top of page

కథ బాగు.. కథనం ల్యాగు

  • Guest Writer
  • May 9
  • 3 min read

ఇన్నాళ్లూ నటిగా అలరించిన సమంత ఇప్పుడు నిర్మాతగా మారింది. ఆమె ప్రొడక్షన్‌ హౌస్‌ ‘ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌’లో తెరకెక్కిన తొలి చిత్రం.. శుభం. కొత్త.. వర్ధమాన నటీనటులను పెట్టి ‘సినిమా బండి’ ఫేమ్‌ ప్రవీణ్‌ కంద్రేగుల రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం..

కథ:

భీమునిపట్నం అనే ఊరిలో కేబుల్‌ టీవీ బిజినెస్‌ నడిపే కుర్రాడు.. శ్రీనివాస్‌ (హర్షిత్‌ రెడ్డి). అతడికి శ్రీవల్లి (శ్రియ కాంతం) అనే అమ్మాయితో పెళ్లవుతుంది. ఇష్టపడి పెళ్లి చేసుకున్న అమ్మాయితో తొలి రాత్రిని మధురంగా మార్చుకోవాలని భావించిన అతడికి చేదు అనుభవం ఎదురవుతుంది. తనకే తెలియకుండా ఒక సీరియల్‌కు బానిసగా మారిన శ్రీవల్లి.. భర్తకు చుక్కలు చూపించేస్తుంది. శ్రీవల్లి ఎందుకిలా ప్రవర్తిస్తోందో అర్థం కాక తన స్నేహితులకు విషయం చెబితే..వాళ్ల భార్యలు కూడా ఇలాగే వింతగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. కొన్నిరోజుల తర్వాత ఊర్లో ఆడాళ్లందరూ ఒక సీరియల్‌ చూస్తూ తమ ఇంట్లో వాళ్లకు చుక్కలు చూపిస్తున్నట్టు అర్థమవుతుంది. ఇంతకీ ఆ ఊరి ఆడవాళ్లు ఇలా ఎందుకు చేస్తున్నారు.. వారికి ఆ సీరియల్‌కు ఉన్న కనెక్షన్‌ ఏంటి.. ఈ సమస్యను ఆ ఊరి వాళ్లు ఎలా పరిష్కరించుకున్నారు.. అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

టీవీ సీరియళ్లు నడిచే తీరు.. సన్నివేశాల్లోని అతి.. విపరీతమైన సాగతీత మీద కౌంటర్లు వేస్తూ కామెడీ చేయడం ఇప్పుడు సినిమాల్లోనూ ఒక ట్రెండుగా మారింది. మత్తు వదలరా.. మత్తు వదలరా-2 లాంటి చిత్రాల్లో టీవీ సీరియళ్ల ‘అతి’ మీద చాలా సరదాగా సాగిపోయే కామెడీతో ప్రేక్షకులను నవ్వించాయి వాటి చిత్ర బృందాలు. ఐతే ఆ సినిమాల్లో అసలు కథతో పాటు టీవీ సీరియల్‌ కామెడీని ఒక ట్రాక్‌ లాగా నడిపిస్తే.. ఇప్పుడు సమంత ప్రొడక్షన్లో తొలి చిత్రమైన ‘శుభం’లో ఈ కామెడీనే అసలు కథగా మార్చి రెండు గంటలు నవ్వుల్లో ముంచెత్తుదామని ప్రయత్నించారు రచయిత వసంత్‌ మరిగంటి-దర్శకుడు ప్రవీణ్‌ కండ్రేగుల. వాళ్లు ఎంచుకున్న పాయింట్‌ క్రేజీగా అనిపిస్తుంది. కొన్ని చోట్ల కామెడీ కూడా బాగానే వర్కవుట్‌ చేయగలిగారు కూడా. కానీ సీరియళ్లలో విపరీతమైన ‘ల్యాగ్‌’నే కథా వస్తువుగా మార్చుకున్న ఈ జోడీ.. తమ సినిమానూ అంతే ‘ల్యాగ్‌’గా మార్చడమే ప్రతికూలాంశం. క్రేజీగా అనిపించే పాయింట్‌ తీసుకుని.. దాన్ని పకడ్బందీగా తెరపై ప్రెజెంట్‌ చేయడంలో ‘శుభం’ టీం తడబడిరది. కామెడీ ఓకే అనిపించినా.. అది కూడా ఒక దశ దాటాక రిపిటీటివ్‌ అనిపించడం.. పెద్దగా మలుపు లేకుండా సింగిల్‌ పాయింట్‌ అజెండాతో సాగిపోవడంతో ‘శుభం’ చివరికి సోసో సినిమాగా అనిపిస్తుంది.

చాలా ఏళ్ల కిందట ‘మనం’ దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ ‘13 బి’ అనే హార్రర్‌ సినిమా తీశాడు గుర్తుందా? హీరో కుటుంబం ఓ టీవీ సీరియల్‌ కు విచిత్రమైన రీతిలో కనెక్ట్‌ అయిపోయి.. తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకోవడం.. ఈ నేపథ్యంలో ఒళ్లు గగుర్పొడిచే హార్రర్‌ ను పండిరచాడు విక్రమ్‌. ఇలాంటి పాయింటే తీసుకుని సరదాగా డీల్‌ చేసి హార్రర్‌ కామెడీగా మార్చింది ‘శుభం’ టీం. పైన చెప్పుకున్న ‘మత్తు వదలరా’ సినిమాలోని సీరియల్‌ కామెడీ ట్రాక్‌ కూడా ఈ కథకు స్ఫూర్తిగా నిలిచినట్లు కనిపిస్తుంది. ఎంతకీ శుభం కార్డు పడకుండా వేల కొద్దీ ఎపిసోడ్లతో సాగిపోయే టీవీ సీరియళ్ల మీద వేసిన సెటైర్‌గా ఈ సినిమాను చెప్పుకోవచ్చు. ‘చచ్చినా చూడాల్సిందే’ అంటూ పెట్టిన క్యాప్షన్‌తోనే ఈ సినిమా కథేంటో చెప్పకనే చెప్పేసింది చిత్ర బృందం. దీనికి సంబంధించిన గమ్మత్తు ఏంటో తెర మీదే చూడాలి. ఆడవాళ్లకు సీరియళ్లకు ఉన్న అవినాభావ సంబంధం మీద హార్రర్‌ ఫ్యాక్టర్‌ జోడిరచి సెటైరికల్‌గా నడిపిన సన్నివేశాలు సినిమాకు ఆకర్షణగా మారాయి. ఐతే మొదట్లో ఫన్నీగా అనిపించే సీన్లనే మళ్లీ రిపీట్‌ చేయడంతో అవి అనుకున్నంత మజానివ్వవు. అంతకుమించి ఏమైనా ఉంటుందా అని చూస్తే నిరాశే మిగులుతుంది.

హార్రర్‌ కామెడీ జానర్లో ముందుగా హార్రర్‌ ఫ్యాక్టర్‌ ను బాగా ఎస్టాబ్లిష్‌ చేస్తే.. ఆ తర్వాత కామెడీ కూడా బాగా పండుతుంది. కానీ ‘శుభం’లో హార్రర్‌ పాయింటుని చాలా లైట్‌ గా చూపించారు. అందుకు తగ్గ మూడ్‌ క్రియేట్‌ చేయడంలో పెద్దగా కసరత్తు జరగలేదనిపిస్తుంది. పైపైన సీన్లు నడిపించేశారు. తెరపైన పాత్రలు విపరీతంగా భయపడుతుంటాయి కానీ.. ప్రేక్షకుడికి అలాంటి ఫీలింగ్‌ కలగదు. ఇదేదో తమాషా వ్యవహారంలాగే అనిపిస్తుంది. దాని వల్ల కథను సీరియస్‌ గా తీసుకోలేని పరిస్థితి కలుగుతుంది. ఐతే కామెడీ సీన్లు కొన్ని పేలడం వల్ల.. తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి వల్ల సినిమా బోర్‌ అయితే కొట్టదు. కథ కొంచెం నెమ్మదిస్తున్న సమయంలో.. సమంత పాత్ర రంగప్రవేశం చేయడంతో కథనం ఇక పరుగులు పెడుతుందనే ఆశలు కలుగుతాయి. కానీ సామ్‌ పాత్ర తుస్సుమనిపించింది. తెలుగు పదాలను ముక్కలు చేసి.. వాటికి విచిత్రమైన అర్థాలు చెప్పే సమంత క్యారెక్టర్‌ విసుగు తెప్పిస్తుంది. ఆమె వల్ల సినిమాకు ఎలాంటి ప్రయోజనం కలగలేదు. ప్రథమార్ధం వరకు పర్వాలేదనిపించే ‘శుభం’ ద్వితీయార్ధంలో ఒడుదొడుకులతో సాగుతుంది. అక్కడక్కడా కామెడీ పండినా.. కథ ముందుకు సాగక కొంచెం విసుగు పుడుతుంది. సమస్యకు పరిష్కారం వెతికే క్రమంలో వచ్చే సన్నివేశాలు సాధారణంగా అనిపిస్తాయి. ప్రవీణ్‌ కండ్రేగుల ‘సినిమా బండి’కి కనెక్షన్‌ పెడుతూ అందులోని పాత్రలను ప్రవేశపెట్టి కొంచెం ఊపు తేవాలని చూశాడు కానీ.. అది కూడా పెద్దగా వర్కవుట్‌ కాలేదు. పతాక సన్నివేశాలు పర్వాలేదనిపిస్తాయి. ఇక్కడ మహిళల కోణంలో కొంచెం సందేశం ఇవ్వాలని.. ఎమోషనల్‌ యాంగిల్‌ జోడిరచాలని చూశారు కానీ.. అది మొక్కుబడి వ్యవహారం లాగే అనిపిస్తుంది. ఓవరాల్‌ గా చూస్తే ‘శుభం’ కాన్సెప్ట్‌ అయితే ఇంట్రెస్టింగ్‌ గా అనిపిస్తుంది. కానీ దాన్ని ప్రెజెంట్‌ చేసిన తీరు.. షార్ట్‌ ఫిలింకి ఎక్కువ.. ఫీచర్‌ ఫిలింకి తక్కువ అన్న ఫీలింగ్‌ కలిగిస్తుంది. ఎక్కువ అంచనాలు లేకుండా టైంపాస్‌ కామెడీ కోసమైతే ‘శుభం’పై ఓ లుక్కేయొచ్చు.

నటీనటులు:

‘శుభం’లో చాలా వరకు కొత్త.. వర్ధమాన నటులే ముఖ్య పాత్రలు పోషించారు. వాళ్లందరూ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. ‘మెయిల్‌’ సినిమా.. ‘తరగతి గది దాటి’ సిరీస్‌తో గుర్తింపు సంపాదించిన హర్షిత్‌ రెడ్డి.. శ్రీనివాస్‌ పాత్రకు న్యాయం చేశాడు. అమాయకత్వం నిండిన పాత్రను సింపుల్‌ గా చేసుకుపోయాడు. లవ్లీగా అనిపించే నటనతో అతను ఆకట్టుకున్నాడు. హర్షిత్‌ కు జోడీగా శ్రీవల్లి అనే కీలక పాత్రలో చేసిన కొత్తమ్మాయి శ్రియ కాంతం కూడా బాగానే చేసింది. హీరోయిన్‌ లాగా కాకుండా ఒక పాత్రధారిలా కనిపించిన శ్రియ.. కథకు కీలకమైన కొన్ని ముఖ్య సన్నివేశాల్లో చక్కగా నటించింది. దర్శకుడు శ్రీనివాస్‌ గవిరెడ్డి.. ‘మ్యాడ్‌’ ఫేమ్‌ చరణ్‌ పేరి హీరో స్నేహితుల పాత్రల్లో ఒదిగిపోయారు.. నవ్వించారు. వారికి జోడీగా నటించిన అమ్మాయిలిద్దరూ కూడా దయ్యం పట్టిన పాత్రల్లో ఆకట్టుకున్నారు. మంత్రగత్తె మాయ పాత్రలో సమంత జస్ట్‌ ఓకే అనిపించింది. ఆమె క్యామియో అనుకున్నంతగా పేలలేదు. మిగతా ఆర్టిస్టులంతా మామూలే.

సాంకేతిక వర్గం:

ఇండీ ఫిలిమ్స్‌ స్టయిల్లో సాగే ‘శుభం’లో గొప్ప సాంకేతిక విలువలేమీ కనిపించవు. షోర్‌ పోలిస్‌ పాటల్లో గుర్తుంచుకోదగ్గవేమీ లేవు. వివేక్‌ సాగర్‌ బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ కొన్ని చోట్ల ఉత్కంఠ రేకెత్తిస్తుంది. కొన్ని చోట్ల హుషారు పుట్టిస్తుంది. మృదుల్‌ సుజీత్‌ సేన్‌ ఛాయాగ్రహణం సాధారణంగా సాగిపోయింది. ప్రొడక్షన్‌ వాల్యూస్‌ కూడా అంతే. ఫీచర్‌ ఫిలిం కాకుండా ఏదో షార్ట్‌ ఫిలిం చూస్తున్న ఫీలింగ్‌ కలుగుతుంది చాలా సన్నివేశాల్లో. వసంత్‌ మరిగంటి కథలో విషయం ఉంది. వినడానికి క్రేజీగా అనిపించే పాయింట్‌ తీసుకున్నాడతను. కానీ కథా విస్తరణలో ఇంకా కసరత్తు చేయాల్సింది. దర్శకుడు ప్రవీణ్‌ కండ్రేగుల కామెడీని డీల్‌ చేయడంలో మరోసారి తన ప్రతిభను చూపించాడు. కానీ చాలా సీన్లను చాలా తేలిగ్గా నడిపించేశాడు. కథలో ఇంటెన్సిటీని తెరపై చూపించలేకపోయాడు. దర్శకుడిగా అతడికి యావరేజ్‌ మార్కులు పడతాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page