top of page

చిరంజీవి గారూ.. మారండి సార్‌!!

  • Guest Writer
  • Aug 26
  • 3 min read
ree

తెలుగు ప్రేక్షకులు మీ మూస నుండి బైట పడ్డారు. దాన్నుండి మీరే బైటపడాలి ఇంక!! లేకుంటే మీ ఇర్రలెవెన్స్‌ కొనసాగుతూనే వుంటుంది. లార్జర్‌ దేన్‌ ద స్టొరీ ఇమేజ్‌ మీ శతృవు. ప్రతి సినిమాని ఓ బాధ్యతగా చూసే మా జనరేషన్‌ ఇప్పుడు లేదు. ఇరగతీసే ఫైట్ల కంటే ఏదో ఎమోషన్‌ కావాలి ఇప్పటి జనంకి. రియాల్టీ షోల్లో దద్దరిల్ల కొట్టే డాన్స్‌ షోలు ఫ్రీగా చూస్తున్న కాలంలో మీ ప్రాచీన కాలపు స్టెప్పులు, కాలేజ్‌ యానివర్సరీ స్టేజ్‌ పెర్ఫార్మెన్సెస్‌ వంటి ఐటం డాన్సులు...ఏమీ కిక్కివ్వవు. వందల రూపాయిలు ఖర్చుపెట్టి చూసే సినిమా ఇప్పుడు జస్ట్‌ వినోదం కాదు ప్రేక్షకులకి. వాళ్లు దాన్నో ప్రోడక్ట్‌ కింద కూడా చూస్తున్నారు. ప్రేక్షకుడిలో కూడా కన్సూమరిస్ట్‌ పెరుగుతున్నాడు. గోళ్లకు మట్టి అంటకుండా ఆన్లైన్‌ షాపింగ్‌ చేస్తూ ఇంటికొచ్చి డెలివరీ చేసిన వాటిని కూడా నిర్మొహమాటంగా తిరస్కరించే కన్సూమరిస్ట్‌ నేటి ప్రేక్షకుడు. రివ్యూలు చదివి మరీ గొప్పదైతేనే థియేటర్‌ కి వెళుతున్నాడు. బొమ్మ సరైన ప్ర్రోడక్టుగా బైటకి రాకపోతే ఇదివరకటిలా భారీ ఓపెనింగ్స్‌ తెచ్చుకునే సీన్‌ లేదు.

ప్రేక్షకులు హీరో కంటే కంటెంట్ని, దాని నేరేషన్ని ఎక్కువగా చూస్తున్నారు. కానీ మీ/మా దురదృష్టం ఏమిటంటే మీరింకా సినిమాకి కథ కన్నా, కథనం కన్నా మీరే ముఖ్యమనుకుంటున్నారు. అందుకే నక్సలైట్‌ పాత్ర వేసినా ఐటం సాంగ్స్‌ అనే భావ దారిద్య్రం నుండి అంగుళం బైటపడ లేకపోయారు. మిమ్మల్నో సూపర్మాన్‌ గా భావించే ఇప్పుడు యాభైల్లో పడ్డ మీ తీవ్రాభిమానులు కొందరు మిమ్మల్ని ఇంకా గుండెల్లో పెట్టుకోవచ్చు. నలభైల్లోకొచ్చిన కొత్త మధ్య వయస్కులు కూడా ఇంకా ఆ అభిమానాన్ని క్యారీ చేస్తుండొచ్చు. కానీ ఇప్పటి ఇరవైల తరానికి మీరు కంప్లీట్లీ ఔట్‌ డేటెడ్‌. వాళ్ల అభిరుచుల దరిదాపుల్లో మీరు లేరనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా. వాళ్లు హాలీవుడ్‌ సినిమాలు బ్రహ్మాండంగా ఫాలో అవుతున్నారు. వెబ్‌ సిరీసెస్లోని సహజత్వపు కరడుకట్టినతనాన్ని ఆదరిస్తున్నారు. ఓటీటీల ద్వారా సృజనాత్మకతకి పెద్ద పీట వేసే తమిళ్‌, మలయాళీ, మరాఠీ, హిందీ సినిమాల్ని ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇంకా ఎవరికి కావాలి మీ మూస ఫైట్స్‌, డాన్సులు?

ఇప్పుడు కొత్తగా ఆలోచించకపోతే, మీ వయసుకి మీరు గౌరవం తెచ్చుకునే పాత్రలు ఎంపిక చేసుకోకపోతే మీరు కేవలం ఓ గతంగా మిగిలిపోతారు. వర్తమానంలో మీకు స్థానం ఉండదు. మీరు ఔట్‌ డేటెడ్‌ అని గుర్తించాల్సి వస్తుంది. ఈ సందర్భంగా జంధ్యాలగారి ఎత్తిపొడుపు వంటి తిట్టు ఒకటి జ్ఞాపకం వస్తుంది. ‘‘మొజాయిక్‌ ఫ్లోర్‌ మీద ఆవాలు పోసి కొత్తిమీర మొలవలేదని దిగులుపడితే ఎలా?’’

నేనేం చిరంజీవిగారి అభిమానిని కాను. ఆయన పునర్వైభవాన్ని కాంక్షిస్తూ ప్రేమతో రాసిన పోస్టు కాదు ఇది. అలెటర్నేటివ్‌ సినిమా అభిమానిని. ఎంత కాదన్నా సినిమా ఒక పరిశ్రమ కదా. దాని జయాపజయాల ప్రభావం చాలామంది మీద ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాలుగు ఆరోగ్యకర వినోద ప్రధాన సినిమాలు వస్తే చాలనుకుంటా. మరో విషయం ఏమిటంటే ఈ పోస్టులోని కంటెంట్‌ రవితేజగారికి, నితిన్‌ గారికి, రామ్‌ గారికి....ఇలా మూస హీరోయిజాన్ని నమ్ముకున్న తెలుగు సినిమా హీరోగార్లందరికీ వర్తిస్తుంది.

- అరణ్య క్రిష్ట-

బ్లాక్‌ డ్రెస్‌లో మెరిసిన పాయల్‌
ree

ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ పాయల్‌ రాజ్‌పూత్‌. ఈ ఉత్తరాది ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో చాలా కష్టపడి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో తక్కువ సమయంలోనే మంచి ఆఫర్లు దక్కించుకుంది. ఆర్‌ఎక్స్‌ 100లో ఈమె చేసిన నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. ఇలాంటి అమ్మాయిలు కూడా ఉన్నారు అని ప్రతి ఒక్కరూ అనుకునే విధంగా ఆ సినిమాలో పాయల్‌ రాజ్‌పూత్‌ నేచురల్‌గా నటించి మెప్పించింది. ఆ తర్వాత చాలా వరకు ఐటెం సాంగ్స్‌ లో కనిపించడంతో పాటు, కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. కొన్ని సినిమాల్లో ముఖ్య పాత్రల్లోనూ నటించింది. ఈమెకు లక్‌ కలిసి రాకపోవడంతో స్టార్‌ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు దక్కలేదు అని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు.

పాయల్‌ రాజ్‌పూత్‌ క్లీ వేజ్‌ షో తాజాగా మరోసారి ఇన్‌స్టాగ్రామ్‌లో పాయల్‌ రాజ్‌ పూత్‌ షేర్‌ చేసిన ఈ ఫోటోల కారణంగా వార్తల్లో నిలిచింది. బ్లాక్‌ డ్రెస్‌ సాధారణంగానే ముద్దుగుమ్మలు చాలా అందంగా ఉంటారు. ఈ అమ్మడి అందంను ఈ బ్లాక్‌ లాంగ్‌ ఫ్రాక్‌ మరింతగా పెంచింది అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇంత అందంగా ఉన్న పాయల్‌ రాజ్‌ పూత్‌కి స్టార్‌ హీరోలకు జోడీగా ఎందుకు ఆఫర్‌ రాలేదు అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. లాంగ్‌ ఫ్రాక్‌ ధరించి టాప్‌ లో ఓపెన్‌గా ఉంచడంతో నెటిజన్స్‌ చూపు తిప్పడం కష్టంగా ఉందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. క్లీ వేజ్‌ షో చేస్తూ కవ్విస్తున్న ఈ అమ్మడి ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. ముందు ముందు కూడా ఈమె ఇంతే అందంగా మరిన్ని సినిమాలు చేయాలి అంటూ ఈమె ఫాలోవర్స్‌తో పాటు అభిమానులు అంటున్నారు.

మంగళవారం సినిమాకు ప్రశంసలు మొదటి సినిమా ఆర్‌ఎక్స్‌ 100 సినిమాలో చేసిన నెగిటివ్‌ పాత్రల తరహాలోనే కొన్ని సినిమాల్లో ఈమె నటించింది. ఆ మధ్య ఈమె చేసిన ఆర్‌డీఎక్స్‌ లవ్‌ సినిమాలతో పాటు మరికొన్ని బాక్సాఫీస్‌ వద్ద నిరాశ పరిచాయి. కానీ ఈమె చేసిన మంగళవారం సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా సినిమాలోని పాయల్‌ పోషించిన పాత్ర గురించి ప్రముఖంగా చర్చ జరిగింది. ఇలాంటి పాత్రలను చేసేందుకు ఎలాంటి హీరోయిన్‌ అయినా ముందుకు రాదు. ఆఫర్లు లేని సమయంలోనూ చాలా మంది ఇలాంటి పాత్రలకు వెనకాడుతారు. కానీ మంగళవారంలో పాయల్‌ పోషించిన పాత్ర ఆమెలోని నటిని బయటకు తీసింది. అంతే కాకుండా నటి అంటే అన్ని రకాల పాత్రలు చేయాలని చెప్పడానికి ఉదాహరణగా నిలిచింది. అందుకే ఆమె నుంచి మరిన్ని ఆ తరహా పాత్రలు, నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు వస్తాయని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

- తుపాకి.కామ్‌ సౌజన్యంతో...

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page