
ఎచ్చెర్ల పోలీస్‌స్టేషన్ పరిధి తోటపాలెం పరిసర ప్రాంతాల్లో గంజాయి సేవిస్తున్న ఆరుగురు యువకులను పోలీసులు అదుపు లోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. నగరంలో గంజాయి వాడకం విచ్చలవిడి కావడంతో కొత్త ఎస్పీ దీని మీద ప్రత్యేక దృష్టి సారిం చారు. అందులో భాగంగా మఫ్తీలో ఉన్న పోలీసులు గంజాయి సేవిస్తున్న అడ్డాలపై దాడులు చేయగా తోటపాలెం వద్ద ఆరుగురు యువకులు దొరికారు. వీరిని ప్రశ్నించి నగరంలో గంజాయి బ్యాచ్ ఎవరన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఏయే వీధుల్లో ఎవరెవరు తాగుతున్నారన్న గుట్టు వీరి నుంచి రాబడు తున్నారు. గంజాయి తాగడం వరకు అలవా టున్నవారిని పునరావాస కేంద్రాలకు పంపినా ఫలితం ఉంటుంది కానీ, అమ్మేవారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదని ఎస్పీ భావిస్తున్నారు. మొత్తం నగరాన్ని జల్లెడ వేసి జిల్లా మొత్తం గంజాయి బాబులను పోలీస్‌స్టేషన్‌కు తరలించడానికి రంగం సిద్ధమైంది. వీరి ద్వారా గంజాయి విక్రయి స్తున్నవారిని పట్టుకొని నార్కోటిక్స్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని ఎస్పీ మహేశ్వరర్‌రెడ్డి భావిస్తున్నారు. ఇందులో భాగంగ తోటపాలెం వద్ద దొరికినవారిని వన్‌టౌన్‌లో పెట్టి ఆరా తీస్తున్నారు. ఈ విషయాన్ని పెద్దది చేసి గంజాయి ముఠా పారిపోకుండా పత్రికలు సహకరించాలని పోలీసు అధికారులు కోరుతున్నారు.
留言