top of page

ట్రెజరీ డీడీపై విచారణ షురూ

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • Apr 30
  • 1 min read
  • రవికుమార్‌కు మెమో జారీ

  • రెండు వారాల్లో విచారణ నివేదిక ఇవ్వాలంటూ డైరెక్టర్ ఆదేశం

  • ఈలోగానే అస్మధీయులకు సీట్ల కేటాయింపునకు ఆఫీస్ ఆర్డర్లు రెడీ

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

శ్రీకాకుళం ఖజానా శాఖ డీడీ కార్యాలయంలో ఇటీవల జరుగుతున్న రచ్చపై ఆ శాఖ డైరెక్టర్ విచారణకు ఆదేశించారు. ఈలోగా డీడీ రవికుమార్‌కు విచారణాధికారి వనజారాణి బుధవారం మెమో జారీ ఇచ్చారు. ట్రెజరీలో ఏడుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసిన వ్యవహారం ట్రెజరీ హెడఆఫీస్‌కు చేరుకుంది. దీనిపై డైరెక్టర్ ట్రెజరీస్ జేడీగా పని చేస్తున్న వనజారాణిని విచారణకు నియమించారు. రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. అందులో భాగంగా వనజారాణి డీడీ రవికుమార్‌కు ఓ మెమో పంపించారు. ఈమేరకు కొన్ని ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు కావాలని కోరారు. ఏటీవో రమణారెడ్డి సెలవులో ఉన్నప్ప్పుడు ఆయన లాగిన్‌లోకి వెళ్లి కొన్ని బిల్లులు ఎందుకు పాస్ చేయాల్సివచ్చిందో డీడీ రవికుమార్ సమాధానం చెప్పాలన్నారు. ఇదే విషయాన్ని ‘సత్యం్ణ ఆధారాలతో సహా ట్రెజరీ సిరీస్‌లో రాసింది. అలాగే డైరెక్టర్ దగ్గర ఉద్యోగుల మీద ఫిర్యాదు చేసి, ఆయన నిర్ణయం వెలువరించక ముందే ఏడుగుర్ని అకస్మాత్తుగా సస్పెండ్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చిందన్న ప్రశ్నకు సమాధానం చెప్పాలని కోరినట్లు తెలుస్తుంది. అయితే ఈలోగా సస్పెండ్ అయినవారి స్థానాల్లో తనకు అనుకూలమైనవారిని నియమించడానికి డీడీ రవికుమార్ ఆఫీస్ ఆర్డర్లు తయారు చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల భోగట్టా. ఇదిలా ఉండగా, ఆర్ధిక శాఖామంత్రి పయ్యావుల కేశవ్ ఈ వ్యవహారంపై సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తుంది. స్వయంగా ట్రెజరీస్ డైరెక్టర్‌కు ఫోన్ చేసి శ్రీకాకుళం డీడీ కార్యాలయంలో ఏం జరుగుతోందని అడిగారని తెలుస్తుంది. దీనికి తోడు కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు కూడా డీడీ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి సీఐ ముందే రాజీ పడ్డామని ప్రకటించిన తర్వాత కూడా సస్పెండ్ చేయడమేమిటని డైరెక్టర్ మండిపడుతున్నట్లు తెలుస్తుంది. పత్రికల్లో వచ్చిన కథనాలపై సంజాయిషీ కావాలని డీడీ రవికుమార్‌ను అడిగితే, వాటిని ఖండించామంటూ సమాధానమిచ్చారని, అలాంటప్ప్పుడు మళ్లీ మళ్లీ పత్రికల్లో కథనాలు రావడం వెనుక ఏం జరుగుతోందంటూ మెమోకు రిప్లైగా సమాధానం చెప్పాలంటూ వనజారాణి కోరినట్లు తెలుస్తుంది

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page