top of page

‘ధర్మాన’ పలుకుబడితోనే ఫైల్‌ కదలడంలేదు

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • May 13
  • 1 min read
  • గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదుచేసిన బాధితురాలు

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

శ్రీకాకుళంలో ధర్మాన టీవీఎస్‌ అధినేత ధర్మాన ధర్మారావు రాజకీయ పలుకుబడి వల్లే ఆర్డీవో కోర్టులో ఉన్న ఆర్‌వోఆర్‌ అప్పీల్‌ నెంబరు 606 గత ఐదేళ్లుగా ఒక్క అడుగు ముందుకు కదలలేదని, ఇకనైనా దీనిపై సత్వర చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం అక్కయ్యపాలెం ఎన్జీవో కాలనీకి చెందిన గొలివి భవాని కలెక్టర్‌ను కోరారు. ఈమేరకు సోమవారం గ్రీవెన్స్‌లో ఆమె లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చారు. తనకు వివాహ కానుకగా ఇచ్చిన గిఫ్ట్‌డీడ్‌ ఎకరం భూమికి సంబంధించి పట్టాదారు పాస్‌పుస్తకం శ్రీకాకుళం తహసీల్దార్‌ జారీ చేసినప్పుడు అందులో వివాహ కానుక అనకుండా, వారసురాలిగా ఇవ్వాల్సినటువంటి వాటాలన్నీ ఇవ్వడానికి బద్దులమంటూ పేర్కొన్న భవానీ కుటుంబ సభ్యులు ఆ స్థలంలో లేఅవుట్‌ను అనుమతులు లేకుండా వేసి, ఫోర్జరీ సంతకాలతో లేఅవుట్‌ అప్రూవల్‌ అయినట్టు చూపించి తనకు వాటాగా వచ్చిన భూమిని రికార్డుల్లో లేని సర్పంచ్‌కు దారాధత్తం చేసిన కేసు కోర్టులో పెండిరగ్‌లో ఉందని, ఇందుకు సంబంధించి శ్రీకాకుళం ఆర్డీవో కోర్టులో 606/2020న దాఖలు చేయగా కనీస కదలిక లేదన్నారు. 2023లో మరోసారి ఇన్‌ట్రిమ్‌ పిటిషన్లు ఫైల్‌ చేశామని, ఇప్పటి వరకు ఇందుకు సంబంధించి ఒక్కసారి కూడా సమాచారం అందలేదన్నారు. తన తండ్రి సాధు వెంకటరమణ, తాత పేరుతో ఉన్న భూములకు పట్టాదారు పాస్‌పుస్తకాలు అక్రమంగా పుట్టించుకున్నారని, అప్పటి అధికారుల సంతకాల్లో కూడా తేడాలున్నాయని, ఈ పట్టాదారు పాస్‌పుస్తకాలను రద్దుచేసి, న్యాయపరంగా వ్యవహరించాలంటూ 2020లో ఆర్‌వోఆర్‌ అప్పీల్‌ కోసం ఫైల్‌ చేశామని, కానీ ఇప్పటి వరకు ఆ ఫైల్‌ ముందుకు కదలకపోవడం వెనుక రాజకీయ పలుకుబడి ఉందని ఆమె కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తన తాత తండ్రులకు చెందిన మూడెకరాల భూమిలో అక్రమ లేఅవుట్‌ వేయడం వెనుక అధికారుల సంతకాలు ఫోర్జరీ జరిగిందని, దీనిని చూపించి లేఅవుట్లలో ప్లాట్లను కోట్లాది రూపాయలకు అమ్మారంటూ క్రైమ్‌ నెంబరు 24/2020 పేరుతో రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు కూడా నమోదైందని, ప్రస్తుతం నిందితులపై కోర్టు విచారణ జరుగుతుందన్నారు. ఇదే భూమిలో ఒక ఎకరం చాపురం అప్పటి ప్రతినిధులకు రిజిస్టర్‌ చేశారని, అసలు సర్పంచ్‌కు బదులు నకిలీ సర్పంచ్‌ను ముందు పెట్టి రిజిస్ట్రార్‌ ఆఫీసులో రిజిస్టర్‌ చేయించారని, దీనిపై కూడా శ్రీకాకుళం టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫోర్జరీ సెక్షన్‌ నమోదై దర్యాప్తు జరుగుతుందని కలెక్టర్‌కు భవాని వివరించారు. ఈ రెండు కేసుల్లో నిజానిజాలు తేలాలంటే ఎస్‌ఎల్‌ఆర్‌, పాస్‌బుక్‌లు బయటకు రావాలని, అందుకే ఆర్డీవో కోర్టులో ఆర్‌వోఆర్‌ ప్రాప్తికి అప్పీల్‌ చేశామని, కానీ ఇంతవరకు రెవెన్యూ అధికారులెవరూ అటువైపు కన్నెత్తి చూడకపోవడానికి కారణం ధర్మాన ధర్మారావేనని కలెక్టర్‌కు వివరించారు.

1 comentario


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page