
ఒకేవిధమైన వస్త్రధారణ ఉన్న కారణంగా హిందూ పురుషులను గుర్తించడానికి సున్తీ జరిగిందా? లేదా? అని పరీక్ష చేసి చంపేవారు. ఇప్పుడు బాలూచీ భాష వస్తే వదిలేస్తారు. ఉర్దూ మాట్లాడితే చంపేస్తున్నారు బాలూచ్ ఉగ్రవాదులు. మంగళవారం రైలులో ఉన్న ప్రయాణీకులను కూడా అలాగే చంపినట్లు ప్రాథమిక అంచనా. పాకిస్తాన్‌లోని పంజాబీలంటే బాలూజ్‌లకు అసలు నచ్చదు. 2029 లోపే పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్‌లో కలిసిపోవచ్చు. తర్వాత ఖైబర్ ఫక్తున్వా ఆఫ్గనిస్తాన్‌లో కలిసిపోతుంది. బాలూచ్‌కు స్వాతంత్య్రం కూడా 2029లో రావచ్చు. బాలూచిస్తాన్‌లో ఉన్న గ్వాదర్ పోర్టు చైనా చేతిలో ఉండటం అమెరికాకు ఇష్టం ఉండదు. చేసిన అప్పులకు పాకిస్తాన్ తిరిగి ఇవ్వ మని అడగలేదు. బాలూచిస్తాన్‌లో అపారమైన ఖనిజ సంపద ఉంది. అమెరికా ఎలా వదులు కుంటుంది? కశ్మీర్‌లో ఇటువంటి వాతావరణం ఉన్నందునే కదా.. పాకిస్తాన్ కొన్ని దశాబ్దాలుగా అక్కడ రావణకాష్టం రగిలిస్తోంది. కశ్మీర్‌ను తనలో కలిపేసుకోవడం కోసం ఎన్ని కుట్రలు పన్నింది? ఇప్పుడు మనకు కశ్మీర్ ఎలాగో, పాకిస్తాన్‌కు బాలూచిస్తాన్ అలాగ. అక్కడ సెగ మొదలైతే గాని బాధేమిటో పాకిస్తాన్‌కు అర్థమైనట్టులేదు. కర్మ అనుభవించడం కొనిసార్లు ఆలస్యం కావచ్చేమో గానీ, అమలుకావడం మాత్రం పక్కా. ఒక్కసారి గతంలోకి వెళ్తే.. వికీలీక్స్ పత్రాలు బయటపడినప్పుడు.. అంటే నాలుగేళ్ల క్రితం 2029 నాటికి పాకిస్తాన్ నాలుగు ముక్కలుగా విభజించాలని అమెరికా డీప్‌స్టేట్ ప్రణాళిక ఉందని తేలింది. జూలియస్ అసాంజే బయటపెట్టిన రహస్యాల్లో పాకిస్తాన్ కంటే ఇతర విషయాలు ఎక్కువ ప్రాముఖ్యత కలిగినవి ఉండటంతో ఈ వార్త అప్పట్లో పెద్దగా వైరల్ కాలేదు. కానీ వికీలీక్స్‌లో పేర్కొన్నవన్నీ జరుగుతున్నాయి. జాగ్రత్తగా గమనిస్తే సిరియాలో తిరుగు బాటు జరిగి అధికార మార్పిడి రక్తపాతం లేకుండా పూర్తయింది. కానీ మూణ్ణెళ్లయిందో లేదో, ఇప్పుడు షియా, సున్నీ తెగల మధ్య ఘర్షణలు మొదలై వందల్లో షియాలను సున్నీలు చంపేస్తున్నారు. దీనర్థం సిరియాను కూడా మూడు ముక్కలు చేసి ఒక ముక్క ఇజ్రాయెల్, ఒక ముక్క సున్నీలకు, మరో ముక్క షియాలకు అమెరికా అప్పజెబుతోంది. అంతకంటే ముందు బలూచిస్తాన్‌కు మద్దతి స్తుంది. అందులో భాగంగానే బలూచిస్తాన్ రాజధాని క్వెట్టా నుంచి పెషావర్‌కు వెళ్తున్న జాఫర్ ఎక్స్ ప్రెస్‌ను బీఎల్‌ఏ తీవ్రవాదులు హైజాక్ చేశారు. రైలులో సైనికులతో పాటు 400 మంది ప్రయా ణీకులు ఉన్నారని మీడియా పేర్కొంది. పాకిస్తాన్‌లో ప్రముఖ దినపత్రిక డాన్ కథనం ప్రకారం క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ బోలన్ జిల్లాలోని పెహరో కునారీ, గాదలర్‌ల మధ్య 8వ నెంబర్ టన్నెల్ వద్ద బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తీవ్రవాదులు ఇంజిన్‌లో చివరలో ఉండే గార్డు బోగీ మీదకు కాల్పులు జరిపి రైలును ఆపేశారు. బీఎల్‌ఏ కాల్పుల్లో లోకోపైలట్ ఒకరు మరణించినట్టు తెలుస్తుంది. జాఫర్ ఎక్స్‌ప్రెస్ కొద్ది నిమిషాల్లో 8వ నెంబర్ టన్నెల్‌లోకి ప్రవేశిస్తుందనగానే దానికి ముందే ట్రైన్‌ను ఆపేశారు. పెహరో కునారీ, గాదలర్ ప్రాంతాలు పర్వతాలతో నిండివుంటాయి. అందుకే సొరంగాలు ఎక్కువగా ఉంటాయి. తీవ్రవాదులు దాడి చేసి తప్పించుకోడానికి అనువుగా ఉంటుంది. అందుకే జాఫర్ ఎక్స్‌ప్రెస్‌లో సైనికుడ్ని కాపలాగా ఉంచుతారు. ప్రస్తుతానికి సైనికులకు, తీవ్రవాదులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. బలూచిస్తాన్‌లో ఎమర్జెన్సీ విధించి మరిన్ని భద్రతా దళాలను తరలించడానికి రెండు ప్రత్యేక రైళ్లను పాకిస్తాన్ ప్రభుత్వం పంపుతుంది. 2024 నవంబరు లో క్వెట్టా రైల్వేస్టేషన్‌లో ఆత్మాహుతి దాడి జరిగి 60 మంది చనిపోయారు. దీంతో రెండు నెలల పాటు క్వెట్టా నుంచి పెషావర్ వరకు రైలు సర్వీసులు రద్దు చేశారు. ఇటీవలే మళ్లీ సర్వీసులను పున రుద్ధరించారు. రైలు హైజాక్, రైల్వేస్టేషన్‌లో ఆత్మాహుతిదాడి వంటివి పాకిస్తాన్ ప్రాంతంలో జరగడం కొత్త కాకపోయినా, ప్రత్యేక దేశం కావాలనే నినాదంతో ఇటువంటివి జరగడం కచ్చితంగా కర్మఫలి తాన్ని అనుభవించడమే. మొన్నటికి మొన్న జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్‌లలో బలూచి స్తాన్ ఏదో ఒక టీమ్ మీద గెలిచి ప్రపంచ పటంలో తామూ ఉన్నామని, స్వతంత్ర దేశాన్ని కోరుకుం టున్నామని అంతర్జాతీయ వేదిక మీద నోరిప్పాలని ప్రయత్నించింది. కానీ అది కుదరలేదు. ఇప్పుడు రైలు హైజాక్ ద్వారా ఒక్కసారిగా అంతర్జాతీయంగా బలూచిస్తాన్ అంశం తెర మీదకు వచ్చింది. ఇన్నాళ్లూ అంతర్జాతీయ మీడియాతో పాటు భారత్ మీడియా కూడా పాకిస్తాన్‌లో జరుగుతున్న ఈ వేరుకుంపటి అంశాన్ని పెద్దగా ఫోకస్ చేయలేదు. పక్కదేశంలో పుల్లలు పెట్టే పాకిస్తాన్‌లోనే ఇప్పుడు ఒక రైలు హైజాక్ కావడం ఎంతమాత్రమూ కాకతాళీయం కాదు. నేపాల్‌లో బయల్దేరిన ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం కాందహార్‌లో దిగిన ఘటన గుర్తొస్తే.. అది మా తప్పు కాదు.
Comments