top of page

చిత్ర రంగంలో బంగారు బుల్లోడు బాలయ్య

Writer: ADMINADMIN
  • వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు

  • అన్నాక్యాంటీన్‌కు రూ.20వేలు అందించిన అభిమానులు

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం అర్బన్‌)

రాజకీయ, సీనీరంగాల్లో అఖండ విజయాలు సాధిస్తూ అగ్రగామిగా నిలిచిన బంగారు బుల్లోడు నందమూరి బాలకృష్ణ అని వ్యవసాయ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. బాలకృష్ణ నటుడిగా అరంగ్రేటం చేసి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా ఎన్టీఆర్‌ మోక్షజ్ఞ సేవా సంఘం, డేవిడ్‌ మాదారపు టీం ఆధ్వర్యంలో జిల్లా నందమూరి బాలయ్య, మోక్షజ్ఞ ఫ్యాన్స్‌ అధ్యక్షులు మాదారపు వెంకటేష్‌ సమక్షంలో ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు, ఎంఎల్‌ఏ గొండు శంకర్‌ కేక్‌ కట్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అన్నా క్యాంటీన్‌ నిర్వహణకు రూ.20వేలు చెక్‌ను మంత్రి ద్వారా ఎమ్మెల్యే గొండు శంకర్‌కు మాదారాపు వెంకటేష్‌, డేవిడ్‌ కలిసి అందించారు. అనంతరం అతిధులు మాట్లాడుతూ బాలయ్య నటుడిగా అన్ని రకాల పాత్రలు పోషిస్తూ అద్భుత విజయాలు సాధిస్తూ తెలుగు చిత్రరంగంలో నెంబర్‌వన్‌గా కొనసాగుతూనే బసవతారక క్యాన్సర్‌ హాస్పిటల్‌ ద్వారా సేవలందిస్తూ రాజకీయ రంగంలో హిందూపురం శాసనసభ్యులుగా మూడుసార్లు ఘన విజయాలు సాధించి ఎంతో అభివృద్ధి చేశారన్నారు. సీనియర్‌ ఎన్టీఆర్‌తో తాతమ్మ కల చిత్రం ద్వారా 1974 ఆగస్టు 30న చిత్రం విడుదలైందని, ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిగడిరచి గొప్ప నటులు, ప్రజాసేవకులుగా గుర్తింపు పొందారన్నారు. అభిమానులు బాలయ్య స్ఫూర్తితో సమాజానికి ఉపయోగపడే ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కింజరాపు హరిప్రసాద్‌, మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పైడిశెట్టి జయంతి, కూన రామారావు, కొర్ను నాగార్జున ప్రతాప్‌, ఎన్టీఆర్‌, మోక్షజ్ఞ టీం సభ్యులు సురేంద్ర, సురేష్‌, భాస్కర్‌, రాజు, ప్రదీప్‌, మహేష్‌, మణి, తారక్‌, వెంకీ, మోహన్‌, కోరాడ బాబు, అంధవరపు సంతోష్‌, గొండు వెంకటరమణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page