చెమటచుక్క చిందకుండానే చక్కదిద్దారు!
- Prasad Satyam
- Jun 18
- 1 min read
వివాదాల కరజాడలో అభివృద్ధి జాడ
50 ఏళ్ల సమస్యకు సుఖాంతం
ఎమ్మెల్యే చతురత.. రైతుల సహకారం
మురుగు కాలువ పనులు ప్రారంభం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
శ్రీకాకుళం రూరల్ మండలం కరజాడ అంటే జిల్లాలో తెలియనివారు ఉండకపోవచ్చు. కరజాడ ఎక్కడుంది అని అడిగితే చెప్పలేకపోవచ్చేమో గానీ, ఇసుక తరలింపు అంశం తెరమీదకు వచ్చిన ప్రతీసారి పత్రికల్లో ప్రధాన శీర్షికల్లో కనిపించే పేరు భైరి, కరజాడ. ఇటువంటి కరజాడ గ్రామానికి కాలువలు నిర్మించి, ఆ నీటిని పక్కనే ఉన్న వంశధారలోకి మళ్లించే పని మాత్రం తరాలుగా జరగలేదంటే నమ్మశక్యం కాదు. గత ప్రభుత్వం మురుగుకాల్వల నిర్మాణానికి నిధులు మంజూరుచేసినట్లు ప్రకటించినా, ఆ నీటిని పొలాల గుండా మళ్లించి, బట్టిలో కలిపే ప్రక్రియకు స్థానికులు అభ్యంతరం తెలపడంతో ఈ పనులు ప్రారంభం కాలేదు. కానీ స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ చెమటచుక్క చిందించకుండానే ఈ సమస్యను పరిష్కరించారు. కరజాడ మెయిన్ రోడ్డుకు ఇరువైపులా ఇళ్లు విస్తరించివున్నాయి. కానీ ఇంతవరకు మురుగుకాల్వ సదుపాయం వీరికి లేదు. చెంతనే వంశధార నది ఉన్నా, అందులోకి వాడుకనీరు చేరాýంటే కొందరు రైతుల పొలాల మీదుగా నీటిని మళ్లించాలి. దానిని ఇంతవరకు ఎవరూ అంగీకరించలేదు. కానీ ఎమ్మెల్యే శంకర్ ఇచ్చిన అభయం మేరకు స్థానిక రైతులు తమ జిరాయితీ నుంచి కాలువను తవ్వుకునే అవకాశం కల్పించారు. ఇందుకోసం ఎంపీడీవో, తహసీల్దార్, పోలీసు, సర్వే అధికారులతో గ్రామంలో సమావేశం నిర్వహించి, దాని ఎలైన్‌మెంట్ ఎలా వెళ్తుందో చూపించి, ఇందులో ప్రభుత్వ పోరంబోకు భూమి ఎంత ఉంది? రైతు జిరాయితీ నుంచి ఎంత త్యాగం చేయాలనేవి అక్కడికక్కడే చూపించడం వల్ల కాలువ తవ్వకానికి రైతులు అంగీకరించారు. ఎక్కడా భూసేకరణ జరపకుండా, నష్టపరిహారం లేకుండా రోడ్డును చెరువు రెండు వైపులా మÖడేసి అడుగుల చొప్ప్పున విస్తరించి రోడ్డు, కాలువలు నిర్మించారు. ఇంతవరకు ఎవరి ఇంటి ముందు వారే ఒక ఇంకుడు గుంత తవ్వుకొని వాడుకనీరును అందులోకి పంపేవారు. దీంతో పారిశుధ్య లోపం, దోమల బెడద, సీజనల్ వ్యాధులు వచ్చేవి. ఇప్ప్పుడు రోడ్డుకు ఇరువైపులా కాలువ పనులు పూర్తయిపోయినా బట్టిలోకి నీరు వెళ్లడానికి మార్గం సుగమం కాకపోవడంతో ఎమ్మెల్యే రంగప్రవేశం చేసి అధికారులతో సమావేశం ఏర్పాటుచేసి, ఇప్ప్పుడు మురుగునీరును బట్టిలోకి పంపించేందుకు అవసరమైన పనులను బుధవారం ప్రారంభించారు. 50 ఏళ్లుగా రోడ్లు, కాలువలు లేకపోవడమే కాకుండా కూటమి ప్రభుత్వం దీన్ని నిర్మించిన తర్వాత కూడా నీరు పూర్తిగా బట్టిలోకి వెళ్లడానికి మార్గం లేకపోవడంతో అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను ఎమ్మెల్యే శంకర్ పెద్దగా కష్టపడకుండానే పూర్తిచేయడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






Comments