బంగారం కోసం మహిళపై దాడి
స్థానికులు కేకలు వేయడంతో నిందితుడు పరారీ
మరో మహిళ పుస్తెలతాడు చోరీ
(సత్యంన్యూస్, ఇచ్ఛాపురం)

ఇచ్ఛాపురం పరిసరాల్లో దొంగలు బీభత్సం సృష్టించారు. బంగారం కోసం ఒక మహిళపై కవిటి సమీపంలో దాడి శారు. అలాగే మరో మహిళ నుంచి 3 తులాల పుస్తెలతాడు ఈదుపురం సమీపంలో చోరీ చేశారు. కవిటి మండలం బొర్రపుట్టుగ సమీపంలో మహిళా ఉపాధ్యాయిని బల్లెడ భారతిపై హత్యయత్నం చేశారు. వెనుక నుంచి వచ్చి భారతి తలపై రాయితో కొట్టాడు. ఆపై బంగారం గొలుసు చోరీకి ప్రయత్నించగా, పెనుగులాటలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించడంతో నిందితుడు పరారయ్యాడు. స్థానికులు కవిటి ప్రభుత్వ ఆసుపత్రికి బాధిత మహిళను తరలించారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments