
రిలీజ్ డేట్ లాక్ చేశారు
ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న, డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్-ఇండియ మూవీ ‘కుబేర’. ఈ చిత్ర రిలీజ్ డేట్‌ను మేకర్స్ లాక్ చేశారు. జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
‘ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న, జిమ్ సర్భ్‌లతో కూడిన అద్భుతమైన తారాగణంతో ‘కుబేర’ భారతీయ సినిమాలో గేమ్-ఛేంజర్‌గా నిలుస్తుందనే నమ్మకాన్ని మేకర్స్ వ్యక్తం చేశారు.
‘క్యారెక్టర్ బేస్డ్ నెరేటివ్స్‌తో అదరగొట్టే శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని నెవర్ బిఫోర్‌గా తీర్చిదిద్దారు. ఇది ఈ సంవత్సరంలో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటిగా నిలిచింది. రిలీజ్ డేట్ పోస్టర్ నాగార్జున, ధనుష్‌లను ఇంటెన్స్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అద్భుతంగా ప్రజెంట్ చేసింది. జిమ్ సర్భ్ బ్యాక్‌డ్రాప్‌లో నిలబడి ఉండడం ఆసక్తికరంగా ఉంది. సినిమాలోని నాలుగు ప్రధాన పాత్రలను పరిచయం చేసిన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ అద్భుతమైన స్పందనతో అంచనాలను పెంచింది. ముఖ్యంగా ఇందులో ధనుష్, నాగార్జున, రష్మిక, జిమ్ సర్ఫ్‌ల పాత్రలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. అంతేకాదు ఈపాత్రల తీరుతెన్నులు ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్ చేస్తాయి. ఇన్నేండ్ల కెరీర్‌లో అటు ధనుష్, ఇటు నాగార్జున ఈ తరహా పాత్రల్ని పోషించలేదు. దీంతో ఈ సినిమా కోసం ఈ ఇద్దరు హీరోల అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ‘పుష్ప’సిరీస్, ‘ఛావా’ చిత్రాలతో దేశవ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక రష్మిక పాత్ర అందర్నీ మెస్మరైజ్ చేస్తుంది. సినిమాలో ఎంతో కీలకంగా ఉన్న ఈమె పాత్రను దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన విధానం సూపర్బ్‌గా ఉంటుంది. ఈ సినిమాతో ఆమె మరో స్థాయికి వెళ్తుందనే నమ్మకం ఉంది. తన సినిమాల్లో భావోద్వేగాలకు పెద్ద పీట వేసే దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ సినిమాలోనూ తనదైన మార్క్ ఎమోషన్స్‌ని పండిరచబోతున్నారు. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఎస్‌విసీ ఎల్‌ఎల్‌పి పతాకంపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో విడుదల కానుంది.
అన్ని సినిమాలు బలగం కాలేవు..!

వేణు యెల్దండి డైరెక్షన్ లో వచ్చిన బలగం సినిమా సెన్సేషనల్ హిట్ అందుకుంది. కమెడియన్ గా చేసిన వేణు ఇంత గొప్ప సినిమా ఎలా తీశాడు అనే రేంజ్ లో ఆడియన్స్ అంతా షాక్ అయ్యారు. సినిమా కథ కథనం నటీనటుల ప్రతిభ అన్నీ బలగం సినిమాకు కలిసి వచ్చాయి. అంతేకాదు ఆ సినిమాకు భీమ్స్ ఇచ్చిన మ్యూజిక్ కూడా సినిమాకు బలంగా నిలిచింది. ఊరు పల్లెటూరు సాంగ్ తోనే సినిమాపై ఒక బజ్ ఏర్పడిరది. ఐతే బలగం సినిమాను చూసి అలాంటి సినిమాలనే చేయాలని కొందరు ప్రయత్నించారు. ముఖ్యంగా వేణుతో సమకాలీకుడు అయిన కమెడియన్ ధన్ రాజ్ కూడా మెగా ఫోన్ పట్టి సినిమా చేశాడు. రామం రాఘవం అంటూ ఒక ఫాదర్ అండ్ సన్ సినిమా చేశాడు. ఐతే ఆ సినిమా లాస్ట్ వీక్ రిలీజ్ కాగా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. ఐతే డైరెక్టర్ గా వేణు సక్సెస్ అయ్యాడు కాబట్టి ధన్ రాజ్ సినిమా చేయలేదు. తనలో ఉన్న కథకుడిని ప్రేక్షకుడికి పరిచయం చేయాలని రామం రాఘవం చేశాడు. సినిమా ఫలితం ఏంటన్నది పక్కన పెడితే డైరెక్టర్ ధన్ రాజ్ పాస్ మార్కులు తెచ్చుకున్నాడనే చెప్పొచ్చు. ఇక బలగం తరహాలోనే ఈమధ్యనే బాపు అనే సినిమా ఒకటి రిలీజైంది. ఈ సినిమా కూడా బలగం ఫార్మెట్ లోనే వచ్చింది. ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది. ఐతే ఈ సినిమాలో బ్రహ్మాజి నటించడం వల్ల అందరికీ తెలిసింది కానీ సినిమా మాత్రం ఆడియన్స్ కు పెద్దగా ఎక్కలేదు. సో బలగం వచ్చింది కదా అని రామం రాఘవం, బాపు సినిమాలను చూసేయరు. ఒక సినిమా హిట్ అయ్యింది అంటే ఆ సినిమాకు అలా కుదురుతుంది మళ్లీ అలా సెట్ అవ్వాలి అంటే కష్టమే. ఐతే తెలుగు ఆడియన్స్ కూడా మంచి సినిమాలను ఆదరిస్తున్నారు కానీ ఒకటే ఫార్మెట్ లో రెండు మూడు సినిమాలు వస్తే మాత్రం ఆడియన్స్ ఆదరించే అవకాశం లేదు. ఐతే కథ కథనాలు నటీనటుల ప్రతిభ దర్శకుడి ఎఫర్ట్ గుర్తిస్తే మాత్రం ప్రేక్షకులు ఆ సినిమాను ఎంకరేజ్ చేసే ఛాన్స్ ఉంటుంది.
Comments