top of page

కాసులు ఇచ్చుకో.. రికార్డులు మార్చుకో!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Apr 14
  • 3 min read
  • భూముల రీసర్వేలో మాయాజాలం

  • క్షేత్రస్థాయికి వెళ్లని వీఆర్వోల నిర్లక్ష్యమే కారణం

  • ముడపులందుకుని వివరాలు మార్చేస్తున్న వైనం

  • యాంత్రికంగా ఓకే చేసేస్తున్న తహసీల్దార్లు

  • ‘గేదెల’ కుటుంబ భూములకు తప్పుడు పత్రాలే నిదర్శనం

గ్రామ సర్వేయర్లే ఆన్‌లైన్ చేస్తున్న దృశ్యం (పాత చిత్రం)'
గ్రామ సర్వేయర్లే ఆన్‌లైన్ చేస్తున్న దృశ్యం (పాత చిత్రం)'

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

వారసత్వ భూములు ఎటువంటి పత్రాలు లేని వ్యక్తుల పేరిట రీసర్వే రికార్డుల్లో నమోదవుతున్న ఘటనలు భూయజమానుల్లో ఆందోళన రేపుతున్నాయి. శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలు దాటిన తర్వాత అప్పలరాజు సత్రం ఎదురుగా ప్రధాన రహదారికి అనుకుని ఉన్న కోట్ల విలువైన భూమినే కొందరు రియల్ ఎస్టేట్ బాబులు తప్పుడు పత్రాలు సష్టించి అమ్మకానికి పెట్టేయడమే దీనికి ప్రబల తార్కాణం. ఒక ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన భూమికే తప్పుడు యాజమాన్య పత్రాలు సష్టించడానికి ఇటీవలి భూముల రీసర్వే కార్యక్రమమే దోహదం చేస్తున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో వీఆర్వోల నిర్లక్ష్యం, ముడుపుల భాగోతాలే ఈ తరహా అక్రమాలకు కారణమవుతున్నాయి. ఒక భూమి హక్కుదారులను నిర్థారించాలంటే సర్వే చేయాలి. దానికి ముందుగా సర్వే నెంబర్లు ప్రకటించి వాటి పరిధిలో ఉన్న రైతులకు వీఆర్వోలు నోటీసుల ద్వారా సర్వే ఎప్పుడు జరుపుతారన్నది ముందే తెలియజేయాల్సి ఉంటుంది. నోటీసులు అందుకున్న రైతులు సర్వే చేసే చోటకు వచ్చి తమ పేరి{ ఉన్న భూముల వివరాలను చూపించి సర్వే చేయించుకోవాలి. అయితే చాలాచోట్ల వీఆర్వోల పేరుతో గ్రామ సర్వేయర్లే నోటీసులు ఇస్తున్నారు. దానికితోడు సర్వేకు వచ్చే రైతులు చెప్పే వివరాలు క్షేత్రస్థాయిలో సరిపోలుతున్నాయా లేదా అనేది నిర్థారించకుండానే రికార్డుల్లో వారి పేరిట నమోదు చేసేస్తున్నారు. ఇదే అదనుగా నోటీసులు అందుకున్న భూ యజమానులు కాకుండా భూమితో సంuంధం లేని వ్యక్తులు వచ్చి ఆ భూమి తమదని చెప్పి రికార్డుల్లో నమోదు చేయిస్తున్న ఉదంతాలు ఉన్నాయి. వాస్తవానికి రీసర్వే, వివరాల నమోదు వంటివి వీఆర్వో సమక్షంలోనే జరగాలి. సమస్యలేమైనా ఉంటే వారే పరిష్కారం చూపాలి. కానీ 90 శాతం వీఆర్వోలు, సర్వే డీటీలు క్షేత్రంలోకి రాకపోవడం వల్ల రీసర్వేలో వేరే వ్యక్తులు పేర్లు, తప్పుడు భూ విస్తీర్ణం నమోదవుతున్నాయి.

యథాలాపంగా..

డ్రోన్ మ్యాప్, రోవర్స్ ద్వారా కొలతలు వేసి భూ యజమాని సహా పూర్తి వివరాలను సర్వేయర్లు నమోదు చేసి ఆ రికార్డును వీఆర్వోకు అందిస్తున్నారు. దాన్ని వీఆర్వో పరిశీలించి 15 రోజుల్లోగా తప్ప్పులు సరిదిద్ది ఆన్‌లైన్ చేయాలి. కానీ వారు ఆ పని చేయకపోవడంతో సర్వేయర్లే కానిచ్చేస్తున్నారు. దీన్నే వీఆర్వో ఒకే చేసి తáహసీల్దారు లాగిన్‌కు పంపిస్తున్నారు. తహసీల్దారు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం టైటిల్ వెరిఫికేషన్ చేసి నిర్దేశిత ఆరు రోజుల గడువులోగా డిజిటల్ సైన్ చేసి ఆర్డీవోకు పంపిస్తున్నారు. ఆర్డీవో కార్యాలయం తహసీల్దారు పంపించిన వివరాల్లో చెరువు, కాలువలు, ప్రభుత్వానికి చెందిన భూములు, నిషేధిత జాబితాలోనివి ఉన్నాయా.. ఆ మేరకు తగిన మార్పులు, చేర్పులు చేశారా లేదా అని మాత్రమే చూసి జేసీ లాగిన్‌కు పంపించేస్తున్నారు. క్షేత్రస్థాయిలో వచ్చిన ఫిర్యాదులకు పరిష్కారం చూపించారా? లేదా? అన్నది మాత్రమే ఆరా తీసి జాయింట్ కలెక్టర్ క్లియరెన్స్ ఇస్తారు. దీంతో రీసర్వే రికార్డుల్లో నమోదైన వివరాలతో పాస్‌బుక్ జనరేట్ అవుతుంది. రీసర్వేలో గ్రామస్థాయిలో రికార్డులను పరిశీలించాల్సిన వీఆర్వోలు నిర్లక్ష్యం వహిస్తుండగా, తహసీల్దార్లు కూడా వారిపైనే పూర్తిగా ఆధారపడటం వల్ల రీసర్వేలో తప్ప్పులు దొర్లుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామ సర్వేయర్లు ఇచ్చే రికార్డుల్లో రైతుల పేర్లు, భూముల వివరాలను వీఆర్వో స్థాయిలోనే మార్పులు చేసే అవకాశం ఉంది. అలాగే వీఆర్వో ఇచ్చే ఆన్‌లైన్ రికార్డులోనూ సరిచేసి రైతులకు భూ హక్కులు (టైటిల్) కల్పించే అధిóకారం తహసీల్దార్లకు ఉంది. అయితే రికార్డులతో సంuంధం లేకుండా భూ హక్కులు కల్పించి పాస్ పుస్తకాలు అందజేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో సమగ్ర భూసర్వే ప్రారంభమైనప్పుడు గ్రామాల్లో వైకాపా నాయకులు రీసర్వేలో జోక్యం చేసుకోవడం వల్ల రికార్డుల్లో అనేక దిద్దుబాట్లు జరిగాయని ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఆందోళన వ్యక్తం చేసింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పొరపాట్లు సరిదిద్దడానికి గ్రామసభలు నిర్వహించినా పూర్తిస్థాయిలో పరిష్కరించáలేకపోయారు. వైకాపా హయాంలో జారీ చేసిన పాస్‌పుస్తకాల స్థానంలో కొత్త పుస్తకాలు పంపిణీ చేసినా భూవిస్తీర్ణంలో జరిగిన పొరపాట్లను మాత్రం రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన మూడు, నాలుగు విడతల సర్వేలోనూ ఇవే తప్ప్పులు పునరావతం అవుతున్నాయి. సర్వే డీటీలు, వీఆర్వోలు సర్వే విధులు తప్ప మిగతా పనులన్నింటినీ చక్కబెడుతున్నారు. ఇప్పటికీ రీసర్వేలో గ్రామ సర్వేయర్లపైనే భారం మోపి రెవెన్యూ అధికారులు తప్పుకొంటున్నారు.

పెద్దలే సూత్రధారులు

అన్ని హక్కులు కలిగిన తనను కాకుండా వేరే వ్యక్తి పేరును రీసర్వేలో నమోదు చేయడాన్ని సదరు యజమాని సవాల్ చేస్తే దాన్ని పరిష్కరించాల్సిన బాధŠ్యత తహసీల్దారుదే. సంబంధిత అన్ని పత్రాలు పరిశీలించి రీసర్వేలో జరిగిన తప్ప్పును సరిదిద్దాలి. కానీ అలా జరగడం లేదు. రీసర్వే సమయంలో కొందరు గ్రామపెద్దలు దళారులుగా వ్యవహరించి రీసర్వే రికార్డుల్లో తప్పుడు వివరాల నమోదుకు రూ.వేలల్లో వసూలుకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వలసలు, ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు వంటి కారణాలతో రీసర్వే సమయంలో చాలామంది భూ యజమానులు, హక్కుదారులు అందుబాటులో ఉండలేని వారు గ్రామపెద్దలను ఆశ్రయించి తమ పేర్లను రికార్డుల్లో నమోదు చేయించాలని కోరుతున్న ఉదంతాలు ఉన్నాయి. అయితే ఆ పని చేయించడానికి కొంత ఖర్చవుతుందని చెప్పి వసూలు చేస్తున్న పెద్దలు కూడా ఉన్నారు. ఇదే కోవలో భూమితో సంబంధం లేనివారి పేర్లను కూడా రీసర్వేలో నమోదు చేయించినట్టు విమర్శలున్నాయి. రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే రీసర్వేలో అక్రమాలు జరిగాయని, తప్పులు దొర్లాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page