(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

స్థానిక విలేకరిగా సంస్థ నుంచి ఐడెంటిటీ కార్డు ఉన్న ఎన్ని రాజేష్ అనే వ్యక్తిని నకిలీ నోట్లు రవాణా చేస్తున్న కేసులో జి.సిగడాం పోలీసులు మూడు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. దాదాపు రూ.15 లక్షలు నకిలీ కరెన్సీతో మరో విలేకరికి చెందిన కారులో వెళ్తుండగా, జి.సిగడాం మండలం పెనసాం వద్ద పోలీసులు తనిఖీ చేసి ఫేక్ కరెన్సీగా గుర్తించినట్టు భోగట్టా. అనంతరం పోలీసు విచారణలో విలేకరి రాజేష్ చెప్పిన వివరాల మేరకు రవి అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. వీరిని శుక్రవారం పొందూరు కోర్టులో హాజరుపర్చి పోలీస్ కస్టడీకి తరలించనున్నట్టు తెలుస్తుంది. పూర్తి వివరాలు అందించేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. ఈ విచారణ ఇంకా పూర్తికాలేదని, ప్రస్తుతం నిందితుడు చెప్పిన పేర్లను కూడా పరిశీలించి జిల్లాలోకి ఎస్పీ వచ్చిన తర్వాత మరిన్ని అరెస్టులు ఉంటాయని తెలుస్తుంది.
Comentários