గద పట్టుకొన్న రాముడు
- Guest Writer
- Mar 28
- 3 min read

‘పెద్ది’పై రోజు రోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, రెండు పాటలూ ఫ్యాన్స్‌కి నచ్చేశాయి. పాటలైతే... యూట్యూబ్‌లో కొత్త రికార్డుల్ని సృష్టించాయి. ఇప్పుడు రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా గ్లింప్స్ విడుదల చేశారు. 45 సెకన్ల ఈ గ్లింప్స్‌లో చరణ్ వన్‌మాన్ షో కనిపించింది. చరణ్ తప్ప.. ఎవరిపైనా కెమెరా ఫోకస్ చేయలేదు. ఒకవేళ మరొకరు ఉన్నా, కళ్లు చరణ్‌పై మాత్రమే ఉంటాయి. ఎందుకంటే చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆ రేంజ్‌లో ఉంది. కండలు తిరిగిన దేహం, చేతిలో గద..మైదానంలో కుస్తీ పట్లు.. ఈ యాక్షన్ హంగామా అంతా ఫ్యాన్ఫ్‌కి నచ్చేలా ఉంది.
ఇప్పటి వరకూ ‘పెద్ది’ అంటే క్రికెట్టే అనుకొన్నారు. కానీ ఇప్పుడు ‘కుస్తీ’ కూడా వచ్చింది. మైదానంలో చరణ్ కుస్తీ కోసం రంగంలోకి దిగడం ‘ఆటేనా పొగరు’ అని చెప్పడం.. ఇవన్నీ చరణ్ క్యారెక్టర్‌ని మరింత ఎలివేట్ చేశాయి. చరణ్‌ని ఇప్పటి వరకూ ఇలా చూడలేదు అభిమానులు. బుచ్చిబాబు చరణ్‌ని కొత్తగా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ‘పెద్ది’లో ఇప్పటి వరకూ క్రికెట్, కుస్తీ చూపించారు. అయితే వీటికి మించిన ఆటలెన్నో పెద్దిలో ఉండబోతున్నాయి. అవన్నీ ఒకొక్కటిగా రివీల్ చేయబోతున్నారు.
ఏప్రిల్ 30న ‘పెద్ది’ని రిలీజ్ చేస్తామంటూ నిర్మాతలు మరోసారి ధైర్యంగా ప్రకటించారు. సినిమా వాయిదా పడుతుందేమో అనుకొంటున్న ఈ తరుణంలో మరోసారి అదే రిలీజ్ డేట్ ని ఎనౌన్స్ చేయడం నిర్మాతల గట్ ఫీలింగ్ తెలియజేస్తోంది. ఫ్యాన్స్ కూడా ఈ సినిమా వాయిదా పడకూడదనే కోరుకొంటున్నారు.
- తెలుగు 360.కామ్ సౌజన్యంతో...
ముత్యాల మధ్య మంచి ముత్యం కియరా

స్టైల్ ఐకాన్ కియారా అద్వానీ తాజాగా గ్రాజియా మ్యాగజైన్ కవర్ పేజీ కోసం ప్రత్యేకమైన డిజైనర్ లుక్‌లో మెరిపిసోయింది. శరీరమంతా ముత్యాల అల్లికతో తీర్చిదిద్దిన తెలుపు రంగు డిజైనర్ దుస్తుల్లో మెరిసిపోతోంది. నిన్న జరిగిన అవార్డుల వేడుకలో తన ఫ్యాషన్ సెన్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచిన కియారా.. ఇప్పుడు ఈ సరికొత్త లుక్‌తో మరోసారి నెట్టింట సెన్సేషన్ సృష్టిస్తోంది. ప్రముఖ డిజైనర్ క్రేషా బజాజ్ రూపొందించిన ఈ ప్రత్యేకమైన వైట్ అండ్ వైట్ డ్రెస్సులో కియారా ఒక అందమైన శ్వేత వర్ణపు అప్సరసలా కనిపిస్తోంది.
ఈ డిజైనర్ వేర్‌లో కియారా ధరించిన బ్రాలెట్.. రఫుల్డ్ ట్యూనిక్ బ్లౌజ్ .. పూసల అల్లికతో కూడిన ట్రౌజర్స్ తనకు ఒక రాయల్ లుక్‌ను ఇచ్చాయి. ముఖ్యంగా డ్రెస్ మొత్తం ముత్యాల వంటి పూసల అల్లికతో ఎంతో ముగ్ధమనోహరంగా ఉంది. టాప్ టు బాటమ్ వైట్ అండ్ వైట్ థీమ్‌లో కియారా తన అందంతో అభిమానుల మనసు దోచుకుంటోంది. ఈ ఫోటోషూట్‌లో కియరా మేకప్, హెయిర్ స్టైల్ కూడా ఈ డ్రెస్సుకి తగ్గట్టుగా ఎంతో పర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యాయి.
కేవలం దుస్తులే కాకుండా ఆభరణాలు కూడా ఈ లుక్‌కి మరింత గ్లామర్‌ను అద్దాయి. మీరారీ జువెల్స్ నుండి `ఇన్సిగ్నియా` ఇయర్ రింగ్స్‌తో పాటు జాంబియన్ ఎమరాల్డ్, బ్రెజిలియన్ సిట్రిన్ కలిసిన 18 క్యారెట్ల బంగారు దుద్దులను కియారా ధరించింది. అలాగే అజ్గా బ్రాండ్‌కు చెందిన గోల్డ్ ప్లేటెడ్ రింగ్ తన వేలికి మరింత అందాన్ని తెచ్చింది. ప్రతి చిన్న విషయంలోనూ జాగ్రత్త వహించి ఈ కవర్ పేజీ షూట్‌ను ఎంతో గ్రాండ్‌గా ప్లాన్ చేయడం ఆసక్తిని కలిగించింది.
ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న కియారా.. ఈ ముత్యాల అల్లిక డ్రెస్సులో `మంచి ముత్యం`లా మెరిసిపోతూ కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తోంది. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు కియారా స్టైల్‌కు ఫిదా అవుతున్నారు. ఒకవైపు తన నటనతో.. మరోవైపు తన అదిరిపోయే ఫ్యాషన్ ఛాయిస్‌లతో కియారా 2026లో తన జోరును కొనసాగిస్తోంది.
గీతూ మోహన్ దాస్ `టాక్సిక్`లో కియారా పాత్ర:
దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న `టాక్సిక్` సినిమాలో కియారా అద్వానీ `నాడియా` అనే పాత్రను పోషిస్తోంది. ఈ పాత్ర గురించి గీతూ మాట్లాడుతూ.. నాడియా పాత్రలో ఒకవైపు సున్నితత్వం.. మరోవైపు తీవ్రత రెండూ సమానంగా ఉంటాయని.. అందుకే ఈ పాత్రకు కియారా తప్ప మరెవరూ సెట్ అవ్వరని తాను ముందే నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కియారా స్క్రీన్ ప్రెజెన్స్‌లో ఒక ఘాఢమైన మానవీయ కోణం కనిపిస్తుందని.. ఆమెను ఈ పాత్ర కోసం ఎంచుకోవడం కేవలం లాజిక్ కాదని.. అది ఒక బలమైన భావోద్వేగమని గీతూ వెల్లడించారు.
సినిమా విషయంలో కియరా క్రమశిక్షణ, నిబద్ధతపైనా ప్రశంసలు కురిపించారు గీతూ.. టాక్సిక్‌తో పాన్ ఇండియన్ స్టార్‌గా కియరా మరోస్థాయిని అందుకుంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.
- తుపాకి.కామ్ సౌజన్యంతో..
అవును.. వాళ్లిద్దరూ కలుస్తున్నారు?

టాలీవుడ్‌లో పూజాహెగ్డేను బాగా ఎంకరేజ్ చేసిన దర్శకుల్లో త్రివిక్రమ్ ఒకరు. సమంత తర్వాత ఆయన ఎక్కువగా ఇష్టపడింది పూజా హెగ్డేనే. వరుసగా ఆమెను తన సినిమాల్లో తీసుకునే ప్రయత్నం చేశారు. కానీ గుంటూరు కారం విషయానికొచ్చేసరికి లెక్క తప్పింది. అప్పటికే ఫ్లాపుతో ఇబ్బంది పడుతున్న పూజా హెగ్డేను ఆఖరి నిమిషంలో ప్రాజెక్టు నుంచి తప్పించారు. ఆమె తప్పుకుందా, యూనిట్ తప్పించిందా అనే విషయాన్ని పక్కనపెడితే.. పూజా హెగ్డేకు అప్పట్నుంచి హిట్స్ లేకుండా పోయాయి. గతేడాది కూలి సినిమాలో చేసిన స్పెషల్ సాంగ్ మాత్రమే ఆమెకు అంతోఇంతో కలిసొచ్చింది. తెలుగులో మాత్రం పెద్ద హీరోల సినిమాల్లో ఆమె కనిపించలేదు. మళ్లీ ఇన్నాళ్లకు త్రివిక్రమ్ నుంచి పూజాహెగ్డేకు పిలుపొచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వెంకటేశ్‌తో చేస్తున్న సినిమా కోసం పూజాహెగ్డే పేరును పరిశీలిస్తున్నారట. వెంకీతో ఆదర్శకుటుంబం అనే సినిమా చేస్తున్నారు త్రివిక్రమ్. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌ను పూజాహెగ్డేతో ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం మొదలైంది. అదే కనుక జరిగితే, చాన్నాళ్ల తర్వాత త్రివిక్రమ్-పూజాహెగ్డే కలిసినట్టవుతుంది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా భారీ షెడ్యూల్ పూర్తిచేశారు. దాదాపు నెల రోజుల పాటు ఈ కీలకమైన షెడ్యూల్ జరిగినట్టు సినిమాటోగ్రాఫర్ రవి కె.చంద్రన్ ప్రకటించాడు. త్వరలోనే కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. అప్పటికి పూజాహెగ్డే ఎంట్రీపై స్పష్టత వస్తుందేమో చూడాలి.
- గ్రేటాంధ్ర సౌజన్యంతో..






Comments