార్నింగ్ ఇచ్చాడు. ఏ వార్నింగ్‌నూ అమలుచేయలేకపోయాడు. అంటే.. ట్రంప్ ఒక పేపర్ టైగరని అర్థమైపోయింది. డబ్ల్యూడబ్ల్యూఈ మ్యాచ్‌లో ఎలాగైతే దెబ్బ కొట్టకపోయినా హూ హ అని దెబ్బ తగిలినట్లు నాటకాలు ఆడతారో సేమ్ అలాగే నాటకాలాడాడు. ఇందులో భాగంగానే ట్రంప్ తన స్క్రిప్ట్ రైటర్‌ను పిలిపించి తన దళారీ దేశ నాయకుడు షెహబాజ్ షరీఫ్‌కు ఒక డ్రాఫ్ట్ స్క్రిప్ట్ పంపాడు. ఇరాన్‌పై దాడులు రెండు వారాల వరకు సస్పెండ్ చేయాలి. ఈ టైమ్ గ్యాప్‌లో ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్‌ను ఓపెన్ చేస్తుందని చెప్పి షెహబాజ్ షరీఫ్ కాల్పుల విరమణను ప్రకటించాడు. అయితే మదరసా యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేసిన షెహబాజ్ షరీఫ్ అదే డ్రాఫ్ట్‌ను ఆయన ట్వీట్‌ను పెట్టుకున్నాడు. పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ అసిం మునీర్, షెహబాజ్ షరీఫ్ ట్రంప్‌తో మాట్లాడారంట. ఇరాన్ నాయకులతో కూడా మాట్లాడారంట. దీంతో సీస్ ఫైర్ జరిగిందని ప్రజలకు ఒక సగం వండిన స్టోరీని వడ్డించారు. ట్రంప్ బెదిరింపులకు భయపడి ఇరాన్ కాల్పుల విరమణకు వచ్చింది. అంటే.. ఇరాన్ తగ్గిపోయింది, ప్రజల దృష్టిలో ట్రంప్‌కు ఇరాన్ భయపడింది అనే ఎమోషన్ వెళ్తుంది. అంటే యుఎసఏ గెలిచినట్టు. కానీ ఇది నిజం కాదు. ఇరాన్‌లో ప్రభుత్వాన్ని మారుస్తామని చెప్పి యుద్ధంలో దిగాడు ట్రంప్. కానీ అది జరగలేదు. అక్కడ ముల్లాల రాజ్యమే నడుస్తోంది. ముస్తాబా ఖమేని సుప్రీమ్ అలీ ఖమేని కంటే పక్కా షియా ముస్లిం పద్ధతులు పాటించే వ్యక్తి. ఇరాన్ బాలస్టిక్ హైపర్‌సోనిక్ మిసైల్స్ ఉత్పత్తిని కూడా ట్రంప్ కట్టడి చేయలేకపోయాడు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్‌ను ఓపెన్ చేయలేకపోయారు. హార్మూజ్ ఓపెన్ కాలేదు సరికదా.. అదనంగా 20 మిలియన్ డాలర్ టోల్ కట్టడానికి యుఎసఏ ఒప్పుకున్నట్లుంది. వాస్తవానికి ఇరాన్ ట్రంప్ లాస్ట్ వార్నింగ్ తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం చేసుకొని తప్పు చేసింది. అందులోనూ పాకిస్తాన్‌ను మధ్యలో బ్రోకర్‌లా పెట్టి చాలా పెద్ద తప్పు చేసింది.

ఇరాన్ అజెండా ఏంటి? పశ్చిమాసియాలో ఉన్న యుఎసఏ బేసెస్‌ను ధ్వంసం చేస్తానని చెప్పి ముల్లాలు ఫత్వాలు జారీ చేశారు కదా.. కానీ ఈ యుద్ధం తర్వాత కూడా గల్ఫ్ దేశాల్లో యూఎసఏ మిలిటరీ బేసెస్ అలాగే ఉన్నాయి. ఇజ్రాయిల్ ఈ భూమి మీద లేకుండా చేస్తామని చెప్పి ముల్లాలు ఇంకొక ఫత్వా జారీ చేశారు. ఇజ్రాయిల్ కూడా అలాగే ఉంది. ఇజ్రాయిల్‌లో ఏం మార్చగలిగారు? నెతన్యాహూను చంపలేకపోయారు.. కనీసం ఇజ్రాయిల్ డిఫెన్స్ మినిస్టర్‌ను కూడా చంపలేకపోయారు. ఇజ్రాయిల్ టెలఅవీవాను బూడిద చేస్తామన్నారు. దాన్ని కూడా ఏమి చేయలేకపోయారు. ఈ యుద్ధంలో యూఎసఏ ఇరాన్ ఇద్దరూ పూర్తిగా గెలవలేదు. ఎవరి లక్ష్యాలూ పూర్తిగా నెరవేరలేదు. చివరకు ఇజ్రాయిల్ లక్ష్యాలు కూడా శతశాతం నెరవేరలేదు. ఈ కాల్పుల విరమణ ఇజ్రాయిల్‌కు ఇష్టం లేదు కాబట్టే సీస్ ఫైర్ ప్రకటించిన తర్వాత కూడా లెబనాన్‌లో దాడులు చేస్తూనే ఉంది. ఫిబ్రవరి 28 కంటే ముందు హార్మోజ్ ఇంటర్నేషనల్ వాటర్‌గా ఉండేది. ఫ్రీగా ఉండేది. ఇప్పుడు ఈ యుద్ధం కారణంగా మనం ప్రతి ఒక్క షిప్‌కు 20 మిలియన్ డాలర్స్ ఎందుకు కట్టాలి? ఇప్ప్పుడైనా ప్రపంచ దేశాలు ఒక్కటై యూఎసఏ ఇరాన్‌కు వ్యతిరేకంగా ముందుకు రావాలి. ఇరాన్ పెంచి పోషిస్తున్న హెజ్బుల్లా, హౌతిపై దాడి చేయడాన్ని ఆపేయాలి అంటున్నారు. అంటే హౌతి, హెజ్బుల్లా, హమాస్ అనేవి ఉగ్రవాద సంస్థలు కదా.. ఈ ఉగ్రవాద సంస్థలపై దాడి చేయొద్దని చెప్పి ఇరాన్ ఎందుకు డిమాండ్ పెడుతోంది? దీన్ని డొనాల్డ్ ట్రంప్ ఎందుకు ఒప్పుకుంటున్నాడు? ఇరాన్ ప్రాక్సీ గ్రూప్స్ అన్నిటిని సర్వనాశనం చేస్తా, ఇరాన్ ముల్లా రాజ్యాన్ని మారుస్తా అని చెప్పి యుద్ధం స్టార్ట్ చేసిన వ్యక్తి, ఇరాన్ గొంతెమ్మ కోర్కెలను ఒప్పుకుంటున్నాడు అంటే.. దీనికంటే ఓటమి ఉండదు. ఇరాన్‌ను హీరో చేశారు. ఇరాన్‌కు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కట్టబెట్టారు. టోల్ టాక్స్ కలెక్ట్ చేసుకో అంటున్నారు. బాలిస్టిక్ హైపర్‌సోనిక్ మిసైల్స్‌ను తయారు చేసుకోండి అంటున్నారు. న్యూక్లియర్ వెపన్స్ రెస్ట్రిక్షన్స్‌ను ఎత్తివేస్తామంటున్నారు. ఇరాన్‌పై ఉన్న ఆర్థిక నిబంధనలను ఎత్తివేస్తామంటున్నారు. ఇరాన్‌తో డొనాల్డ్ ట్రంప్ కలిసి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్‌కు వచ్చి వెళ్లే షిప్స్‌పై టోల్ అండ్ టాక్స్‌ను కలెక్ట్ చేస్తారు. ఇప్పుడు అమెరికాకు జూనియర్ పార్టనర్ ఇరాన్ అవ్వనుంది. మధ్యలో ఈ దళారీ పాకిస్తాన్ కూడా దూరింది. దళారీ పాకిస్తాన్, ఇరాన్, యుఎసఏ ఈ ముగ్గురు కలిసి గల్ఫ్ దేశాలపై రాబందుల్లా పడతారు. ఇక్కడ ఈ యుద్ధంలో ఇరాన్ గాని, యుఎసఏ గాని గెలవలేదు. ఇరాన్ చేసిన ఒకే ఒక్క తప్పు ట్రంప్ లాస్ట్ వార్నింగ్‌తో పాకిస్తాన్ బ్రోకరేజ్ చేశాక తర్వాత యుద్ధాన్ని ఆపేయడమే. అలా కాకుండా ఒమన్, చైనా, రష్యా చెబితే యుద్ధాన్ని ఆపి ఉంటే బావుండేది. బిలియన్ డాలర్ల కోసం కాళ్లు, చేతులు ఆడించే పాకిస్తాన్ షెబబాజ్ షరీఫ్ చెప్తే యుద్ధాన్ని ఆపేయడమే విశేషం. ఆయన్ను ఆ దేశ ప్రజలే ఖాతరు చేయరు. ఆఫ్ఘనిస్తాన్, టిటిపి, పాకిస్తాన్ ఆర్మీ మధ్య కాల్పుల విరమణ చేయలేని వాళ్లు ఇంత పెద్ద యుద్ధాన్ని ఆపేశారంటే ఎలా నమ్మాలి?

మిలిటరీ శక్తిని పోలిస్తే అమెరికా కంటే అతి చిన్న బడ్జెట్‌తో నడుస్తున్న ఇరాన్ అమెరికాను కూర్చోబెట్టింది. వాస్తవానికి ఈ యుద్ధంలో ఇరాన్‌కు కొంత ఎడ్జ్ ఉంది. ఈ యుద్ధం ఇంకా కొనసాగాలని ప్రపంచంలో అన్ని దేశాల మాదిరిగానే మన దేశం కూడా కోరుకోలేదు. కాకపోతే 75 శాతానికి పైబడిన భారతీయులు ఇరాన్ పోరాట పఠిమకు గెలుపు వారినే వరించాలని కోరుకున్నారు. కానీ పాకిస్తాన్ చెప్పినందుకు యుద్ధాన్ని ఆపేశారంటే.. ఇరాన్‌పై ఉన్న ఆ గౌరవం భారతీయుల్లో పోయింది.


Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page