top of page

ట్రిపుల్‌ ఐటీ విద్యార్ధి ఆత్మహత్య..!

Writer: BAGADI NARAYANARAOBAGADI NARAYANARAO
  • మూడో అంతస్తు నుంచి దూకిన ప్రవీణ్‌

  • క్యాంపస్‌లో వెంటాడుతున్న విషాదాలు

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

ఎచ్చెర్ల ట్రిపుల్‌ ఐటీ వసతి గృహంలో మూడో ఫ్లోర్‌ నుంచి బుధవారం అర్ధరాత్రి సివిల్‌ ఇంజినీరింగ్‌ మొదటి ఏడాది విద్యార్థి ఆర్‌.ప్రవీణ్‌నాయక్‌ దూకేశాడు. క్యాంపస్‌ అంబులెన్స్‌లో శ్రీకాకుళం రిమ్స్‌ ఆస్పత్రిలో చేర్చారు. కానీ ఫలితం లేకుండాపోయింది. చికిత్స అందిస్తుండగానే ఐటీ విద్యార్థి ప్రవీణ్‌ నాయక్‌ మృతి చెందాడు. ప్రవీణ్‌ నాయక్‌ సొంత గ్రామం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం. విషయం తెలుసుకున్న ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ కెవిజిడి బాలాజీ, పరిపాలన అధికారి ముని రామకృష్ణ, ఎస్సై సందీప్‌ కుమార్‌ అక్కడకు చేరుకున్నారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్రిపుల్‌ ఐటీలో ఏడాదికో విషాదం వెంటాడుతునే ఉంది. పీయూసీ, ఇంజనీరింగ్‌లో సుమారు 4,200 మంది విద్యార్ధులు విద్యనభ్యసిస్తున్నారు. 2022 సెప్టెంబర్‌ 7న ట్రిపుల్‌ ఐటీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిరది. అదే ఏడాది నవంబర్‌లో 30 మంది విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. మూడు రోజుల పాటు ఆసుపత్రుల్లో చికిత్స పొందారు. క్యాంపస్‌లోనే ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటుచేశారు. అంతా సవ్యంగా సాగుతుందన్న తరుణంలో సివిల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్ధి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. రెండేళ్ల క్రితం పీయూసీ రెండో ఏడాది చదువుతున్న విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన విద్యార్థిని బవిరి వశిష్ట రోహిణి(17) మధ్యాహ్నం పన్నెండున్నర సమయంలో వసతి గృహంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ రోజు నిర్వహించిన పరీక్షలు సక్రమంగా రాయనందున తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు స్నేహితులు చెప్పుకొచ్చారు. సరిగ్గా రెండేళ్ల తర్వాత మరోమారు ట్రిపుల్‌ ఐటీలో విషాదం చోటుచేసుకుంది. ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి మృతి పట్ల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సంతాపం తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రవీణ్‌ నాయక్‌ ఆత్మహత్య చేసుకోవడం పట్ల మంత్రి విచారం వ్యక్తం చేశారు. ఆత్మహత్యకు గల కారణాలు తక్షణమే తెలపాలని అధికారులకు, పోలీసులకు మంత్రి ఆదేశించారు.

ట్రిపుల్‌ ఐటీని తనిఖీ చేసిన ఎమ్మెల్యే

భవనం మీద నుంచి దూకి విద్యార్థి చనిపోయాడని తెలుసుకున్న ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్‌ క్యాంపస్‌ను గురువారం తనిఖీ చేశారు. ఏం జరిగిందన్న విషయం మీద ఆరా తీశారు. ఎమ్మెల్యేతో పాటు డీఎస్పీ వివేకానంద, తహసీల్దార్‌లు కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page