
హాశ్చర్యకరమైన ఓ యాడ్..!!
నేలనడిగా, పువ్వులనడిగా.. ఆమె ఎవరు, ఏమిటనీ..గాలినడిగా, మబ్బులనడిగా.. ఆమెపై ఈ ప్రేమేమిటనీ..
పత్రికల్లో ఓ యాడ్ చూశాక ఇలా ఓ పేరడీ మదిలో తట్టింది. ఫాఫం.. ఆ యాడ్ ఏమిటంటే..? ఎన్టీయార్ కుటుంబం అందరి పేర్లతో, అంటే మూకుమ్మడిగా, అంటే సామూహిక ప్రేమతో, అంటే చెదిరిపోని అభిమానంతో, అంటే..? ఎట్సెట్రా..
ఆ యాడ్ ఏమిటయ్యా అంటే..? ఇదుగో ఇదీ..
ఆహా.. ఎన్టీయార్ భారీ కుటుంబం ఎప్పుడైనా ఎన్టీయార్ జయంతిరోజో, వర్ధంతిరోజో ఓ యాడ్ ఇస్తుంది. మొత్తం కుటుంబసభ్యులందరి పేర్లూ ఉంటాయి. అంటే, ఎన్టీయార్ కొడుకులు, కూతుళ్ల పేర్లతో.. నివాళి యాడ్ అది.
నడుమ జూనియర్ ఎన్టీయార్ యాడ్ కనిపించేది ‘మళ్లీ ఎప్పుడు పుడతావు తాతా’ అని.. అక్కడికి తనొక్కడికే మనమడు అయినట్టు! మరే మనవరాలు, మరే మనవడూ స్పందించడు. ఎంత మంది ఉన్నారో తెలియదు. తారకం వర్ధంతి, జయంతి కూడా వీళ్లకు గుర్తుండవు, ఏ యాడ్సూ ఉండవు.. ఆ కోణంలో జూనియర్ చాలా చాలా నయం.. బాలయ్యకు నచ్చకపోయినా సరే.. కానీ మరి ఆ రేంజులో ఎవరో కృష్ణవేణి అనే నటికి శ్రద్ధాంజలి ఘటించింది ఈ కుటుంబం. రేర్, అద్భుత విశేషం.. ఇంతకీ ఎవరబ్బా? సినిమా ప్రెస్‌మీట్లలో తమ తెలివితేటలన్నీ ప్రదర్శించే మరీ పెద్ద పెద్ద భారీ తలకాయల జర్నలిస్టులు ఏమైనా రాశారేమో చూస్తే ఏమీ కనిపించలేదు. జగన్ మీద ప్రేమతో సోకాల్డ్ యెల్లో క్యాంపుపై తెల్లారిలేస్తే విద్వేషం చిమ్మే వెబ్‌సైట్లు చూస్తే అక్కడా ఏమీ లేదు.
పోనీ, పాత తారల అఫయిర్స్ గట్రా నోటికొచ్చినట్టు కూసే వాళ్ల వీడియోలు పరికిస్తే కనిపించలేదు. వికీని అడిగితే అవునోయ్, ఆమె ఎన్టీయార్, ఎస్వీయార్, ఘంటసాల, రమేష్‌నాయుడు గట్రా మహామహుల్ని పరిచయం చేసిన నిర్మాత, రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డు గ్రహీత అని చెప్పింది.
కృష్ణవేణి.. ఫాఫం, సాక్షి కూడా లైఫ్‌టైమ్ ఎఛీవ్‌మెంట్ అవార్డు ఇచ్చి తనను తాను సత్కరించుకుంది. అవన్నీ సరే, ఆమెకు ఈ రేంజ్ శ్రద్ధాంజలి, అదీ మరెవరినీ పట్టించుకోని ఎన్టీయార్ కుటుంబం నుంచి.. సర్‌ప్రయిజింగ్.. ఎందుకు ఈ అపరిమిత, అనూహ్య ప్రాధాన్యం..? ఆయన నటజీవితంలోకి చాలామంది తారలు వచ్చి వెళ్లారు, ఈమె స్పెషాలిటీ ఏమిటి..?
ఈ కుటుంబం ద్వేషానికీ, ప్రేమకూ ఓ బేస్ ఉంటుంది. లక్ష్మీపార్వతి అంటే ద్వేషం, వోకే, రీజనబుల్.. ఎన్టీయార్‌ను ఆమె భ్రష్టుపట్టించిందనే భావన తెలుగు జనంలో ఉంది. ఒక్క జగన్‌కు తప్ప! జూనియర్ ఎన్టీయార్ తల్లి మీద అదే కోపం.. కారణం, జూనియర్ ఎక్కడ ఎన్టీయార్‌కు రాజకీయ, నట వారసుడు అవుతాడో అని..
ఎవరు ఎవర్ని ఆపగలరు..? ఆ జూనియర్‌కు దీటుగా ఎవరో నిజవారసుడు అంటూ తారకరత్నను ఇండస్ట్రీలో నిలబెట్టాలనుకుని విశ్వప్రయత్నం చేసినా ఏమైంది..? మెరిట్ మ్యాటర్స్.. సరేగానీ ఈ కృష్ణవేణికి ఇంత ప్రాధాన్యం, అదీ ఎవరూ పట్టని ఎన్టీయార్ కుటుంబం నుంచి..? ఏమిటబ్బా.. ఏమిటీ రీజన్.. ఈ డొల్ల జర్నలిస్టులు కాదు గానీ, ఇంకెవరైనా అన్నీ తెలిసిన సినీ ప్రముఖులు, కాస్త క్రెడిబులిటీ ఉన్నవాళ్లు చెప్పగలిగితే బాగుణ్ను..!!
.
Comments