top of page

చీరందంలో మాళవిక మైమరిపించేలా!

  • Guest Writer
  • May 15
  • 3 min read


కేరళ కుట్టీ మాళవిక మోహనన్‌ టాలీవుడ్‌ ఎంట్రీకి ముందే తెలుగు ఆడియన్స్‌ ని ఊపేస్తోంది. ‘‘రాజాసాబ్‌’’తో టాలీవుడ్‌లో లాంచ్‌ అవుతున్నా? ఆ సినిమాతో సంబంధం లేకుండా క్రేజీ బ్యూటీగా మారిపోతుంది. ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఘాటు పోజులతో ఇంటర్నెంట్‌ సంచనలంగా మారడంతోనే ఇది సాధ్యమైంది. మాలీవుడ్‌.. బాలీవుడ్‌లో ఎలాగూ క్రేజ్‌ ఉంది. ఆ క్రేజ్‌ సైతం టాలీవుడ్‌కి కలిసొస్తుంది. రెండు పరిశ్రమల్లో ఇప్పటికే గ్లామర్‌ గేట్లు తెరిచేసేంది. సందర్భం వచ్చినప్పుడల్లా చిచ్చర పిడుగులా చెలరేగుతుంది. క్లీవేజ్‌ అందాలతో... థైషోస్‌తో యువతని ఆకర్షిస్తుంది. ఇన్‌స్టాలో సంచలనంగా మారుతుంది. సంప్రదాయ దుస్తుల్లో కనిపించడం చాలా అరుదు. తాజాగా అమ్మడు చీరందంలో తళుకులీన ఫోటో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతుంది. ఇందులో అమ్మడు బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ అమ్మడి స్కిన్‌ టోన్‌ తళత ళలాడిపోతుంది. చేతిలో మినీ హ్యాండ్‌ బ్యాగ్‌ అంతే హైలైట్‌ అవుతుంది.

నలుపు రంగు చీరపై మ్యాచింగ్‌ అదే రంగు రవిక ధరించి హోయలు పోయింది. చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ తో సెల్పీలు దిగుతూ రకరకాల భంగిమల్లో కెమారాకి ఫోజులిచ్చింది. పెదాలకు ఎర్రని లిప్‌ స్టిక్‌.. ఐబ్రోస్‌ మధ్యలో ఎర్రటి స్టికర్‌.. చెవులకు ధరించిన బులకాలు మాళవిక అందాన్ని రెట్టింపు చేసాయి. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌ అవుతుంది. మాళవిక సోషల్‌ మీడియా అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు పోస్ట్‌ చేస్తున్నారు. ఆ సంగతి పక్కనబెడితే మాళవిక రాజాసాబ్‌ ఎప్పుడు రిలీజ్‌ అవుదుందా? అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. కొంతమంది భామలు ఆన్‌సెట్స్లో ఉండగానే రెండు..మూడు ఛాన్సులందుకుంటే? ప్రభాస్‌ సరసన నటించినా మాళవికకు తెలుగులో కొత్త అవకాశాలు రాలేదు. అయితే బాలీవుడ్‌ లో మాత్రం ఛాన్సులు బాగానే అందుకుంటుంది.

తుపాకి.కామ్‌ సౌజన్యంతో...




రామ్‌ ఫ్యాన్‌ వార్‌!

ఈరోజు రామ్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన కొత్త సినిమా టైటిల్‌ ప్రకటించారు. ముందు నుంచీ అనుకొంటున్నట్టుగానే ఈ సినిమాకు ‘ఆంధ్రా కింగ్‌ తాలుకా’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. మహేష్‌ ఈ చిత్రానికి దర్శకుడు. గ్లింప్స్‌ లో.. కథేమిటన్నది స్పష్టమైంది. సూర్య అనే ఓ సూపర్‌ స్టార్‌ని ‘ఆంధ్రా కింగ్‌’ అని పిలుస్తుంటారు. తన అభిమాని కథ ఇది. ఓ ఫ్యాన్‌ బయోపిక్‌ అన్నమాట. ఈ సినిమాలో అప్పట్లో ఫ్యాన్‌ వార్స్‌ ఎలా జరిగేవి? అనే విషయాన్ని సైతం చూపించబోతున్నార్ట. ఇప్పుడంటే హీరోల అభిమానులు సోషల్‌ మీడియా సాక్షిగా కొట్టుకొంటున్నారు. అప్పుడు ఇలా ఉండేది కాదు. అభిమానుల మధ్య యుద్ధాలు వేరే రేంజ్‌లో జరిగేవి. వాటన్నింటినీ ఈ సినిమాలో చూపించబోతున్నారని తెలుస్తోంది. అంతేకాదు..హీరో తన ఊరి ప్రజల కోసం ఏం చేశాడన్న కాన్సెప్ట్‌ కూడా ఈ కథలో భాగంగా రానుంది. ఊరి ప్రజలు కరెంట్‌ లేక కష్టాలు పడుతొంటే, హీరో దాన్ని ఎలా సాధించాడన్నది చూపించబోతున్నారు. హీరో-ఫ్యాన్‌ మధ్య జరిగే డ్రామా కూడా చాలా ఇంట్రస్టింగ్‌ గా ఉండబోతోందట. కథగా కొత్తగానే అనిపిస్తోంది. నేపథ్యం కూడా ఇది వరకు చూడనిదే. కాబట్టి..ఫ్రెష్‌ ఫీల్‌ రావడం గ్యారెంటీ. రామ్‌ లో ఎనర్జీనీ, తన ఎంటర్‌టైన్‌మెంట్‌ లెవల్స్‌ నీ సరిగా వాడుకొంటే.. మంచి హిట్టు కొట్టినట్టే.

ఉపేంద్ర పాత్ర కోసం చాలామంది పేర్లు పరిశీలించారు. ఓ దశలో బాలకృష్ణతో ఈ రోల్‌ చేయిద్దామనుకొన్నారు. కానీ కుదర్లేదు. ఉపేంద్ర లుక్‌, తన క్యారెక్టరైజేషన్‌ చాలా సర్‌ప్రైజింగ్‌ గా ఉండబోతున్నాయట. భాగశ్రీ బోర్సే ఈ సినిమాలో కథానాయిక. త్వరలోనే తొలిపాటని విడుదల చేయబోతున్నారు. మరోవైపు విశ్వక్‌సేన్‌ ‘ఫంకీ’ అనే ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా కూడా సినిమా నేపథ్యంలో సాగే కథే. దానికీ, ఈ సినిమాకీ ఏమైనా లింకు ఉందేమో చూడాలి.





టిక్కెట్‌రేట్లపై బతిమాలుకోవడం ఇక బంద్‌!

ఏపీ ప్రభుత్వం టాలీవుడ్‌ కి ఓ తీపి వార్త చేర వేసింది. టికెట్‌ రేట్ల పెంపు విషయమై ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సీనియర్‌ నిర్మాత వివేక్‌ కూచిభొట్ల కూడా ఉన్నారు. ఓ పెద్ద సినిమా వస్తుందంటే టికెట్‌ రేట్ల గురించి ప్రభుత్వానికి అభ్యర్థనలు పంపడం, అనుమతులు వచ్చేంత వరకూ ఎదురు చూస్తూ కూర్చోవడం నిర్మాతలకు పెద్ద తలనొప్పి అయిపోయింది. ప్రతీసారీ జీవో కోసం ఎదురు చూడడం నిజంగా ఇబ్బందికరమైన వ్యవహారమే. దీనికి ఏపీ ప్రభుత్వం చెక్‌ పెట్టబోతోంది. ఈ కమిటీ ద్వారా టికెట్‌ రేట్‌ ఎంత ఉండాలి? అనే విషయమై నిర్మాతల అభిప్రాయం తీసుకొని, ఒక నిర్దుష్టమైన విధానాన్ని అమలు చేయాలన్నది ప్రభుత్వ యోచన. చిన్న, మీడియం, పెద్ద సినిమాలకు బడ్జెట్లని బట్టి తొలి మూడు వారాలూ టికెట్‌ రేట్లు డిసైడ్‌ చేస్తారు. ఇక అవే అమలు అవుతాయి.

గత జగన్‌ ప్రభుత్వ హయాంలో నిర్మాతలు బాగా ఇబ్బంది పడ్డారు. టికెట్‌ రేట్లు బాగా తగ్గించేసి, నిర్మాతల ఆదాయానికి గండి కొట్టే ప్రయత్నం చేసింది జగన్‌ సర్కార్‌. టికెట్‌ రేట్లపై ప్రభుత్వ అజమాయిషీ ఏమిటని చాలామంది ప్రశ్నించారు. పవన్‌ కల్యాణ్‌ సైతం అప్పట్లో జగన్‌ విధానాలపై పోరాడారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. నిర్మాతల కష్టనష్టాల్ని అర్థం చేసుకొని, వాళ్ల అభీష్టం మేరకు కొత్త చట్టాల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది కూటమి ప్రభుత్వం. అందులో భాగంగానే ఈ కమిటీ ఏర్పాటైంది. త్వరలోనే నిర్మాతలతో ఈ కమిటీ సభ్యలు సమావేశమై వాళ్ల అభ్యర్థనలు స్వీకరిస్తారు. ఆ తరవాత ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారు. అనంతరం టికెట్‌ రేట్లపై ఓ స్పష్టత వస్తుంది. ఇలాంటి ప్రయత్నమే తెలంగాణ ప్రభుత్వం కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది. టికెట్‌ రేట్లు పెంచమని ప్రతీసారీ ప్రభుత్వానికి మొర పెట్టుకొని, జీవోల కోసం ఎదురు చూసే బాధ తప్పుతుంది.

తెలుగు 360.కామ్‌ సౌజన్యంతో...

Коментари


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page