top of page

కార్పొరేట్ల కోసం.. వినియోగదారుల ప్రయోజనాలు ఫణం

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Dec 5, 2024
  • 2 min read
ree

దేశంలో పునరుద్పాదక ఇంధన వనరులను అభివృద్ధి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. 2030 నాటికి 450 గెగావాట్ల ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ నేపథ్యంలోనే అదానీ గ్రూప్‌ వంటి కార్పొరేట్‌ దిగ్గజాలకు రెడ్‌కార్పెట్‌ పరచేలా కేంద్రం విధానాలను రూపొందించింది. ఆ క్రమంలో వినియోగదారుల ప్రయోజనాలను ఫణంగా పెడుతోంది. భారీ, కేంద్రీకృత సౌర విద్యుత్‌ ప్లాంట్లపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని, పునరుద్పాదక ఇంధన మంత్రిత్వ శాఖతో పాటు సెకీ కూడా వాటికి గణనీయంగా సబ్సిడీలు అందజేస్తోందన్న విమర్శలున్నాయి. దీంతో వినియోగదారులకు నేరుగా ప్రయోజనం కలిగిస్తున్న వికేంద్రీకృత సౌర విద్యుత్‌ ప్లాంట్లు దెబ్బతింటున్నాయనేది వారి ఆరోపణ. వికేం ద్రీకృత వ్యవస్థలే మేలు వికేంద్రీకృత వ్యవస్థలు ఇంధన ఉత్పత్తిపై వినియోగదారులకు అధికారాన్ని కల్పి స్తాయి. బడా కార్పొరేట్‌ సంస్థల ఆధిపత్యానికి గండి కొడతాయి. వినియోగదారులు మిగులు విద్యుత్‌ను ఉత్పత్తి చేసి, దానిని తిరిగి గ్రిడ్‌కు విక్రయించవచ్చు. సొంత విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా విని యోగదారులు గ్రిడ్‌పై ఆధారపడడం తగ్గుతుంది. వారి ఇంధన బిల్లులు కూడా తగ్గుతాయి. కార్పొరేట్‌ సంస్థలకు సబ్సిడీల పంట కేంద్రీకృత సౌర విద్యుత్‌ ప్లాంట్లను లాభాల బాట పట్టించేందుకు ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు గణనీయంగా సబ్సిడీలు అందిస్తోంది. నూతన-పునరుద్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, సెకీ సంయుక్తంగా సబ్సిడీల అందజేతకు శ్రీకారం చుట్టాయని, అది పన్ను చెల్లింపుదారుల నుంచి సమకూరిన సొమ్మేనని గుర్తించాలి. అంటే పౌరులు తమ డబ్బుతో కార్పొరేట్‌ సంస్థలు నిర్వహించే ప్రాజెక్టులకు లాభాలు సంపాదించి పెడుతున్నారని అర్థం. పౌరుల సంక్షేమం కంటే కార్పొరేట్‌ ప్రయోజ నాలకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందనడానికి ఇది స్పష్టమైన ఉదాహరణ. అయితే ప్రభుత్వం, సెకీ మద్దతు లభిస్తున్నప్పటికీ ఈ ప్రాజెక్టులు మనుగడ సాగించలేకపోతున్నాయి. యూనిట్‌ ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలంటే చాలా ఖర్చు అవుతోంది. దీంతో అమ్మకపు ధర కూడా అధికంగానే ఉంటోంది. ఫలితంగా మార్కెట్‌లో డిమాండ్‌ ఉండడంలేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు సెకీ ప్రయత్నించింది. కొనుగోలు దారులు లేని పక్షంలో కంపెనీలు స్వచ్ఛందంగా ధరలను తగ్గించేందుకు అది అనుమతించింది. రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) విద్యుత్‌ను కొనుగోలు చేస్తాయని ఆశించింది. కానీ గత రెండు సంవత్సరాల కాలంలో 9,046 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 19 లేదా 20 ప్రాజెక్టులు వినియోగదారు లను ఆకర్షించడంలో విఫలమయ్యాయి. ఈ పరిస్థితుల్లో విద్యుత్‌ మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. కార్పొరేట్‌ సంస్థలకు అనువైన వాతావరణాన్ని కల్పించింది. కృత్రిమ బొగ్గు కొరత సౌర విద్యుత్‌ రంగం లో అవినీతి చోటుచేసుకోవడానికి మంత్రిత్వ శాఖ నేరుగా ఆస్కారం కల్పించింది. రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు తమ అవసరాల్లో కనీసం 10 శాతం మేర కేంద్రీకృత సౌర విద్యుత్‌ ప్లాంట్ల నుండి పొందాలని ఆదేశాలు జారీ చేసింది. అదానీ గ్రూప్‌ వంటి కార్పొరేట్‌ సంస్థలు, విదేశాలకు చెందిన అజూర్‌ కంపెనీ ఈ ప్లాంట్లను నెలకొల్పాయి. ధర ఎంతైనా సరే రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు వీటి నుండే కొంతమేర కొనుగోళ్లు జరపాలని కేంద్రం హుకుం జారీ చేసింది. విదేశాల్లో బొగ్గు గనులను కలిగి ఉన్న కార్పొరేట్‌ సంస్థలకు లబ్ది చేకూర్చడానికి ఇంధన మంత్రిత్వ శాఖ బొగ్గు, రైల్వే శాఖలతో కలిసి కృత్రిమంగా బొగ్గు కొరతను సృష్టించినట్లు ఆరోపణలున్నాయి. బొగ్గు మార్కెట్‌లో చోటుచేసుకున్న ఈ పరిణామాల కారణంగా విని యోగదారులపై విద్యుత్‌ ఛార్జీల భారం అధికమైంది. అదే సమయంలో కార్పొరేట్‌ సంస్థల లాభాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. సెకీ వంటి వ్యవస్థలు మధ్యవర్తిత్వం వల్ల కార్పొరేట్ల సౌర విద్యుత్‌ను విక్ర యించేందుకు, వినియోగదారుల ప్రతిఘటన నుండి కంపెనీలను కాపాడేందుకు మాత్రమే పనికొస్తు న్నాయి. ప్రభుత్వ ఒత్తిడికి తలవంచిన సెకీ పాతిక సంవత్సరాల విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు చేసు కునేలా రాష్ట్రాలను బలవంతపెట్టడమే గత కొన్నేళ్లుగా విద్యుత్‌ ధరలు పెరగడానికి కారణం. దీర్ఘకాలిక కాంట్రాక్టుల కారణంగా రాష్ట్రాలు, వినియోగదారులు నిర్ధారిత ధరకు సౌర విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిరది. భవిష్యత్తులో సౌర విద్యుత్‌ ధరలు తగ్గినప్పటికీ రాష్ట్రాలు చేయగలిగింది ఏమీ ఉండదు. అదానీ గ్రూపుపై అమెరికా ప్రాసిక్యూటర్లు ఛార్జిషీటు దాఖలు చేసినప్పటికీ సెకీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. గతంలో ఇదే తరహా ఉల్లంఘనలకు పాల్పడిన ఇతర కంపెనీలపై సెకీ చర్య లు తీసుకుంది. ఇందుకు అనేక ఉదాహరణలున్నాయి. కాకపోతే అందరికీ బీజేపీ అంటే భయం.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page