top of page

చీరలో నిహారిక..

  • Guest Writer
  • Nov 3
  • 2 min read

ree

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక అమ్మాయిగా, ‘మెగా ప్రిన్సెస్‌’గా నిహారిక కొణిదెల తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి, ఆ తర్వాత నటిగా, నిర్మాతగా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ, తన అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటుంది. లేటెస్ట్‌గా నిహారిక షేర్‌ చేసుకున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వైట్‌ రెడ్‌ కాంబినేషన్‌లోని సంప్రదాయ చీరలో తెలుగు అమ్మాయిగా పర్ఫెక్ట్‌ గా మెరిసిపోతోంది. జడలో మల్లెపూలు, చేతికి గాజులతో ఎంతో హుందాగా, ప్రశాంతంగా కనిపిస్తోంది. ఆమె లుక్‌కి ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు.

నిహారిక కెరీర్‌ ప్రయాణం చాలా విభిన్నంగా సాగింది. బుల్లితెరపై యాంకర్‌గా ‘ఢీ’ వంటి పాపులర్‌ షోలతో ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత ‘ముద్దపప్పు ఆవకాయ్‌’ వంటి వెబ్‌ సిరీస్‌తో నటిగా మారి, యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకుంది. ‘ఒక మనసు’ సినిమాతో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమైంది. ‘హ్యాపీ వెడ్డింగ్‌’, ‘సూర్యకాంతం’ వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించినా, అవి ఆశించినస్థాయిలో విజయం సాధించలేకపోయాయి. దీంతో, నటనకు కొంచెం విరామం ఇచ్చి, ‘పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌’ అనే సొంత ప్రొడక్షన్‌ హౌస్‌ను స్థాపించింది. ఈ బ్యానర్‌పై కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ పలు సక్సెస్‌ఫుల్‌ వెబ్‌సిరీస్‌లను నిర్మిస్తోంది. ఇటీవల ఆమె నిర్మించిన కమిటీ కుర్రోళ్ళు సినిమాకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇక వ్యక్తిగత కారణాలతో కొన్నాళ్లు కెరీర్‌కు బ్రేక్‌ ఇచ్చిన నిహారిక, ఇప్పుడు మళ్లీ ఫుల్‌ యాక్టివ్‌ అయింది. తన ప్రొడక్షన్‌ హౌస్‌ పనులతో బిజీగా ఉంటూనే, కొత్త ప్రాజెక్టులపై దృష్టి సారిస్తోంది. నటిగా మంచి కమ్‌బ్యాక్‌ కోసం ఎదురుచూస్తూనే, నిర్మాతగా తన అభిరుచిని చాటుకోవడానికి సిద్ధమవుతోంది.

- తుపాకి.కామ్‌ సౌజన్యంతో...

అచ్చియమ్మా వచ్చేసిందహో!
ree

రామ్‌చరణ్‌ ‘పెద్ది’ సినిమా శరవేగంగా ముస్తాబవుతోంది. ఈ పాన్‌-ఇండియా చిత్రాన్ని బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో వెంకట సతీశ్‌ కిలారు నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్‌ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పెద్ది పోస్టర్స్‌, గ్లింప్స్‌కి మంచి స్పందన వచ్చింది.

తాజాగా హీరోయిన్‌ పాత్రను పరిచయం చేశారు. అచ్చియమ్మాగా జాన్వీ కపూర్‌ ఫస్ట్‌ లుక్‌ విడుదలైంది. భయానికి అర్థం తెలియని అచ్చియమ్మాగా రెండు లుక్స్‌ను రిలీజ్‌ చేశారు. వింటేజ్‌ గెటప్‌లో ప్రచారానికి వస్తున్నట్లుగా ఒక లుక్‌, మైక్‌ ముందు మాట్లాడుతున్నట్లుగా మరో లుక్‌. ఈ రెండు పోస్టర్స్‌ ఆకట్టుకుంటున్నాయి. బుచ్చిబాబు హీరోయిన్‌ పాత్రను చాలా బలంగా డిజైన్‌ చేశాడని టాక్‌. అచ్చియమ్మా పాత్ర జాన్వీ కపూర్‌ కెరీర్‌లో గుర్తుంచుకునే పాత్ర అవుతుందని యూనిట్‌ వర్గాలు చెబుతున్నాయి.

అన్నట్టు.. ఈ నెల 8న హైదరాబాద్‌లో ఏ.ఆర్‌. రెహ్మాన్‌ లైవ్‌ కాన్సర్ట్‌ జరగనుంది. ఇదే లైవ్‌ షోలో పెద్ది ఫస్ట్‌ సింగిల్‌ను లాంచ్‌ చేసే అవకాశం ఉంది. మార్చి 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. టీం ఇప్పటినుంచే ప్రమోషన్స్‌ ప్రారంభించడం మంచి పరిణామం.

బైకర్‌.. గెలుపు కాదు పోరాటం గొప్ప
ree

శర్వానంద్‌ మోటార్‌సైకిల్‌ రేసర్‌గా చేస్తున్న సినిమా బైకర్‌. అభిలాష్‌ రెడ్డి కంకర దర్శకత్వంలో యువి క్రియేషన్స్‌ ఈ సినిమాని నిర్మించింది. తాజాగా ఫస్ట్‌ ల్యాప్‌ గ్లింప్స్‌ ని రిలీజ్‌ చేశారు. ‘ఇక్కడ ప్రతి బైకర్‌ కి ఒక కథ ఉంటుంది. సమయంతో పోరాడే కథ. చావుకి ఎదురెళ్ళే కథ. ఏం జరిగినా పట్టు వదలని మొండివాళ్ళ కథ. ఇక్కడ గెలవడం గొప్పకాదు. చివరిదాక పోరాటం గొప్ప’ ఈ వాయిస్‌ ఓవర్‌ తో కూడిన గ్లింప్స్‌ సినిమా నేపధ్యాన్ని పరిచయం చేసింది. గ్లింప్స్‌ మొత్తం మోటార్‌సైకిల్‌ రేసింగ్‌ నే చూపించారు. శర్వా మరో ఇంటెన్స్‌ క్యారెక్టర్‌ చేస్తున్నాడని గ్లింప్స్‌ చూస్తే అర్ధమౌతోంది. ఈ సినిమాలో ఫ్యామిలీ డ్రామా కూడా వుంది. మాళవిక నాయర్‌ తో పాటు బ్రహ్మాజీ, అతుల్‌ కులకర్ణి లాంటి నటులు వున్నారు. అయితే ఈ వీడియోని మాత్రం కేవలం రేసింగ్‌ కి పరిమితం చేశారు. డిసెంబర్‌ 6న సినిమా రిలీజ్‌ చేస్తున్నారు. రేసింగ్‌ బ్యాక్‌ డ్రాప్‌ తెలుగులో సినిమాలు రావడం అరుదు. జానర్‌ పరంగా బైకర్‌ ఫ్రెష్‌గా కనిపిస్తోంది. మరి ఆడియన్స్‌ రెస్పాన్స్‌ ఎలా వుంటుందో చూడాలి.

- తెలుగు 360.కామ్‌ సౌజన్యంతో...

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page