‘కూన’ చేతిలో ఏసీఏ పిలక
- Prasad Satyam
- Jun 15
- 2 min read
గేమ్ స్టార్ట్ చేసిన నూతన అధ్యక్షుడు
త్రిసభ్య కమిషన్ ఎంక్వైరీ అనుమానమే

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఆమదాలవలస ఎమ్మెల్యే, జిల్లా క్రికెట్ సంఘానికి నూతన అధ్యక్షుడు కూన రవికుమార్ ఇప్ప్పుడు గేమ్ షురూ చేశారు. రవికుమార్ క్రికెట్ సంఘానికి కొత్త అధ్యక్షుడయ్యారని ప్రకటించిన దగ్గర్నుంచి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ జోక్యం ఎక్కువైన నేపథ్యంలో కూన అందుకు అనుగుణంగా డిఫెన్స్ ఆడకుండా, ఏకంగా హిట్టింగ్‌కు వెళ్తున్నారు. అసలైన గేమ్ ఇప్ప్పుడు మొదలైంది. జిల్లా క్రికెట్ సంఘం ఎన్నికపై తమకు అభ్యంతరాలు వచ్చాయని, తాము ఈ ఎన్నికలు నిర్వహిస్తామంటూ ఏసీఏ పంపిన తాఖీదును జిల్లా క్రికెట్ సంఘం కోర్టులో ఛాలెంజ్ చేసింది. కేవలం ఏసీఏ పంపిన నిధులకు లెక్కాపత్రాలు అడగడం, అందులో దోషాలుంటే బయటపెట్టడం, జిల్లా నుంచి క్రికెటర్లను తయారుచేయడం మాత్రమే ఏసీఏ పని అని, జిల్లా సంఘం ఎన్నికల్లో ఎవర్ని తెచ్చిపెట్టుకున్నారన్న దానిపై ఏసీఏకు ఎటువంటి అధికారం లేదనే క్లాజ్‌ను కూన రవి బయటకు తీశారు. అదే వేగంతో కోర్టులో ఏసీఏ మీద ఓ కేసు వేసినట్లు తెలుస్తుంది. దీంతో ముగ్గురు సభ్యులను ఎన్నికపైన విచారణ నిర్వహించేందుకు ఏసీఏ ఇక్కడకు పంపడం తాత్కాలికంగా బ్రేకయినట్టే. మరోవైపు అండర్`16 క్రీడాకారుల ఎంపికను ఏసీఏ తరఫున సెలక్టర్లు ఇక్కడకు వచ్చి చేపట్టారు. తీరా చూస్తే ఇందులో కూడా అనర్హులు, అసలు పోటీలకే రానివారిని ఎంపిక చేసినట్లు స్వయంగా క్రికెటర్స్ పేరెంట్ అసోసియేషనే ఏసీఏకు ఒక ఫిర్యాదు చేసింది. ఇది ఇప్ప్పుడు జిల్లా క్రికెట్ సంఘానికి ఆయుధంగా మారింది. తాము చేసే ఎంపికలను ఆపాలని, ఏసీఏ వచ్చి సెలక్ట్ చేస్తుందని చెప్పిన పెద్దలు ఇప్ప్పుడు ఇదే సెలక్టర్లు తప్ప్పు చేశారని పేరెంట్స్ అసోసియేషన్ ఆధారాలు బయటపెట్టడంతో అసలు తప్పంతా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌లోనే ఉందన్న వాదన కూన రవి తెర మీదకు తెచ్చారు. కొద్ది రోజుల క్రితం క్రికెట్ సంఘం పేరెంట్స్ అసోసియేషన్ల మధ్య జరుగుతున్న కోల్డ్‌వార్‌ను కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లు ఏసీఏనే తీర్చేసింది. ఇన్నాళ్లూ ఎంపికలు, ఎన్నికలపై జిల్లా క్రికెట్ సంఘం మీద ఆరోపణలు ఉండేవి. ఇప్ప్పుడు ఏసీఏ నిర్వహించిన సెలక్షన్స్‌లో కూడా తమ పిల్లలకు న్యాయం జరగకపోవడంపై కొత్త అధ్యక్షుడు కూనపైనే పేరెంట్స్ అసోసియేషన్ భారం వేసింది. జిల్లాలో మాగ్జిమం కూన రవి సామాజికవర్గానికి చెందిన పేరెంట్సే అసోసియేషన్‌లో ఉన్నందున ఇప్ప్పుడు ఎన్నిక మీద కాకుండా ఇటీవల జరిగిన ఎంపికలపై అందరూ కలిసి యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తనను అధ్యక్షుడ్ని చేసిన తర్వాతే ఏసీఏ కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంపై కూన రవి సీరియస్‌గానే స్పందించారు. ఇంతవరకు ఏసీఏ వద్దకు ఎన్ని ఫిర్యాదు చేరాయి? ఎన్నింటి మీద కమిటీలు వేశారు? ఏమి చర్యలు తీసుకున్నారు? అనే దానిపై కూడా పేరెంట్స్ ముందుకు రావడానికి సిద్ధపడుతున్నారు. మరోవైపు ఏసీఏ అధ్యక్షుడు సానా సతీష్ మరోసారి రాజ్యసభకు నామినేట్ కావడంతో ఆయన్ను కూడా తక్కువ అంచనా వేయక్కర్లేదు.






Comments