top of page

గంజాయి ముఠాలో కీలకం 65

Writer: ADMINADMIN
(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)



జిల్లాలో వేలాది మంది యువత గంజాయి మత్తులో జోగుతుం డటం, అందులోనే నేరాలకు, ఘోరాలకు పాల్పడటం వెనుక 65 మంది కీలకంగా ఉన్నట్టు జిల్లా పోలీసు యంత్రాంగం గుర్తించిం దని విశ్వసనీయ వర్గాల భోగట్టా. ఇంతవరకు గంజాయి మీద ఉక్కుపాదం మోపేవారు లేకపోవడంతో రాష్ట్రాలు దాటి రవాణా అవుతున్న గంజాయి వెనుక అటు ఒడిశా, ఇటు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 65 మంది కీలక నిందితులు ఉన్నట్టు తెలుస్తుంది. ఇటీవల శ్రీకాకుళం ఎస్పీ కేవీ మహేశ్వర్‌రెడ్డి ఒడిశా రాష్ట్రం గంజాం ఎస్పీతో మాట్లాడారు. జిల్లాలో గంజాయి ఒడిశా నుంచే ప్రధానంగా వస్తుందని, ఇందుకు సంబంధించి రెండు జిల్లాల పోలీసు యం త్రాంగం సహకరించుకోవాల్సి ఉందని పిలుపునివ్వడంతో ఒడిశాలో గంజాయిని ఆంధ్రాకు పంపిస్తున్నవారి వివరాలను ఎస్పీకి అందజేసి నట్లు తెలుస్తుంది. వీరి నుంచి జిల్లాలో ఎవరెవరు కొనుగోలు చేస్తున్నారని ఇక్కడి పోలీసులు ఆరా తీయడంతో ఆంధ్రా`ఒడిశా కలిపి 65 మంది ఈ గంజాయి రవాణా, విక్రయంలో కీలకంగా వ్యవహరిస్తున్నారని తేలింది. ప్రస్తుతం వీరంతా అజ్ఞాతంలో ఉన్నట్టు భోగట్టా. రెండు రాష్ట్రాల సయోధ్య మేరకు జిల్లాలో నాలుగు చెక్‌పోస్టులను ఎస్పీ ఏర్పాటు చేశారు. ఇందులో నిత్యం తనిఖీలు జరుగుతుండటంతో ఎక్కడికక్కడ ఆమధ్య గంజాయి పట్టుబడిరది. ఆంధ్రా బోర్డర్‌ వరకు తీసుకువస్తున్న ఒడిశా వ్యాపారులు ఆంధ్రాలో ఇచ్ఛాపురం, మెళియాపుట్టి, పాతపట్నం వంటి ప్రాంతాల నుంచి తరలిస్తున్నట్టు తేలింది. గతంలో కేవలం ముడిగంజాయి మాత్రమే సరఫరా అయ్యేది. ఇప్పుడు గంజాయి సిగరెట్లు తయారుచేసి పంపిణీ చేస్తున్నట్టు పోలీసు నిర్ధారణలో తేలినట్టు భోగట్టా, తాజాగా గంజాయి అమ్ముతున్న నలుగుర్ని స్థానిక టూటౌన్‌ పోలీసులు శుక్రవారం సాయంత్రం పట్టుకోగా, అందులో బాకర్‌సాహెబ్‌పేటకు చెందిన 16 ఏళ్ల మైనర్‌ బాలుడు ఉండటం కొసమెరుపు. ఎక్కువగా రవాణాలో మైనర్లనే వాడుకుంటున్నట్టు తేలింది.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page