
ఢిల్లీ ప్రజల ఓటు ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వానికి వారిచ్చిన కితాబు కాదనీ, అది మోస పూరిత రాజకీయాలతో కేజ్రీవాల్ చేసిన ప్రయోగానికి ప్రజల తిరస్కారమని కాంగ్రెస్ అభిప్రాయపడితే వారికా హక్కుంది. దీనిలో కొద్దిగా వాస్తవం కూడా లేకపోలేదు. బీజేపీకి కిరీటం దక్కింది. ఢిల్లీ గద్దెను బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీ అప్పగించింది. కానీ వారి ఓట్లు ఇంకా ఆవిరైపోలేదని ఆప్ నమ్ముతుంది. ఇలా అనుకునే హక్కు వారికి పూర్తిగా ఉంది. 42 శాతం ఓటు వాటా అంటే చిల్లర కాదు. సుదీర్ఘకాలం పరిగెత్తడానికి అవసరమైన శక్తి, నమ్మకం కేజ్రీవాల్‌కు ఉన్నాయా అనేది వేచి చూడాల్సిన విషయం. కానీ నరేంద్రమోదీ పాలన తన పాటని, నేపథ్య సంగీతాన్ని మార్చుకునేలా చేసిన బలం వారిదేననే వాస్తవంతో కేజ్రీవాల్ అతని సహచరులు సంతృప్తి పొందవచ్చు. మూడు అంశాల్లో బీజేపీ భిన్నమైన బాణీని ఆలపించించేలా చేశామనే ప్రతిష్ట మాత్రం ఆప్‌కు దక్కుతుంది. మొదటిది వారికి ఇష్టమైన సైద్ధాంతిక నేపథ్యగీతం హిందూ-ముస్లిం పాటను అటకెక్కించాల్సి వచ్చింది. ఢిల్లీ ఎన్నికల ప్రచార ప్రారంభంలో ఢిల్లీ అభ్యర్ధి బీజేపీ పోటీదారులు మహారాష్ట్ర ఎన్నికల్లో మొదటగా తయారుచేసి ఆరెస్సెస్ కరుడుకట్టిన మనువాదులు వాడిన నినాదం- ఏక్ హైతో సేఫ్ హై (ఒకటిగా ఉంటే సురక్షితంగా ఉంటాం) ని ఎత్తుకున్నారు. అత్యంత వివాదాస్పదుడైన కపిల్ మిశ్రాకు అభ్యర్ధిత్వం ఇచ్చినా, బీజేపీ వాక్చాతుర్యం వాదనలన్నీ ఆప్ తప్పుడు పనులు దుస్సాహసాలపైనే కేంద్రీకృతం అయ్యాయి. ‘గోలీమారో సాలోంకో’ (వెధవల్ని తూటాతో కాల్చేయండి) అనే అనురాగ్ ఠాకూర్ లేడు. మోడీ-షా ద్యయం కూడా ధ్రువీకరణ రాజకీయాలపై వాళ్లు తగిలించుకున్న దురదను అణుచుకున్నారు. ఇది వ్యూహాత్మకంగా వెనక్కు తగ్గడమే అయినా బీజేపీని ఇలా వంచిన ఘనత కేజ్రీవాల్‌కు దక్కుతుంది. ఆప్ నుంచి మధ్య తరగతిని దూరం చేయాలని బీజేపీ భావించింది. దానికోసం రాజధానిలో అతివాద హిందుత్వవాదులను పూర్తిగా నియంత్రించింది. కేంద్రనాయకత్వం చుట్టూ గిరికీలు తిరుగుతున్న, కరుడుకట్టిన హిందూత్వ గుంపునకు నాయకుడైన ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్‌లో చేసినట్టుగా కాకుండా మోదీ సమూహం కొంత నిగ్రహం పాటించింది. అర్ధబలం, కండబలం గల మోదీకి రాజకీయాలకు, అత్యంత స్వీయకేంద్రిత రాజకీయం నడిపే కేజ్రీవాల్‌కు మధ్య ఎంపిక చేసుకోవడానికి ఢిల్లీ మధ్యతరగతి పెద్దగా ఏం ఆలోచించలేదు. ఇక రెండవది.. ఉచితాలు సంస్కృతిగా మోదీ స్వయంగా తిరస్కరించిన ఆప్ పాలన లోని సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని బీజేపీ వాగ్దానం చేసేలా చేసిన ఘనతగా కేజ్రీవాల్, అతని ఉద్రేకపూరితమైన మద్దతుదారులకు దక్కుతుంది. ఆప్ ప్రభుత్వం అందించిన రాయితీలు. ప్రజానుకూల పథకాలు కొనసాగిస్తామనే వాగ్దానం చేయడమే కాకుండా తానుగా కూడ తమ ఉచితాలను జోడిరచ వలసి వచ్చింది. ఇకపోతే ప్రభుత్వ అర్ధశాస్త్రవేత్తలు, ఇతర సాధారణ అనుచరులు బీజేపీ ఉచితాలు కాదని, అవి సంక్షేమ చర్యలనీ మనకు చెబుతారు. వాళ్లేం చెప్పినా ఈ పథకాల అమలుకు బీజేపీ కట్టుబడిరది. అది కూడా మోదీ గ్యారంటీతోనే. అయిష్టంగానైనా సరే ఈ రూపంలో ఎంతోకొంత సంపద పునఃపంపిణీకి అంగీకరించింది. చాలా అప్రమత్తంగా ఉండే ఆప్ నాయకత్వం, కార్యకర్తలు ఈ వాగ్దానాలు అమలు జరిగేలా చూస్తారని ఆశించవచ్చు. మూడవది తమ ఆర్ధిక/ ప్రాధాన్యతల గురించి తనను తాను గిల్లి చూసుకోవాల్సిన స్థితి ఢిల్లీ పోరువల్ల బీజేపీకి ఏర్పడిరది. ఎక్కువగా తన దృష్టిని పేదలపై కేంద్రకరించడం వలన ఆప్ పార్టీ పేద మధ్యతరగతి కూటమిలో పగుళ్లు ఏర్పడ్డాయనే ప్రచారమైన భారం నుంచి లబ్ధి పొందడానికి గాను కేంద్రప్రభుత్వం తన తాజా బడ్జెట్‌లో తన అలవాటుకు భిన్నంగా మధ్య తరగతికి భారీ ఆదాయపు పన్ను రాయితీలు కలగచేసింది. ఢిల్లీ జనాభాలో దాదాపుగా 67 శాతం మధ్యతరగతి వాళ్లని అంచనా. నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్ ఆటను ఎలా మార్చిందో నిరూపించడానికి ప్రొఫెషనల్ గణాంక నిపుణుల విశ్లేషణలను గమనిస్తే అర్ధమవుతుంది. సగం రాష్ట్రంపై రాజకీయ నియంత్రణ సాధించడానికి మోదీ ప్రభుత్వం లక్ష కోట్ల పన్ను ఆదాయం వదిలేసుకుంది. భవిష్యత్తు కోసం కొత్తగా ధనికులైన ఈ మధ్యతరగతి వినిమయచక్రం ప్రారంభిస్తారో లేదో? ప్రస్తుతానికి మాత్రం మోదీ ప్రభుత్వం అరవింద్ కేజ్రీవాల్ అనే ఒక ప్రమాదకర రాజకీయ వ్యక్తిత్వానికి ఇప్పటివరకైతే అడ్డుకున్నామనే తృప్తి పొందవచ్చు. మధ్యతరగతి కేజ్రీవాల్‌ను వదిలేసిందంటే దానికి కారణం కేజ్రీవాల్ ఇక ఎంతమాత్రం కొత్త తరహా రాజకీయాల ప్రతీకగా లేడని బీజేపీ సైద్ధాంతిక గురువులు, బీజేపీ అనుయాయులు భావించడం తప్పేమి కాదు. ఆప్ నుంచి దూరం కావడం అంటే మధ్యతరగతి విలువల తపనను, మంచి పరిపాలన అందించే వాగ్దానాలను వదిలేసు కుందని కాదు. ఈ తపనే మోదీకి అతిపెద్ద బలహీనతగా రుజువుకానుంది.
Kommentarer